Jagan Foreign Tour : విదేశీ టూర్ కు జగన్ సిద్ధం..

లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమతించాలిని నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ రిక్వెస్ట్ చేశారు. ఈనెల 15 నుంచి 30 వరకు లండన్, అమెరికాలో జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 09:59 PM IST

వైసీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan) విదేశాలకు వెళ్లేందుకు (Foreign Tour) సిద్ధం అవుతున్నాడు. ఈ మేరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుకుంటూ నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. సార్వత్రిక ఎన్నికల(AP Elections) నేపథ్యంలో గత కొద్దీ నెలలుగా జగన్ ఎంతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల నియామకం…మేనిఫెస్టో , ప్రచారం, ప్రత్యర్థుల ఫై మాటల యుద్ధం, ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ఇలా ఒక్కడే అన్ని చూసుకుంటూ ఎంతో బిజీ గా ఉంటూ వచ్చాడు. మరో మూడు రోజుల్లో ఎన్నికలకు శుభం కార్డు పడనుంది. మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది..జూన్ 04 ఫలితాలు రాబోతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమతించాలిని నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ రిక్వెస్ట్ చేశారు. ఈనెల 15 నుంచి 30 వరకు లండన్, అమెరికాలో జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు లండన్‌లో.. మరొకరు అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పక్షం రోజులు జగన్ దంపతులు.. వారి కుమార్తెల వద్ద ఉండనున్నారని తెలుస్తుంది.

దాదాపు పదిహేను రోజుల పాటు విదేశాల్లో గడపబోతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో ఎన్నికలు కాగానే వెంటనే ఫ్యామిలీతో విదేశాల్లో వెళ్లి గడిపి రావడం అలవాటు. అదే అలవాటును సీఎం జగన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. 2014, 2019 పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జగన్ విదేశాలకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్లాలని చూస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఎన్నికల పోలింగ్ ఫై దృష్టి సారించారు. మొన్నటి వరకు గెలుపు ఫై ధీమా గా ఉండే కానీ ..ఇప్పుడు కాస్త ఆయనలో భయం మొదలైనట్లు తెలుస్తుంది. దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి జోరు స్పష్టంగా కనిపించడం..ప్రజల్లో వైసీపీ అభ్యర్థుల ఫై వ్యతిరేకత చూపిస్తుండడంతో జగన్ లో ఎక్కడో ఓటమి భయం మొదలైందని అంత అంటున్నారు.

Read Also : KA Paul Election Campaign : తాటి ముంజలు కొడుతూ KA పాల్ వినూత్న ప్రచారం…