Jagan Effect : సమర్థులను ఎవరూ ఆపలేరు. ఎక్కడకు వెళ్లినా? ఏ పదవి ఇచ్చినా? దానికి న్యాయం చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ ఏపీకి వెళ్లారు. అక్కడ సరైన సమస్యను సరైనా సమయంలో పట్టుకున్నారు. దాని మీద పోరాడేందుకు సిద్దమయ్యారు. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎంత వరకు ఆయనకు సహకారం అందిస్తారు? అనేది మాత్రం సందేహం. ఎందుకంటే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కాదని ఏమీ చేయరు. ఆ విషయం సర్వత్రా తెలిసిందే.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి(Jagan Effect)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Effect)తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఆయన స్వతహాగా క్రిస్టియన్ మనోభావాలు ఉన్న లీడర్. అందుకే, సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్లకు చైర్మన్ పదవి ఇస్తే బాగుటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి లైట్ గా విమర్శించారు. కానీ, ఏపీ బీజేపీ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ మాత్రం తనదైన శైలిలో కరుణాకర్ రెడ్డి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ బీజేపీ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
హిందూవాదాన్ని బలంగా వినిపించే పార్టీ బీజేపీ. ఆ పార్టీ హిందువుల ఓట్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ 80శాతం, 20శాతం మధ్య జరిగే పోటీగా వాదన వినిపించనుంది. అంటే, 80శాతం హిందువులు, 20 మంది ఇతర మతాల వాళ్ల మధ్య ఎన్నికల వార్ గా క్రియేట్ చేస్తోంది. అదే సందర్భంలో హిందూమతానికి జరిగే అవమానాలపై పోరాడేందుకు సిద్ధం కావాలి. కానీ, రాజకీయ పరమైన అడ్డంకులు లేకుండా ఉన్న చోట మాత్రమే హిందూ వాదాన్ని వినిపిస్తోంది.
ఏపీలో బీజేపీ, వైసీపీ ఒక తానులో ముక్కులు (Jagan Effect)
ప్రస్తుతం ఏపీలో బీజేపీ, వైసీపీ (Jagan Effect)ఒక తానులో ముక్కులు మాదిరిగా కలిసి పనిచేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య బలమైన బంధం ఉంది. కేంద్రానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఆ విషయాన్ని వైసీపీ లీడర్లు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలతో సంప్రదించుకుండా ఫైనల్ చేసి ఉండరు. అందుకే, క్రిస్టియన్ అయినప్పటికీ ధైర్యంగా నియామకం చేపట్టారు. హిందూ దేవాలయాలు, దేవుళ్లకు ఏపీలో అన్యాయం జరుగుతుందని పలుమార్లు వినిపించినప్పటికీ అటు వైపు కన్నెత్తి బీజేపీ ఢిల్లీ పెద్దలు చూడలేదు.
ఏపీలోని రాజకీయ పరిణామాలు, పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకోకుండా బండి సంజయ్ వైసీపీ మీద దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి కరుణాకర్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్. ఆయన్ను టార్గెట్ చేస్తే, బండి సంజయ్ కు సమీప భవిష్యతులోనే సొంత పార్టీ నుంచి మందలింపు ఉంటుందని సర్వత్రా వినిపిస్తోంది. ఆ విషయాన్ని గమనించికుండా కరుణాకర్ రెడ్డి నియామకంపై బండి గళం విప్పడం చర్చనీయాశంగా మారింది.
Also Read : Tirumala Forest : జగన్ మెడకు స్మగ్లింగ్ `చిరుత`లు
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి ఉంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న దేవాలయానికి క్రిస్టియన్ గా గుర్తింపు ఉన్న కరుణాకర్ రెడ్డిని నియమించడం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద సాహసం. గతంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ఒకసారి కరుణాకర్ రెడ్డి ఇదే పోస్ట్ ను అనుభవించారు. తిరిగి ఇప్పుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి (Jagan Effect)హయాంలోనూ అదే లీడర్ టీటీడీ చైర్మన్ పదవిని పొందగలిగారు. ఆనాడు తిరుమల ఏడుకొండలు కాదు, మూడు కొండలు అంటూ ప్రచారం లేపారు. అంతేకాదు, అక్కడ చర్చ్ ను నిర్మించాలని కూడా ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో జరిగిన ప్రచారం. ఇప్పుడు మళ్లీ చైర్మన్ హోదాలో కరుణాకర్ రెడ్డి ఏమి చేస్తారు? అనే దానిపై చర్చ జరుగుతోంది.
Also Read : Tirumala Tiger : అదిగో చిరుత..ఇదిగో కర్ర.! TTDపై నెటిజన్ల ట్రోల్స్, మీమ్స్ హోరు!!
చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత చిరుతల స్వైర విహారం తిరుమల రోడ్ల మీద కనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా కర్రలు పట్టుకుని వెళ్లండని భక్తులకు సలహా ఇచ్చారు. ఆ మేరకు రూ. 10ల రుసుంతో కర్రలను భక్తులకు అందిస్తున్నారు. అంతేకాదు, ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు అంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి కైంకర్యాలు జరగాలి. టీటీడీ బోర్డు చెప్పినట్టు జరపకూడదు. అన్యమత ప్రచారం తిరుమల కొండల్లో జరుగుతుందని చాలా కాలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ క్రిస్టియన్ గా గుర్తింపు ఉన్న కరుణాకర్ రెడ్డి నియామకం జరిగింది. దానిపై పోరాడేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగారు. దూకుడుగా ఉద్యమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉత్సాహం ఆదిలోనే ఆగిపోతుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద పోరాడతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.