Chandrababu Arrest : నారా లోకేష్ కు ధైర్యం చెప్పిన జగన్ కుటుంబ సభ్యులు..

జగన్ ఫై పీకల్లోతు కోపంతో ఉన్న ఓ నేత... జగన్ మిమ్మల్ని ఏం చేయలేడు..ధైర్యంగా ఉండండి..ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరిగింది

  • Written By:
  • Updated On - September 14, 2023 / 03:25 PM IST

చంద్రబాబు (Chandrabau) ను అరెస్ట్ చేయించాం..జైలు కు తరలించాం..ఇక మనకు ఎదురులేదు..అంటూ జగన్ & బ్యాచ్ (YCP) సంబరాలు చేసుకుంటుంది..కానీ చంద్రబాబు ను అరెస్ట్ చేయించడమే తాము చేసిన పెద్ద తప్పు అని తెలుసుకునే రోజులు దగ్గరపడతాయని అంటున్నారు ప్రజలు. చంద్రబాబు అరెస్ట్ తో టిడిపి పని అయిపోయినట్లే..ఎవరు కాపాడలేరు..ఇక మన ఫ్యాన్ కు తిరుగులేదని స్వీట్స్ పంచుకుంటూ..బాణా సంచా కాలుస్తూ వైసీపీ నేతలు పండగ చేసుకుంటుంటే..ప్రజలు మాత్రం అయ్యో తప్పు చేయని చంద్రబాబు ను అరెస్ట్ చేశారే..? ఓ మాజీ సీఎం ను అరెస్ట్ చేసారు..ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి..? ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిని జైల్లో పెడతారు..అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇదే సందర్బంగా చంద్రబాబు తనయుడు లోకేష్ (Lokesh) కు ఫోన్లు చేసి పరామర్శిస్తూ…ధైర్యం చెపుతున్నారు. తాజాగా జగన్ పార్టీ నేతలతో పాటు..ఆయన కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో…ఇతర దేశాల్లో కూడా జగన్ ఫై వ్యతిరేకత పెరిగింది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి..? అది కూడా తనకు సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తూ..లోకేష్ కు , టీడీపీ పార్టీ కి సపోర్ట్ ఇస్తున్నారు.

ఇప్పటివరకు లోకేష్ కు టీడీపీ శ్రేణులు , నేతలు , సినీ ప్రముఖులు , ఇతర పార్టీ నేతలు ఫోన్ చేయడం..కలిసి మాట్లాడడం..ధైర్యం చెప్పడం చేసారు. వీరంతా ఒకెత్తయితే..జగన్ పార్టీ లోని కొంతమంది ఎమ్మెల్యేలు , ఎంపీ లతో పాటు కుటుంబ సభ్యులు కూడా లోకేష్ కు ఫోన్ చేసి పరామర్శించినట్లు తెలుస్తుంది. రాయలసీమ కు చెందిన అధిక పార్టీ ఎమ్మెల్యేలతో పాటు , ఉభయ గోదావరి కి చెందిన పలువురు వైసీపీ ఎంపీలు లోకేష్ కు ఫోన్ చేసి సానుభూతి తెలిపారట. ఇలా ఫోన్లు చేసి సానుభూతి తెలిపిన విషయం చాలామంది టీడీపీ నేతలకు కూడా తెలియదని అంటున్నారు. వీరిలో జగన్ ఫై పీకల్లోతు కోపంతో ఉన్న ఓ నేత… జగన్ మిమ్మల్ని ఏం చేయలేడు..ధైర్యంగా ఉండండి..ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరిగింది..రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ది చెపుతారని ఫోన్లో అన్నాడట. అంతే కాదు ఈయన త్వరలోనే టీడీపీ లో చేరే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. అలాగే దక్షిణ కోస్తాకు చెందిన ఓ ఎంపీ కూడా భువనేశ్వరి తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారట. తమ నాయకుడు చేసిన పనికి క్షమాపణలను కూడా కోరాడట. చంద్రబాబు మాకు మంచి మిత్రుడని..ఆయనకు ఇలా జరగడం దారుణమని ..ఈ కేసులో తప్పకుండా చంద్రబాబు బయటకు వస్తారని చెప్పి లోకేష్ కు భరోసా ఇచ్చారట.

Read Also : TDP- Janasena Alliance : టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

వీరంతా కూడా లోకేష్ తో గత కొంతకాలంగా టచ్ లో ఉంటున్నారు కాకపోతే ఈ విషయానికి ఎవరికీ తెలియదు..ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావడం..ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో..ఇక బయటకు వస్తున్నట్లు చెపుతున్నారు. వీరంతా ఒకెత్తయితే..జగన్ కుటుంబ సభ్యులు షర్మిల (YS Sharmila)..బ్రదర్ అనిల్ (Brother ANil) లు సైతం లోకేష్ కు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడమే కాదు జగన్ ఫై విమర్శలు కూడా చేశారట. అనిల్ అయితే చంద్రబాబు కోసం ప్రార్థనలు కూడా చేస్తామని చెప్పారట. అలాగే భువనేశ్వరి తో షర్మిల మాట్లాడుతూ..మీరే కాదు మీముకూడా జగన్ బాధితులమే అని..మమ్మల్ని కూడా జగన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసాడని వారు చెప్పుకొని బాధపడ్డారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం లో ఎంత నిజం ఉందనేది స్పష్టంగా తెలియనప్పటికీ..చాలామంది మాత్రమే ఇది నిజమే అని అంటున్నారు.