Siddham : ప్యాకేజీ స్టార్..బాబు ‘సిట్’ అంటే కూర్చుంటాడు.. ‘స్టాండ్’ అంటే నిలబడతాడు – జగన్

  • Written By:
  • Publish Date - March 10, 2024 / 07:20 PM IST

బాపట్ల జిల్లా మేదర­మెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభలో మరోసారి పవన్ కళ్యాణ్ ఫై జగన్ సెటైర్లు వేశారు. ‘ఈ ప్యాకేజీ స్టార్(Pawan Kalyan ) చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ దిగమంటే దిగుతాడు. తోయమంటే తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్లు డ్రామా ఆడమంటే ఆడతాడు’ అంటూ తనదైన స్టయిల్ లో జగన్..పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు.

త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) గత కొద్దీ రోజులుగా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ సిద్ధం అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఈరోజు ఆఖరి సిద్ధం సభను బాపట్ల జిల్లా మేదర­మెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఏర్పటు చేసారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై నిప్పులు చెరిగారు. ‘ఈ ప్యాకేజీ స్టార్ తనకు సైకిల్ సీటు కావాలని అడగడు. ఎందుకు నాకు ఇన్ని తక్కువ సీట్లు ఇస్తున్నావని క్వశ్చన్ చేయడు. కావాలంటే తాను తాగే టీ గ్లాసూ బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ దిగమంటే దిగుతాడు. తోయమంటే తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్లు డ్రామా ఆడమంటే ఆడతాడు’ అని సెటైర్లు వేశారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు. అధికారం పోతుందనే భయం లేదు. చెసేదే చెప్తాం. చెప్పామంటే చేస్తాం. హిస్టరీ బుక్‌లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే కోరిక అని జగన్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. కరోనా సమయంలో హామీలు అమలు చేశాం. 2024 తర్వాత కూడా మనం చేస్తున్న మంచి కొనసాగాలి. దేవుడి మీద తప్ప మీ అన్న పొత్తులు జిత్తులు నమ్ముకోలేదు. 2019కి ముందు మీకు మంచి భవిష్యత్తు అందిస్తానని మాటిచ్చా. 99 శాతం హామీలు అమలు చేశాం. మన సంక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. నాపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమే. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు 25 సీట్లు తెచ్చుకోవడమే మన టార్గెట్‌. మన నేతలు ఇంటి ఇంటికి వెళ్లి జరిగిన మంచి చెబుతున్నారు. పేదవారి భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి మీ అన్న గెలవాలని ..చంద్రబాబుకు ఓటేయడమంటే.. పథకాల రద్దుకు ఓటేయడమే అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : Siddham : ‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం’ – జగన్