జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాషాయ మనిషిగా మారినట్లేనా..? అవుననే అంటున్నారు వైసీపీ (YCP) శ్రేణులు. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా పవన్ తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. గతంలో ఇంత తీవ్రంగా హిందూత్వ, సనాతన ధర్మం (Sanātana Dharmam)పై పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాదనను వినిపిస్తూ వస్తున్నారు. దీంతో ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ ఇలా చేస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిన్న తిరుపతి సభ (Tirupathi Sabha) లో కూడా పవన్ కళ్యాణ్ మొత్తం సనాతన ధర్మంపైనే మాట్లాడుతూ వచ్చారు. అయితే కొంతమంది పవన్ స్పీచ్ ఫై హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఈ తరుణంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘అసలు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా?’ అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. సాక్ష్యాత్తు చంద్రబాబు మీ కళ్లెదుటే తప్పు చేశాడు. అది తప్పు అని సామాన్యుడికే కాదు ఆరేళ్ల పిల్లాడికి కనిపిస్తుంది. మీ కళ్లెదుటే తప్పు కనిపిస్తుంటే.. వెంకటేశ్వరస్వామి ప్రతిష్టతను, విశిష్టతను తగ్గిస్తూ రాజకీయ లబ్ధి పొందెందుకు చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. అందులో పవన్ కూడా భాగమై..నువు కూడా అబద్ధాలకు రెక్కలు కట్టి అడుగులు ముందుకు వేస్తున్న నువు సనాతన ధర్మం గురించి మాట్లాడటం కరెక్టేనా?
ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును గుడ్డిగా సమర్ధించడం మొదలుపెట్టడం ఎంతవరకు ధర్మం. తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఈ ఆధారాలు చూపిస్తున్నాం. టీటీడీలో దశాబ్ధాలుగా ఉన్న ప్రాక్టిస్‌ను చూపించాను. మన లడ్డూ విశిష్టతను గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి..మన స్వామి వారి విశిష్టతను మనమే తగ్గించడం..మళ్లీ మనమే సనాతన ధర్మం అనడం ఏరకంగా ధర్మం? అని జగన్ ప్రశ్నించారు.
ఇక పవన్ సనాతన ధర్మం ఫై చేసిన వ్యాఖ్యలపై చాలామంది స్పందిస్తున్నారు. సనాతన ధర్మం అనేది పవన్‌కళ్యాణ్ తోనే రాలేదు.. ఆయనతోనే పోదు. తరతరాలుగా సనాతన ధర్మం నడుస్తూనే ఉంది. అయితే.. ఒడిదుడుకులు ఎప్పుడూ ఎదురయ్యాయి. ఆ మాటకొస్తే.. అన్ని మతాలకు.. ఇవి కామనే. మన దగ్గరలేదు కానీ.. పాశ్చాత్య దేశాల్లో క్రిస్టియన్లు.. ఇతర మతాలను అనుసరిస్తున్న విషయం.. దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు, విమర్శలు వస్తున్న విషయం పవన్‌కు తెలియంది కాదు.
అలానే.. ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మంపైనా.. మెజారిటీ ప్రజలు అనుసరించే ధర్మంపైనా ఎప్పుడూ ఏదో ఒక రూపంలో దాడి జరుగుతూనే ఉంటుంది. జరిగింది కూడా. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. మహమ్మదీయుల నుంచి తురష్కుల వరకు హిందూ ధర్మంపై దాడి చేయని మొఘల్ చక్రవర్తులు లేరు. ఎక్కడొ ఒకరిద్దు తప్ప. కాబట్టి.. ఇప్పుడు ఇంత సీరియస్‌గా వ్యాఖ్యలు చేసినా.. వాటిని ఏమేరకు ఆచరణలో పెడతారనేది చర్చనీయాంశం. పవన్ కోరుకుంటున్నట్టు సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేయడం సాధ్యమేనా? అనేది ప్రశ్న.
Read Also : Vitamin D : విటమిన్ డి లోపం పిల్లలలో రికెట్స్ ప్రమాదాన్ని పెంచుతుంది..!