Jagan Final Survey : సిట్టింగ్ లు 40 మందికి ఎస‌రు? `ముంద‌స్తు`కు జ‌గ‌న్ దూకుడు!!

Jagan Final Survey :  ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశ్వ‌రూపాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూడ‌బోతున్నారు. స‌ర్వే రిపోర్ట్ ఆయ‌న చేతిలో ఉంది.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 01:54 PM IST

Jagan Final Survey :  ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశ్వ‌రూపాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూడ‌బోతున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మంపై స‌ర్వే రిపోర్ట్ ఆయ‌న చేతిలో ఉంది. దాని ఆధారంగా రాబోవు రోజుల్లో టిక్కెట్ల‌ను ఫైన‌ల్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన మీటింగ్స్ లో ఆయ‌న వెల్ల‌డించారు. క‌నీసం 40 మందికి పైన ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేద‌ని అప్ప‌ట్లోనే తేల్చారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప్రోగ్రామ్ ను విజ‌య‌వంతంగా కొంద‌రు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. మిగిలిన వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆశించిన విధంగా లేద‌ని తెలుస్తోంది.

40 మందికి పైన ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేద‌ని..(Jagan Final Survey)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఇటీవ‌ల జ‌రుగుతోన్న ప్ర‌చారం. దానికి అనుగుణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడుగులు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీకి కూడా ముంద‌స్తు గురించి చెప్పార‌ని తెలుస్తోంది. అందుకే, కేంద్రం నుంచి నిధుల‌ను విడుద‌ల చేశార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. అంతేకాదు, ఇటీవ‌ల బ‌ట‌న్ నొక్కే కార్య‌క్ర‌మాల్లో రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు సంకేతాలు ఇస్తున్నారు. డిసెంబ‌ర్లోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి (Jagan Final Survey ) సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది.

 ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు

ద‌స‌రా రోజున విశాఖ నుంచి ప‌రిపాల‌న సాగించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన భ‌వ‌నాల‌ను కూడా సిద్ధ‌మ‌య్యాయి. గ‌త మూడేళ్లుగా అనుకుంటోన్న ఆయ‌న ఆలోచ‌న ఇప్పుడు కార్య‌రూపం దాల్చ‌నుంది. క్యాంపు ఆఫీస్ ను విశాఖప‌ట్నంకు త‌ర‌లిస్తున్నారు. అధికారుల‌కు భ‌వ‌నాల‌ను కూడా సిద్ధం చేశారు. అక్క‌డికి షిష్ట్ అయిన త‌రువాత ఎన్నిక‌ల వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెడ‌తార‌ని తెలుస్తోంది. అందుకు కోసం రిహార్స‌ల్స్ గా బుధ‌వారం స‌మీక్ష స‌మావేశం (Jagan Final Survey ) ఉండ‌నుంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Countdown for Jagan : టీడీపీకి మంచిరోజులు.! జ‌గ‌న్ పై మోత్కుప‌ల్లి తిరుగుబాటు !!

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి 5 నుంచి 7 ఎంపీ స్థానాలు మాత్ర‌మే గెలుచుకునే స‌త్తా ఉంద‌ని ఇటీవ‌ల ఇండియా టుడే, సీ ఓట‌ర్ ఇచ్చిన స‌ర్వే అంచ‌నా. ఆ లెక్క‌న ఎమ్మెల్యేల సంఖ్య కేవ‌లం 30 నుంచి 40 మంది మాత్ర‌మే ఉంటార‌ని తేల్చింది. ఇప్పుడు చంద్ర‌బాబును జైలుకు పంపిన త‌రువాత వైసీపీ గ్రాఫ్ మ‌రింత ప‌డింద‌ని వినిపిస్తోంది. ఆ క్ర‌మంలో సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. జ‌నం నుంచి 80శాతం మ‌ద్ధ‌తు ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నమ్ముతున్నారు. కానీ, ఎమ్మెల్యేల మీద గుడ్ విల్ లేద‌ని ఆయ‌న స‌ర్వేల్లోని సారాంశం. అందుకే, క‌నీసం 40 మందికి టిక్కెట్లు ఇవ్వ‌డానికి అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం జ‌రిగే మీటింగ్ లో చెబుతార‌ని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ‌ట‌.

Also Read : Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత కు భారీ ఊరట

ముంద‌స్తు ఎన్నిక‌ల సంకేతాల‌ను కూడా ఈ మీటింగ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే 17 రోజులుగా చంద్ర‌బాబును జైలులో ఉంచ‌గ‌లిగిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల‌కు వ‌ర‌కు ఉంచ‌డానికి ఛాన్స్ లేదు. అందుకే, లోకేష్ ను కూడా అరెస్ట్ చేసిన త‌రువాత ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌డానికి ఎత్తుగ‌డ వేసిన‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంప‌డం ద్వారా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని వ్యూహాల‌ను రచించార‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే, తెలంగాణ‌తో పాటు ఏపీ ఎన్నిక‌లు ఉండ‌డం ఖాయం. దానికి సంబంధించిన సంకేతాలు బుధ‌వారం జ‌ర‌గ‌బోయే స‌మావేశంలో క్లారిటీ ఇవ్వ‌నున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.