Site icon HashtagU Telugu

Jagan Election :`వై నాట్ 175`మంత్ర దండం ఇదే ! జ‌గ‌న్ ప‌న్నా పంచ్ స్కెచ్!

YCP District Presidents

Jagan

ప్ర‌జ‌ల్ని మెప్పించి గెల‌వడం వేరు. లోబ‌రుచుకుని విజ‌యం సాధించ‌డం మ‌రో ఎత్తు. ఈ రెండు కాకుండా ప‌న్నా ప్ర‌ముఖ్ కొత్త‌గా వ‌చ్చిన వ్యూహం. తొలిసారి గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌యోగించింది. అద్బుత విజ‌యాన్ని ఈ వ్యూహం బీజేపీకి అందించింది. ఇప్పుడు దాన్నే ఏపీలోని వైసీపీ(Jagan Election) న‌మ్ముకుంది. వై నాట్ 175 దిశ‌గా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో (2019) దేవుడి స్క్రిప్ట్ ను వినిపించిన వైసీపీ(YCP) ఈసారి వై నాట్ 175 నినాదాన్ని అందుకుంది. అందుకోసం ప‌న్నా ప్ర‌ముఖ్ రూపంలో ప‌న్నా పంచ్ ను ఎంచుకుంది.

`వై నాట్ 175` నినాదానికి.(Jagan Election)

`వై నాట్ 175` (Jagan Election)నినాదానికి అనుకూలంగా ఉండేలా కేంద్ర నిర్ణ‌యం క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కొత్తగా ఓటింగ్ ప్రతిపాదన తీసుకువచ్చింది. ఓటింగ్ రోజు గ్రామంలోనూ , రాష్ట్రంలోనూ లేకపోయినా ఆన్ లైన్ లో ఎక్కడి నుంచైనా ఓటు వేయ‌డానికి వెసుల‌బాటు క‌ల్పించాల‌ని భావిస్తోంది. అయితే, విప‌క్షాల మూకుమ్మ‌డిగా ఈ ప్ర‌తిపాద‌న త్రోసిబుచ్చ‌డం తెలిసిందే. ఎందుకంటే గతంలో ఈవీఎం మాయాజాలం గురించిన ఫిర్యాదులకు ఇప్ప‌టికీ అతీగతి లేదు. ఈ సారి దొంగ ఓట్లను చేర్చి ఎక్కడో కూర్చుని ఆన్ లైన్ లో మీటలు నొక్కితే ఏమ‌వుతుందో తెలియ‌దు. ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారా , లేదా అనేది ఇప్ప‌టికైతే సందిగ్ధం.

Also Read : Jagan Victory : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ విజ‌యం! ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం ర‌ద్దు..?

వాస్త‌వంగా 2019 ఎన్నిక‌ల్లో 60 లక్షల ఈవీఎంలను అందుబాటులోకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకొచ్చింది. ఆర్టీయే ద్వారా అడిగిన ప్రశ్నకు జవాబుగా ఎన్నికల కమిషన్ మా వద్ద 40 లక్షల ఇ.వి.ఎం ల వివరాలు మాత్రమే ఉన్నాయ‌ని చెప్పింది. మిగతా 20 లక్షలు ఏమయ్యాయో మాకు తెలియదు అని సమాధానం ఇచ్చింది. అంటే గోల్ మాల్‌ జరిగి ఉండవచ్చని ప‌రోక్షంగా చెప్పింద‌న్న‌మాట‌. ఆ 20 లక్షల ఈవీఎంల‌ను ఎన్నికల్లో తమకు అనుకూలంగా పోలింగ్ బూతుల్లో మార్చారా ? లెక్కింపు కేంద్రాల్లో మార్చారా ? రవాణా చేసేడప్పు మార్చారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిలిగిపోయింది. పోలింగ్ జరిగిన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు వందలు , వేలు , లక్షల్లో తేడా వచ్చినప్ప‌టికీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన స‌మాధానం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయ‌ని, ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగినప్పుడు స్వ‌ల్ప తేడాలను లైట్ గా తీస‌కోవాల‌ని సెలవిచ్చింది. వంద‌ కోట్ల ఓట్లలో తేడా వచ్చిన ఓట్లు లెక్కలోనికి రావని, వాటిని పట్టించుకో నవసరం లేదు అని కొట్టి పడేసింది . ఇప్ప‌టికీ 20 లక్షల ఈవీంఎంలు ఏమయ్యాయో అటు కేంద్ర ప్రభుత్వమూ ఇటు ఎన్నికల కమిషన్ చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గుజ‌రాత్ త‌ర‌హా ప‌న్నా ప్ర‌ముఖ్ ను కొంచెం అటూఇటూ చేసి ప‌న్నా పంచ్

