AP : మోసాలకు బాబు కేరాఫ్ – వివాహ వ్యవస్థకే మచ్చ పవన్ : జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను ఈ దత్త పుత్రుడు మార్చేస్తాడంటూ అనకాపల్లి స‌భాలో సీఎం జగన్ ధ్వజమెత్తారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘మహిళా దినోత్సవం (women’s Day) ముందురోజు అక్క […]

Published By: HashtagU Telugu Desk
Jagan Ank

Jagan Ank

ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను ఈ దత్త పుత్రుడు మార్చేస్తాడంటూ అనకాపల్లి స‌భాలో సీఎం జగన్ ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘మహిళా దినోత్సవం (women’s Day) ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం. అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది’’ అని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదు. అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించాం. వైస్సార్ చేయూత పథకంతో అందించిన మొత్తం రూ.19,189.60 కోట్లు. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం. అమ్మ ఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదన్నారు.

చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చిన మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు.‘‘2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా?. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు. కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్‌కారు ఇస్తామంటారు. చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు’’ అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Kohli IPL Participation: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఆడ‌తాడా..?

  Last Updated: 07 Mar 2024, 01:42 PM IST