Site icon HashtagU Telugu

CM Jagan Escaped : సీఎం జగన్ కు తప్పిన పెను ప్రమాదం..

Jagan Esc

Jagan Esc

ఏపీ సీఎం జగన్ (CM Jagan) పెను ప్రమాదం నుండి క్షేమంగా (Escaped ) బయటపడ్డారు. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబదించిన షెడ్యూల్ ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక ఏపీలో మే 13 న పోలింగ్ , జూన్ 04 ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటికే సిద్ధం అంటూ కార్యకర్తల్లో జోష్ నింపే సభలు పూర్తి చేయడం జరిగింది. ఈ నెల 27 న రాష్ట్ర వ్యాప్తంగా ” మేమంతా సిద్ధం ” పేరుతో బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన 4జిల్లాలు/పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ప్రకటించారు. బస్సుయాత్ర ప్రారంభం అయిన తర్వాత, యాత్ర పూర్తయ్యేంతవరకూ కూడా జగన్ పూర్తిగా జనంలోనే ఉంటారని రఘురామ్ తెలిపారు.

ఇదిలా ఉంటె ఈ నెల 14న సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. సీఎం హెలిప్యాడ్ ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపురు పైకి లేవగా.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ను కొన్నిసెకన్లపాటు గాల్లోపైనే ఉంచాడు. అది పైకి ఎగిరి విమానం రెక్కలకు తాకుంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్బంగా అలర్ట్ గా ఉండాల్సిన అధికారులు ఇలా పూర్తిగా నిర్లక్ష్యం వహించడంపై సీఎం ప్రత్యేక సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, సీఎం జగన్ మోహన్ తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

Read Also : Sukesh Letter To MLC Kavitha : తీహార్ జైలులో కవితను కలుస్తా – సుకేశ్ చంద్రశేఖర్