Site icon HashtagU Telugu

YS Jagan : ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేసారు – షర్మిల

Sharmila Jagan Chance

Sharmila Jagan Chance

ఒక్క ఛాన్స్ ..ఒక్క ఛాన్స్ (One Chance ) అంటూ సీఎం జగన్ (CM Jagan) ఐదేళ్ల లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారని..మరోసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఎడారి అవుతుందని..ఇక్కడి ప్రజలు బ్రతికేందుకు పక్క రాష్ట్రాలకు వలసలు పోవాల్సి వస్తుందని..గమనించి ఓటు వేయండంటూ వైస్ షర్మిల (YS Sharmila) ఓటర్లను కోరారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయానికి ఇంకో మూడు వారాలు మాత్రమే ఉండడం తో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా..ఎండను సైతం లెక్కచేయకుండా పర్యటిస్తూ తమ గెలుపుకు కష్టపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి ఎలాగైనా జగన్ ను ఓడించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కంకణం కట్టుకున్నాయి. ఐదేళ్లలో జగన్ చేసిన దోపిడీలు, దారుణాలు, నేరాలు , ఘోరాలు ఇలా ప్రతి ఒక్కదాన్ని ప్రజల ముందు ఉంచుతూ మరో ఛాన్స్ ఇవ్వకండి అంటూ కోరుకుంటున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సైతం అన్న ఓటమిని కన్నులారా చూడాలని తహతహలాడుతోంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి అన్నే టార్గెట్ అనుకునేలా ఆమె విరుచుకుపడుతుంది. ఓ పక్క బాబాయ్ ని చంపి..అధికారంలోకి వచ్చారంటూ ఆరోపిస్తునే..హామీల పేరుతో..ఒక్క ఛాన్స్..ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ప్రజలను మోసం చేసారని ఆరోపిస్తూ వస్తుంది.

ఈరోజు విజయవాడ లో ప్రచారం చేసిన షర్మిల..ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయిదేళ్లుగా ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్‌ సీఎం అయ్యి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ తయారు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుందని షర్మిలా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తేనే పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని సహా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

Read Also : Sam Pitroda : శ్యాం పిట్రోడా ఎవరు ? ‘వారసత్వ పన్ను’పై వ్యాఖ్యలతో రాజకీయ దుమారం