Site icon HashtagU Telugu

Jagan Family Drama : అంతఃపురంలో అల‌జ‌డి! విజ‌య‌మ్మ‌కు మొఖంచాటేసిన‌ సజ్జ‌ల‌!

Jagan Family Drama

Jagan Family Drama

అంతఃపుర ర‌హ‌స్యం బ‌య‌టకు రానుందా? లోట‌స్ పాండ్ కు ప‌రిమిత‌మైన విజ‌య‌మ్మ బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చారు?(Jagan Family Drama) ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ను ఇంటికి ఎందుకు వెళ్లారు? ఇప్పుడే ఇదే పెద్ద రాజ‌కీయ హాట్ టాపిక్‌. గ‌త మూడేళ్లుగా అంతఃపుర వైరం ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట ప‌డుతోంది. ప్ర‌త్యేకించి స్వ‌ర్గీయ వైఎస్ జ‌యంతి, వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇడుపులపాయ వేదిక‌గా పొడ‌చూపుతోంది. అన్నాచెల్లెలు వేర్వేరుగా క‌నిపిస్తున్నారు. ఆస్తుల వివాదం వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఉంద‌ని ఒక వాద‌న‌. రాజ‌కీయ వైరుధ్యం ఉంద‌ని మ‌రో వాద‌న కూడా వైసీపీ వ‌ర్గాల్లో లేక‌పోలేదు. తోడ‌బుట్టిన చెల్లెల్ని దూరంగా పెట్టారు జ‌గ‌న్. త‌ల్లి విజ‌య‌మ్మ‌(Vijayamma)ను కూడా ప్లీన‌రీ వేదిక‌గా చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌కు పంపారు. అప్ప‌టి నుంచి ఎవ‌రి గోల‌వాళ్ల‌దే అన్న‌ట్టుగా ఉన్నారు.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఇంటికి విజ‌య‌మ్మ (Jagan Family Drama)

హ‌ఠాత్తుగా విజ‌య‌మ్మ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కానీ, ఆ స‌మ‌యంలో ఆయ‌న లేక‌పోవ‌డం విచిత్రం. సాధార‌ణంగా ముందుగా స‌మాచారం ఇచ్చిన త‌రువాత మాత్ర‌మే విజ‌య‌మ్మ వెళ్లి ఉంటారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా స‌జ్జ‌ల త‌ప్పుకున్నారా? తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి వ‌చ్చిన సంకేతం ఆధారంగా మొఖంచాటేశారా? అనేది అంతఃపుర రహ‌స్యంగా మారింది. ఆయ‌న ఇంటికి వెళ్లి బయ‌ట‌కు వ‌స్తోన్న విజ‌య‌మ్మ విజువ‌ల్స్ మాత్రం మీడియా దొరికాయి. దీంతో ప‌లు ఊహాగానాలు బ‌య‌లు దేరాయి. స‌యోధ్య కోసం విజ‌య‌మ్మ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఒక వాద‌న‌గా ఉంది. రాబోయే రోజుల్లో ఏపీలోకి ష‌ర్మిల ఎంట్రీ ఇస్తున్నార‌ని సంకేతం ఇవ్వ‌డానికి వ‌చ్చార‌ని మ‌రో వాద‌న‌గా(Jagan Family Drama) వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరితో, ఏపీలోకి కూడా ష‌ర్మిల ఎంట్రీ

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏదో ఒక ర‌కంగా రాజ‌కీయంగా స్థిర‌ప‌డాల‌ని ష‌ర్మిల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి ఆమె మంత‌నాలు సాగిస్తున్నార‌ని ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌చారం. ఆ ప్ర‌చారాన్ని ఆమె కొట్టిపారేస్తున్న‌ప్ప‌టికీ బెంగుళూరు కేంద్రంగా డీకే శివ‌కుమార్ ద్వారా ఏదో జ‌రుగుతుంద‌న్న అనుమానం మాత్రం రాజకీయ‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో చేరితో, ఏపీలోకి కూడా ష‌ర్మిల ఎంట్రీ ఉంటుంది. అప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రియాక్ష‌న్ తీవ్రంగా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే, ముందుగా సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి విజ‌య‌మ్మ(Vijayamma) వెళ్లారా? అనే వాద‌న వినిపిస్తోంది. ఇక చాలా కాలంగా ఉన్న ఆస్తుల వివాదాల ప‌రిష్కారం కోసం స‌జ్జ‌ల ద్వారా లైజ‌నింగ్ చేయ‌డానికి విజ‌య‌మ్మ చేసిన ప్ర‌య‌త్నంగా భావిస్తున్నారు.

Also Read : Jagan Cabinet 3.0 : `ముంద‌స్తు` లేదు! మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న‌ మూడోసారి షురూ?

లోట‌స్ పాండ్, తాడేప‌ల్లి ప్యాలెస్ మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ‌, కుటుంబ, ఆస్తి వివాదాల న‌డుమ అంతఃపుర (Jagan Family Drama)అల‌జ‌డి గురువారం కొత్త మ‌లుపు తిరిగింది. లోట‌స్ పాండ్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన విజ‌య‌మ్మ ఇప్పుడు తాడేప‌ల్లి ప్యాలెస్ ఆయువులాంటి స‌జ్జ‌లను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కానీ, ఆ టైమ్ లో సజ్జ‌ల ఇంటిలో లేక‌పోవ‌డం పెద్ద ట్విస్ట్‌. అంటే, ముందుగానే తాడేప‌ల్లి ప్యాలెస్ కు అంతా తెలుస‌న్న‌మాట‌. ఉద్దేశ‌పూర్వ‌కంగా స్కిప్ చేసిన స‌జ్జ‌ల వాలకంపై లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లో ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ఇప్పుడు అంతఃపుర అస‌లు క‌థ మొద‌లైయింద‌న్న‌మాట‌. ఎటు వైపు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Also Read : Jagan cinema : వెండితెర‌పై జగ‌న్‌ తాండ‌వం, `ఫైబ‌ర్ నెట్ ` లో కొత్త సినిమాల‌ రిలీజ్‌