Jagan Dinner : సాగ‌ర‌తీరాన`గాలా`,పెట్టుబ‌డులు ఎవ‌రికెరుక‌.!

గాలా డిన్న‌ర్(Jagan Dinner) అంటే ఏమిటి? ఎవ‌రు ఎందుకు గాలా ఈవెంట్ ను నిర్వ‌హిస్తారు?

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 01:52 PM IST

గాలా డిన్న‌ర్(Jagan Dinner) అంటే ఏమిటి? ఎవ‌రు ఎందుకు గాలా ఈవెంట్ ను(G20 event)నిర్వ‌హిస్తారు? దాని వ‌ల‌న వ‌చ్చే లాభం ఏమిటి? ఎంత ఖ‌ర్చు అవుతుంది? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే, జీ20 ప్ర‌తినిధుల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌లో `గాలా` డిన్నర్ ఇచ్చారు. దీంతో స‌గ‌టు తెలుగువాడు ఇప్పుడు `గాలా` డిన్న‌ర్ గురించి మాట్లాడుకోవ‌డం వినిపిస్తోంది. అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న డిన్న‌ర్ గా `గాలా`ను భావించాలి. హై ఎండ్ డిన్న‌ర్ గా చెప్పుకోవాలి. హోదాను బ‌ట్టి `గాలా` డిన్న‌ర్ ఉంటుంది. ఏపీ స‌ర్కార్ నిర్వ‌హించిన `గాలా` కావున ఖ‌ర్చుకు హ‌ద్దు ఉండ‌దు. జ‌నం సొమ్ముతో విశాఖ‌తీరాన `గాలా`ను గ్రాండ్ గా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వ‌హించింది.

విశాఖ‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `గాలా` డిన్నర్ (Jagan Dinner)

కంపెనీ బ్రాండ్ క్రియేట్ చేయ‌డానికి, అంత‌ర్జాతీయ‌స్థాయి అవార్డులు, సేల్స్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు పొందిన‌డ‌ప్పుడు త‌ర‌చూ కుబేరులు చేసే ఈవెంట్ `గాలా` డిన్న‌ర్. ల‌క్ష్యం ఆధారంగా డ్ర‌స్ కోడ్ కూడా ఉంటుంది. ఈ డిన్న‌ర్ కు మ‌హిళ‌లు, పురుషులు త‌క్కువ డ్ర‌స్ లు వేసుకుంటారు. కంపెనీ బ్రాండ్ క్రియేట్ కోసం `గాలా` డిన్న‌ర్ ను ఏర్పాటు చేస్తే సూటు,బూటు ఉంటుంది. పెద్ద సంఖ్యలో పాల్గొనే అతిథుల కోసం ఇచ్చే డిన్న‌ర్ గా చెప్పుకోవాలి. వినోదంతో కూడిన భోజనాన్ని కలిగి ఉంటుంది. సిట్-డౌన్, బఫే శైలిలో అందుబాటులో ఉంటుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే డిన్న‌ర్ కు వ‌చ్చిన వాళ్ల‌కు ఏ ప‌ద్ద‌తి న‌చ్చుతుందో ఆ ప‌ద్ద‌తి ప్ర‌కారం ఎంజాయ్ (Jagan Dinner)చేయొచ్చు.

కుబేరులు చేసే ఈవెంట్ `గాలా` 

గాలా డిన్నర్‌ను విజయవంతం చేయ‌డానికి హోస్ట్ కీల‌కం. సెల‌బ్రిటీల‌ను హైలైట్ చేసే లైటింగ్ నుంచి ప్ర‌తి అంశాన్ని శాస్త్రీయంగా ఉంచుతారు. డిన్న‌ర్ లో ప‌లు ర‌కాలు వినోదం పంచే ఈవెంట్ లు ఉంటాయి. తరచుగా డ్యాన్స్ లేదా ప్రదర్శనలతో కూడిన ఆకర్షణీయమైన, పండుగ మాదిరిగా `గాలా` డిన్న‌ర్ (Jagan Dinner)ఉంటుంది. టేబుల్స్ వేసి ఉంచుతారు. ప్ర‌తి టేబుల్ మీద న‌లుగురికి క‌నీసం సీటింగ్ ఉండేలా చూస్తారు. వాటికి నెంబ‌ర్లు ఇస్తారు. ఇక హోస్ట్ చేసే వాళ్లు ప్ర‌తి టేబుల్ వ‌ద్ద‌కు వెళ్లి కూర్చుని కొద్దిసేపు అతిథుల‌తో ముచ్చ‌టిస్తారు. ఇదంతా కుబేరుల వివాహాలు, సంబ‌రాల మాదిరిగా ఉంటుంది. ఇలాంటి ఈవెంట్ ను ఏపీ బ్రాండ్ ను పెంచ‌డానికి జీ20 ప్ర‌తినిధుల(G20 event) కోసం విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏర్పాటు చేశారు.

యూరోపియన్‌ కంట్రీస్‌కి చెందిన 57మంది ప్రతినిధులు (G20 event)

సదస్సుకు జీ20 దేశాలతోపాటు(G20 event) యూరోపియన్‌ కంట్రీస్‌కి చెందిన 57మంది ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. యోగా, మెడిటేషన్‌, పౌష్టికాహార వినియోగంపై చర్చలు పెట్టారు. మౌలిక సదుపాయాల కల్పనపైన చ‌ర్చ‌లు జ‌రిపారు. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, వేస్టే మేనేజ్‌మెంట్‌ అండ్ ఎనర్జీపై క్షేత్రస్థాయిలో వర్క్‌షాపు పెట్టారు. పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనపై ప్ర‌తినిధులు చ‌ర్చించారు. సాగర తీరంలో జీ-20 సదస్సుతో విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని జ‌గ‌న్ స‌ర్కార్ (Jagan Dinner) ఆశిస్తోంది. పెట్టుబడులు కూడా వస్తాయని భావిస్తోంది.

Also Read : Jagan Delhi :`ముంద‌స్తు` షెడ్యూల్‌,జ‌గ‌న్ ఢిల్లీ సీక్రెట్స్ ఇవేనా?

జీ-20 (G20 event)సదస్సులో చర్చించండి-సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ ప్రతినిధులను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరారు. సస్టెయిన్‌బుల్‌ పాలసీలతో సరైన మార్గనిర్దేశకత్వం చేయగలిగితే పేదలకు ఇళ్లు సమకూరతాయన్నారు. జీ-20 సమ్మిట్‌లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్ సమావేశాలు ఉన్నాయి. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు మరో మూడ్రోజులపాటు ఉంటాయి. వన్‌ ఎర్త్‌-వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఫ్యూచర్‌ థీమ్‌తో అనేక సమస్యలపై చర్చిస్తున్నారు. విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(Jagan Dinner) భావిస్తున్నారు.

జీ-20 ప్రతినిధులకు   జగన్ విందు(G20 event)

`సాగర నగరం ప్రతి ఒక్కరికీ మధురమైన అనుభూతిని మిగుల్చుతుంద‌ని చెబుతూ జీ-20 ప్రతినిధులకు(G20 event) గౌర‌వ సూచికంగా సీఎం జగన్ విందు ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 22లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటూ వివరించారు. ఒక్కోచోట పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని జీ-20 డెలిగేట్స్‌ దృష్టికి(Jagan Dinner) తీసుకెళ్లారు. ఈ గృహ సముదాయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం, అందుకు మీ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నామ‌ని పిలుపునిచ్చారు.

Also Read : AP CM Jagan: జగన్ మంచోడే.! సజ్జలే చేటు!! రెబెల్స్ వాయిస్