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆన్ లైన్ ఓటింగ్ పెడితే `వై నాట్ 175` నినాదం నిజ‌మ‌వుతుందా? అనే సందేహం క‌లుగుతోంది. పైగా గుజ‌రాత్ త‌ర‌హా ప‌న్నా ప్ర‌ముఖ్ ను కొంచెం అటూఇటూ చేసి ప‌న్నా పంచ్ అంటూ వైసీపీ క్షేత్ర‌స్థాయి ప‌నుల‌ను సైలెంట్ గా మొద‌లుపెట్టింది. పన్నా ప్రముఖ్ అంటే ఓటర్ లిస్ట్ లో ఉన్న ప్రతి పేజీ కి ఒకరిని ఇంచార్జ్ గా నియమించడం. ప‌న్నా పంచ్ అంటే ప్రతి పేజీకి ఐదుగురికి ఇంచార్జ్ గా అప్ప‌గించ‌డం. ప్రతి 30 మంది ఓటర్లను ఐదుగురు పర్యవేక్షించేలా స్కెచ్ వేసింది. గుజ‌రాత్ లోనూ 4.8 కోట్ల మంది ఓటర్లను 82 లక్షల కార్యకర్తలు పరిశీలించారంటే ఎంతగా వడపోత జరిగిందో తెల్సుకో వచ్చు. గుజరాత్ లో సొంత పార్టీ కాడర్ కు పని కల్పించి పోలింగ్ జరుపుకున్నారు .

Also Read : TTD Jagan : జ‌గ‌న్ జ‌మానాలో తిరుమ‌ల! మ‌త కుట్ర‌పై విప‌క్షాల ద‌రువు!

ఎ.పి వాలంటీర్ వ్యవస్థ ఓటర్లను ప్ర‌భుత్వ ధ‌నంతో ప్రభావితం చేస్తున్నారు . అంతేకాదు, వాలంటీర్లకు సమాంతరంగా పార్టీ కాడర్ పనిచేస్తుంది. గుజరాత్ కు , ఎ పి అధికార పార్టీలకు ప‌రోక్షంగా PK ఫార్ములా ఎప్ప‌టిక‌ప్పుడు అందుతోంది. ప్రతి ఓటరు మనసులో ఏముందో వాలంటీర్ , పార్టీ కాడర్ గుర్తించి ఒక నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం సామ , వేద , దాన‌, దండోపాయాలను గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ విద్య‌ల‌ను ప్ర‌యోగిస్తారు. డ‌బ్బు పంపిణీ లో ఇప్పటి నుండే శిక్షణ ఇస్తున్నార‌ని తెలుస్తోంది. ప్రలోభా లతో ఓటర్లను ప్రభావితం చేసి , ప్రతిపక్షాన్ని కట్టడి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి వైసీపీ(YCP)చాప‌కింద‌నీరులా ప‌నిచేస్తోంది. గత ఎన్నికల్లో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కార్, కేంద్ర ప్ర‌భుత్వ మ‌ద్ధ‌తు తీసుకుని టిడిపిని ఓడించ‌డానికి దేవుడి స్క్రిప్ట్ ను రచించింది. ఈసారి ఆ అదే ఫార్ములాకు మ‌రింత ప‌దును పెట్ట‌డ్డం ద్వారా `వై నాట్ 175` పుట్టుకొచ్చింది. ఏదో మంత్ర దండం ఈ సారి కూడా `వై నాట్ 175 ` వెనుక ఉంద‌ని విప‌క్షాలు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.