Site icon HashtagU Telugu

Siddham : ‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం’ – జగన్

Jagan Tdp Alliance

Jagan Tdp Alliance

‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం. చంద్రబాబుకు ఉన్నట్లు నాకు పదిమంది స్టార్లు లేరు. స్టార్ క్యాంపెయినర్లు లేరు. అబద్ధాలకు రంగులు పూసే మీడియా లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా ప్రజల బలమే’ అని సిద్ధం సభ(Siddham Meeting)లో జగన్ అన్నారు.

రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ సిద్ధం అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు సీఎం జగన్. ఈరోజు ఆఖరి సిద్ధం సభను బాపట్ల జిల్లా మేదర­మెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఏర్పటు చేసారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా జగన్ (Jagan Speech on Siddham) మాట్లాడుతూ.. మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని .. ‘చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలున్నాయి. వీరితో పాటు బాబు జేబులో మరో జాతీయ పార్టీ ఉంది. వీరంతా మన భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ను ఓడించడానికి వాళ్లు చూస్తున్నారు. పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా.. దక్షిణ కోస్తా సిద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్‌ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్‌ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు. ‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం. చంద్రబాబుకు ఉన్నట్లు నాకు పదిమంది స్టార్లు లేరు. స్టార్ క్యాంపెయినర్లు లేరు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా ప్రజల బలమే’ అని జగన్ తెలిపారు.

Read Also : Phil Salt: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి సాల్ట్‌.. ఎవ‌రి స్థానంలో అంటే..?

Exit mobile version