Jagan : ఓటమి పై జగన్ ఎమోషనల్ ..

ఆటోలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నా నాయీ బ్రాహ్మణులకు ఇన్ని లక్షల మందికి ఇంతింత మంచి చేసినా ఓడిపోయామని గుండె నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు

  • Written By:
  • Publish Date - June 4, 2024 / 06:32 PM IST

ఏపీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ దారుణమైన ఓటమి చవిచూసింది. వైసీపీ గెలుపు కష్టమే అనుకున్నారు కానీ కనీసం ప్రతిపక్ష పాత్ర కు కూడా అవకాశం ఇవ్వలేదు ఓటర్లు. సింగిల్ సీట్ కే పరిమితం అవ్వడం పట్ల వైసీపీ నేతలు నిరాశకు గురి అవుతున్నారు. ఇక మాజీ సీఎం జగన్ సైతం ఓటమిని ఏమాత్రం తట్టుకోకపోతున్నారు. ఓటమి తర్వాత మీడియా తో మాట్లాడారు. అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మంది అన్నదాతలకు తోడుగా ఉన్నా వారు తమకు అండగా లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

లక్షల మందికి ఆసరా ఇచ్చినా, చేయూత అందించినా, అరకోటి మంది రైతులకు భరోసా ఇచ్చినా ఇవాల్టి ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నా నాయీ బ్రాహ్మణులకు ఇన్ని లక్షల మందికి ఇంతింత మంచి చేసినా ఓడిపోయామని గుండె నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు. ఇక కొత్త ప్రభుత్వానికి అల్ ది బెస్ట్ తెలిపారు. ఇదే సందర్బంగా తనను మరింత ఇబ్బందులకు గురి చేయడం ఖాయమని..ఇలాంటి ఇబ్బందులు పెట్టిన తాను సిద్ధం అని అన్నారు. ఇక వైసీపీ కోసం తనకోసం కష్టపడినా వారికీ థాంక్స్ తెలిపారు. ఏది ఏమైనప్పటికి జగన్ మాటల్లో తర్వాతి రోజుల్లో తనను ఏంచేస్తారో అనే భయం స్పష్టంగా కనిపిస్తుంది.

Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి సెలబ్రిటీస్ ట్వీట్స్.. గేమ్ ఛేంజర్, మాన్ ఆఫ్ ది మ్యాచ్..