Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ (Jagan Delhi)ప‌ర్య‌ట‌న ముగిసింది. కేంద్ర హోంమంత్రి

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 12:52 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ (Jagan Delhi)ప‌ర్య‌ట‌న ముగిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ ను(Central Ministers) క‌లిశారు. హ‌ఠాత్తుగా బుధ‌వారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయ‌న రాత్రి పొద్దుపోయిన త‌రువాత అమిత్ షాతో భేటీ అయ్యారు. గురువారం ఉద‌యం నిర్మ‌లాసీతారామ‌న్ తో సంప్ర‌దింపులు ముగిసిన త‌రువాత విజ‌య‌వాడ‌కు వెనుతిరిగారు. అయితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న మీద ప‌లు ఊహాగానాలకు తావిస్తోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న(Jagan Delhi)

ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని(Jagan Delhi) ర‌మ్మ‌న్నారా? ఆయ‌నే హ‌స్తిన వెళ్లారా? అనేది మొద‌టి ప్ర‌శ్న‌. రెండు వారాల క్రితం(ఏప్రిల్ 17న‌) ఢిల్లీ వెళ్లారు. అప్పుడు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. సాధారణంగా ఢిల్లీ పెద్ద అపాయిట్మెంట్ ను బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఎవ‌రూ అడ‌గ‌రు. స‌భానాయ‌కుడిగా స‌మావేశాల్లో సీఎం అందుబాటులో ఉంటారు. కానీ, ఆయ‌న ఆక‌స్మికంగా ఢిల్లీ వెళ్లారు. అంటే, ముందుగా ఆయ‌న పెట్టుకున్న అపాయిట్మెంట్ (Central Ministers) కాద‌ని క్లారిటీకి రావ‌చ్చు. ఇక బుధ‌వారం సాయంత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈసారి కూడా సీఎం హోదాలో ఆయ‌న షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. జీ20 దేశాల ప్ర‌తినిధుల‌తో కీల‌క స‌మావేశం జ‌రుగుతోంది. విశాఖ తీరాన మూడు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశం ఏపీ బ్రాండ్ క్రియేట్ చేయ‌డానికి ఎంతో ముఖ్య‌మైన‌ది. మూడు రోజుల పాటు విశాఖ‌లోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉండేలా తొలుత షెడ్యూల్ ఉంది. కానీ, హ‌ఠాత్తుగా బుధ‌వారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. అంటే ఈసారి కూడా ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నుంచి పిలుపు వ‌చ్చింద‌ని స్ప‌ష్టం వ‌స్తోంది.

ప్ర‌త్యేక హోదా దేవుడి ద‌య

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మే. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య న‌డుస్తోన్న వ్య‌వ‌హారం మొత్తం ఫ‌క్తు రాజకీయం. ఆ విష‌యాన్ని ఎప్పుడో వైసీపీ నేత‌లు చెప్పేశారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రోజుల్లోనే కేంద్రానికి తెలియ‌కుండా రాష్ట్రంలో ఏమీ చేయ‌మ‌ని ఎంపీ సాయిరెడ్డి చెప్పారు. ప్ర‌త్యేకించి అమిత్ షా, మోడీ గురించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Delhi) ప్ర‌మాణస్వీకారం రోజే ప్ర‌స్తావించారు. ప్ర‌త్యేక హోదా దేవుడి ద‌య అంటూ సీఎం అయిన మ‌రుక్ష‌ణ‌మే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఇక రాష్ట్ర ప్ర‌యోజ‌నాలంటూ ఉంటే , పోల‌వ‌రం మాత్ర‌మే. దానికి సంబంధించిన నిధుల సేక‌రణ అంటూ ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ చెబుతున్నారు. కానీ, ప్ర‌త్య‌ర్థి పార్టీలు మాత్రం కేసుల గురించి మాత్ర‌మే వెళుతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ, ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన రెండుసార్లు ఆయ‌న పెట్టుకున్న అపాయిట్మెంట్ల ప్ర‌కారం కాద‌ని తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఏదో దిశానిర్దేశం(Central Ministers) చేయ‌డానికి మాత్ర‌మే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని పిలిపించుకున్నార‌ని ఒక టాక్‌.

ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పిలిపించుకున్నార‌ని(Central Ministers)

ఒక వేళ ఢిల్లీ పెద్ద‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని (Jagan Delhi)పిలిపించుకున్నారంటే, కేవ‌లం మార్గ‌ద‌ర్శి కేసులో ఓవ‌రాక్ష‌న్ చేయొద్ద‌ని వార్నింగ్ ఇవ్వడానికి పిలిచి ఉంటార‌ని ఒక వాద‌న వినిపిస్తోంది. ఇటీవ‌ల ఒక‌సారి ఏపీ సీఐడీ స‌మ‌న్లు జారీ చేసింది. ఆ స‌మ‌యంలోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక రెండోసారి మంగ‌ళ‌వారం స‌మ‌న్లు జారీ చేయ‌డం జ‌రిగింది. యాదృశ్చిక‌మా? లేక వాస్త‌వ‌మా? అనేది పక్క‌న పెడితే, స‌మ‌న్లు జారీ చేసిన మ‌రుస‌టి రోజు(బుధ‌వారం) సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పిలిపించుకున్నార‌ని(Central Ministers) భావిస్తే మార్గ‌ద‌ర్శి అంశంలో వార్నింగ్ ఇవ్వడానికి మాత్ర‌మేన‌ని భావించడం స‌ర్వ‌సాధార‌ణం.

Also Read : Jagan Delhi :`ముంద‌స్తు` షెడ్యూల్‌,జ‌గ‌న్ ఢిల్లీ సీక్రెట్స్ ఇవేనా?

ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా ఢిల్లీ వెళ్లి(Jagan Delhi) పెద్ద‌ల‌ను క‌లుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు అంటే మాత్రం ఆయ‌న సొంత కేసులు, వివేకా హ‌త్య కేసులో అవినాష్ అరెస్ట్ గురించి లైజ‌నింగ్ కోసమ‌ని ఎవ‌రైనా అనుకుంటారు. ఆస్తుల కేసు సీబీఐ వ‌ద్ద పెండింగ్ లో ఉంది. ప్ర‌తి శుక్ర‌వారం నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌రు కావాలి. కానీ, సీఎం అయిన తరువాత ప్ర‌త్య‌క్ష హాజ‌రు నుంచి మిన‌హాయింపును పొందారు. ప్ర‌స్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఇక కీల‌క‌మైన వివేకా హ‌త్య కేసులో అవినాష్ రెడ్డి ప్ర‌ధాన నిందితుడు. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి సీబీఐ సిద్ధ‌మ‌యింది. అందుకే, ముంద‌స్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేసుకున్నారు. వీటితో పాటు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత కూడా ఇదే కేసులో ఈడీ విచార‌ణ ఎదుర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన వాళ్ల‌కు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ అంటింది. ఒకానొక సంద‌ర్భంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్, వివేకా హ‌త్య కేసును ప్ర‌త్య‌ర్థులు వైఎస్ భార‌తి చుట్టూ తిప్పారు. ఆ కేసుల గురించి మాట్లాడుకోవ‌డానికి వెళ్లార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

ప్ర‌తికూలంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జాకోర్టులో..

తాజాగా పరిణామాలు ప్ర‌తికూలంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జాకోర్టులో క‌నిపిస్తున్నాయి. అందుకే, ఆయ‌న అసెంబ్లీని ర‌ద్దు చేస్తార‌ని టాక్ ఉంది. తెలంగాణ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ ఎన్నిక‌ల‌ను పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోని వినికిడి. అందుకే, కేంద్ర స‌హాయ స‌హ‌కారాల కోసం ఢిల్లీ చుట్టూ(Central Ministers) తిరుగుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మోడీకి చెవిలో ముంద‌స్తు మాట‌ను వేశార‌ని స‌మాచారం. అందుకే, ఆ విష‌యంపై ఫైన‌ల్ చేసుకోవ‌డానికి వెళ్లార‌ని మ‌రో వాద‌న ఉంది. లేదంటే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప‌రోక్షంగా వాడుకోవ‌డానికి బీజేపీ పెద్ద‌లు స్కెచ్ వేసి ఉంటారు. దాని కోసం ఆయ‌న్ను ఢిల్లీ (Jagan Delhi)పిలిపించార‌ని కూడా టాక్ ఉంది. మీడియాముఖంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు ఇలాంటి ఊహాగానాల‌కు ఫుల్ స్టాప్ ప‌డే అవ‌కాశం లేదు.

Also Read : Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ టూర్, పొలిటికల్ చేంజ్