Jagan : కేసీఆర్ ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీని నమ్ముకున్న జగన్..ఏమవుతుందో మరి..!!

ప్రొద్దుటూరు, నంద్యాల రెండు సభల్లో తాను 130 సార్లు బటన్ నొక్కానని చెప్పుకున్నదానికన్నా చంద్రబాబు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 05:08 PM IST

పదేళ్ల పాటు తెలంగాణ (Telangana) లో తిరుగులేని పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్..ప్రస్తుతం ఉన్న నేతలను కాపాడుకునేపనిలో పడింది. ముచ్చటగా మూడోసారి విజయ డంఖా మోగించాలని కలలు కన్నా కేసీఆర్ ఆ కల ‘కలగానే’ మిగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణం కేసీఆర్ (KCR) ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజినే. ఎవరు చెప్పిన వినకుండా ఎక్కువ శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వడం ఒకటైతే..కాంగ్రెస్ పార్టీ ఫై చేసిన విమర్శలు కూడా కేసీఆర్ కు ఛాన్స్ లేకుండా చేసాయి. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రంలో కరువు వస్తుందని, ఏపీ పెత్తందారులు మళ్లీ రాష్ట్రాన్ని ఏలుతారని, రాష్ట్రాన్ని ఏపీ వారికీ అప్పజెపుతారని , కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుందని చెప్పుకొచ్చారు..అలాగే నిరుద్యోగులకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. దీంతో ప్రజలు కేసీఆర్ మాటలపై ఆలోచనలో పడి..ఓసారి ఛాన్స్ ఇస్తే ఏంచేస్తారో చూద్దాం అని కాంగ్రెస్ కు ఓట్లు గుద్దేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.

ఇక ఇప్పుడు జగన్ (Jagan) కూడా కేసీఆర్ మాదిరే మాటకు ముందు ,మాటకు వెనుక చంద్రబాబు (CHandrababu)..చంద్రబాబు అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. మీమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన జగన్..ప్రచార సభల్లో చంద్రబాబు ఫై ఒకేమాదిరి విమర్శలు చేస్తూ వెళ్తున్నారు. ప్రొద్దుటూరు, నంద్యాల రెండు సభల్లో తాను 130 సార్లు బటన్ నొక్కానని చెప్పుకున్నదానికన్నా చంద్రబాబు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సుమారుగంటన్నర పాటు సాగిన ప్రసంగాల్లో చంద్రబాబు ప్రస్తావన ప్రతీ నిమిషానికి వినిపిస్తూనే ఉంది. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని.. ఆయన జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు అంటూ ప్రసంగించారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు చేశాడా?. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? అంటూ ప్రశ్నింస్తూ వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మరి జగన్ ఈ ఐదేళ్లలో బటన్ నొక్కడమే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలు లేవు…రోడ్లు బాగు చేసింది లేదు..రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకరావడం కాదు ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయేలా చేసారు. మూడు రాజధానులు అంటూ అసలు రాజధానే లేకుండా చేసారు. మెగాడీస్పీ అని చెప్పిన జగన్ అది ఊసేలేదు. ఇక ఈ ఐదేళ్లలో నిత్యావసర ధరలు పెంచారు..చెత్తకు కూడా టాక్సీ వేసి వార్తల్లో నిలిచారు. వైసీపీ నేతల దారుణాలు ఎన్ని చెప్పిన తక్కువే..ఇలా ఎన్నో వైసీపీ లోపాలు ఉన్నాయి. మరి ఇన్ని లోపల గురించి ఓటర్లు మరచిపోతారా..అది జగన్ తెలుసుకోలేకపోతున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు.

కేసీఆర్ పదేళ్లలో తెలంగాణలో గుణాత్మకమైన మార్పునూ చూపించారు. రోడ్లు, మంచినీరు వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పు చూపించారు. పాలన విషయంలో ఆయనపై ఉన్న రిమార్క్స్ తక్కువ. కేవలం అధికార దుర్వినియోగం.. అహంకారం కారణంగానే ఆయన ఓడిపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు వస్తే.. అన్నీ ఆగిపోతాయని చెప్పే విస్తృతమైన అవకాశాలు లేవు. ఎవరు వచ్చినా ఉండే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఒక్కటే మార్గం. జగన్మోహన్ రెడ్డి దాన్నే గట్టిగా ఉపయోగించుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. టీడీపీ మేనిఫెస్టోకూ ఆయన తన ప్రసంగాల్లో చోటు కల్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలు అమలు చేయలేదని చెప్పడమే కాదు.. కొత్త మేనిఫెస్టో అమలు చేయడానికి లక్షల కోట్లు కావాలని.. తాను అమలు చేస్తున్న పథకాలే జబ్బులు తేవడానికి తంటాలు పడుతున్నానని చంద్రబాబు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆయనకు ఆయనే టీడీపీ ఫై నమ్మకం వచ్చేలా చేస్తూ వస్తున్నారని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ప్రజలు పోలింగ్ సమయానికి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా..? అసలు ఎవరికీ ఓటు వేస్తారు..? అనేది చూడాలి.

Read Also : Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం