Site icon HashtagU Telugu

Jagan Cheap Politics : జగన్ ఎగిరెగిరి పడేది వాళ్లను చూసుకొనేనా..?

Jagan Fans

Jagan Fans

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ (Jagan) నిర్వహిస్తున్న సభలు, యాత్రలు ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా, తన పార్టీకి ప్రాణవాయువుల్లా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నెలకొన్న సంఘటనలు చూస్తే..జగన్ యాత్రలలో అతని కారు బోనెట్‌పై అభిమానులు చిందులేస్తూ కనిపించడం, అదే సమయంలో ఓ అభిమాని శింగయ్యను కారు తొక్కడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ప్రజల హితంపై కన్నేసిన నేతల చుట్టూ “లంపెన్లు” (ఆర్థికంగా స్థిరత్వం లేని వారు.. పనులు చేయడానికి బద్దకించేవారు, కుటుంబ బాధ్యతలు లేని వారు.. ఉన్నా పట్టించుకోని వారు, తాగుడు, గంజాయిలకు అలవాటు పడిన వారిని “లంపెన్లు” అంటారు) లను ఉద్దేశపూర్వకంగా చేర్చడం రాజకీయ శైలిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Nabha Natesh : న‌భా..అబ్బ‌బ్బా! టెమ్ట్ చేస్తోన్న క‌న్న‌డ భామ‌

రాజకీయ పార్టీలు పల్లె నుంచి పట్టణాల వరకు లంపెన్లపై ఆధారపడుతూ పార్టీ నడిపే పరిస్థితులు వచ్చాయి. చదువు లేకపోయినా, చదువుకున్నా… మార్గదర్శనం లేకపోయిన యువతను వాడుకుంటూ వారేమైనా చిన్న చిన్న నేరాలకు పాల్పడితే..వారిని బయటకు తీసుకొస్తూ పార్టీకి అనుబంధితులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్యాచ్ లను గంజాయి, లిక్కర్, పంచాయితీ రాజకీయాల దాకా విస్తరిస్తూ ప్రజాస్వామ్య స్థాయిని దిగజారుస్తున్నారు. సదరు యువకులు తమ వెనుక జగన్ అండ ఉందంటూ వారంతా మరింత రెచ్చిపోతున్నారు. మంచి కోసం పోరాటం చేయడం మానేసి చెడును ప్రోత్సహిస్తూ అనేక నేరాలకు పాల్పడడమే కాదు నేరగాళ్లుగా మారుతున్నారు.

ప్రస్తుతం జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలు ప్రజా సమస్యలపై కాకుండా వైఎస్సార్‌సీపీకి కొత్త ఊపునివ్వాలనే రాజకీయ లక్ష్యంతోనే సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది కొంతమంది అల్లరి మూకలను వెంటవేసుకొని మాకు తిరుగులేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడని అంత చివాట్లు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనప్పటికీ అదే పంథాలో వెళ్తూ ఇంకాస్త దిగజారుతున్నాడని అంత విమర్శిస్తున్నారు. మరి జగన్ ఎప్పుడు మారతాడో చూడాలి.