Jagan Effect : షా ప‌ర్య‌ట‌న వాయిదాపై జ‌గ‌న్ దెబ్బ‌, చంద్ర‌బాబు రెండో రోజు పోరు

జీవో నెం1 (Jagan Effect) కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాను భ‌య‌పెట్టింది.

  • Written By:
  • Publish Date - January 5, 2023 / 01:26 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 (Jagan Effect) కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాను భ‌య‌పెట్టింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 8న క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌కు రావాల్సిన ఆయ‌న వెన‌క్కు త‌గ్గారు. రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో అమిత్ షా సైతం ఢిల్లీకి ప‌రిమితం అయ్యారు. కానీ, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు(CBN) ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డంలేదు. జీవో నెం 1 ద్వారా అన‌ధికార ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Effect) మీద తిర‌గ‌బ‌డ్డారు. మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న కొన‌సాగిస్తున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి పాద‌యాత్ర చేస్తూ చీక‌టి జీవో మీద నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : CBN Arrest : చంద్ర‌బాబు అరెస్ట్ కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్? రాస్తారోకోల‌కు టీడీపీ పిలుపు

తొలి రోజు కుప్పం ప‌ర్య‌ట‌న ఉద్రిక్త‌త మ‌ధ్య సాగింది. రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జ‌ల్ని క‌లుసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. రెండో రోజు పాద‌యాత్ర చేస్తూ ముందుకు క‌దిలారు. రాష్ట్రంలోని ఎమ‌ర్జెన్సీ పరిస్థితుల‌పై నిర‌స‌న పాద‌యాత్రకు శ్రీకారం చుట్టారు. మూడో రోజు కూడా ఆయ‌న కుప్పంలో ప‌ర్య‌టించాల‌ని షెడ్యూల్ చేసుకున్నారు. సైకో సీఎం పోవాలి, సైకిల్ రావాలి నినాదం ఇస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకుందాం..రండి అంటూ పిలుపునిస్తున్నారు. బీజీపీ ఢిల్లీ లీడ‌ర్ల సైతం ఏపీలోకి అడుగు పెట్ట‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. జీవో నెం 1 మీద బీజేపీ ఏపీ నేత‌లు మీడియా ముందు విమ‌ర్శ‌లు కురిపించారు. కానీ, ధైర్యం చేసి అమిత్ షాను షెడ్యూల్ ప్ర‌కారం క‌ర్నూలుకు తీసుకురాలేక‌పోయారు.

`ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాదం`పై పోరాడేందుకు..(Jagan Effect)

వాస్త‌వంగా `ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాదం`పై పోరాడేందుకు విప‌క్షాల స‌మావేశం ఇటీవ‌ల జ‌రిగింది. అంత‌కంటే ముందు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడేందుకు ఉమ్మ‌డి వేదిక‌పైకి విప‌క్షాలు రావాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. విశాఖ వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇటీవ‌ల అవ‌మానం జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ లో జ‌న‌సేనానిని చంద్ర‌బాబు(CBN) క‌లిశారు. ఉమ్మ‌డి వేదిక‌పై పోరాటాల‌కు సంకేతాలు ఇచ్చారు. ఇటీవ‌ల విప‌క్షాల స‌మావేశంలోనూ తీర్మానం చేశారు. కానీ, ఉమ్మ‌డి పోరుకు మాత్రం విప‌క్షాలు ముందురాలేక‌పోతున్నాయి. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏద‌నుకుంటే అది చేసుకుంటూ వెళుతున్నారు. విప‌క్షాల మ‌ధ్య అనైక్య‌త ఆయ‌న‌కు బ‌లానికి ప్ర‌ధాన కార‌ణంగా కనిపిస్తోంది.

Also Read : Dark politics : ముక్కోణ‌పు ల‌వ్ గేమ్‌! చ‌తుర్ముఖ చ‌ద‌రంగం!

జీవో నెంబర్ 1ను విపక్షాలు మీడియా వేదిక‌గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1861 పోలీస్ యాక్ట్ పేరుతో జీవో నెంబర్ 1 ఆర్టికల్ 19కి జీవో 1 విరుద్ధమని చెబుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో పోరాడేందుకు ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. స్టేట్ టెర్రరిజం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంద‌ని ఆరోపిస్తూ కూడా దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంద‌ని విమ‌ర్శించిన మాజీ మంత్రి న‌క్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.మ‌రోవైపు చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజుకు చేరుకుంది. తొలి రోజు పాదయాత్రగా గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈ క్రమంలో, జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉండ‌టంతో రెండో రోజు ఆ పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. చైత‌న్య ర‌థంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన వాహ‌నాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ స్లీప‌ర్ సెల్ వ్య‌వ‌హారాన్ని టీడీపీ బ‌య‌ట పెడుతోంది.

అమిత్ షా త‌గ్గ‌డాన్ని వైసీపీ సానుకూలంగా..

ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌భ‌లకు జ‌నం దండోప‌తండాలుగా వ‌చ్చారు. నిఘా వ‌ర్గాల ద్వారా ఆ స‌భ‌ల ప‌ర్య‌వ‌సానాన్ని వైసీపీ గ్ర‌హించింది. దీంతో వ్యూహాత్మ‌కంగా కందుకూరు, గుంటూరు స‌భ‌ల్లో తొక్కిస‌లాట‌కు ప్లాన్ చేసింద‌ని టీడీపీ భావిస్తోంది. తొక్కిస‌లాట‌లో 11 మంది చ‌నిపోవ‌డాన్ని ప్ర‌భుత్వం హ‌త్య‌లుగా భావించాల‌ని చెబుతోంది. జీవో నెం 1ను తీసుకురావ‌డానికి గుంటూరు, కందుకూరు స‌భ‌ల్లో తొక్కిస‌లాట‌ను స్లీప‌ర్ సెల్స్ ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రియేట్ చేశార‌ని చెబుతోంది. మ‌రోవైపు ప‌బ్లిసిటీ కోసం చంద్ర‌బాబు(CBN) చేసిన హ‌త్య‌లుగా వైసీపీ విమ‌ర్శిస్తోంది. తొక్కిస‌లాట‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు తారాస్థాయికి చేరిన క్ర‌మంలో జీవో నెం 1 తెర‌మీద‌కు వ‌చ్చింది. దానిపై చంద్ర‌బాబు పోరాటానికి దిగారు. కానీ, అమిత్ షా మాత్రం వెనుక్కు త‌గ్గ‌డాన్ని వైసీపీ సానుకూలంగా మ‌లుచుకుంటోంది.

Also Read : CBN Kuppam : కుప్పం ప‌ర్య‌ట‌న‌పై పోలీస్ జులుం! క‌ర్ణాట‌క‌, ఏపీ బోర్డ‌ర్లో హై టెన్ష‌న్‌!