Jagan Delhi Strategy : చంద్ర‌బాబుకు క‌మాండో భ‌ద్ర‌త‌ తొల‌గింపు?

Jagan Delhi Strategy : జైలులో ఉన్న చంద్ర‌బాబుకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌డానికి జ‌గన్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం పావులు

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 02:30 PM IST

Jagan Delhi Strategy : రాజ‌మండ్రి జైలులో ఉన్న చంద్ర‌బాబునాయుడుకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌డానికి జ‌గన్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. అరెస్ట్ నుంచి జైలుకు వ‌ర‌కు న‌డిపిన ఎపిసోడ్ పై శ‌భాష్ అంటూ ఈ ఆప‌రేష‌న్ చేసిన డీజీపీ రాజేంద్ర‌నాథ్ అండ్ టీమ్ ను సీఎం అభినందించార‌ట‌. ఇదే టెంపోను కంటిన్యూ చేయాల‌ని కూడా దిశానిర్దేశం చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. అంటే, జైలు నుంచి బ‌య‌ట‌కు రాకుండా మ‌రింత ప‌గ‌డ్బందీగా వ్యూహం ర‌చించాల‌ని సూచించార‌ట‌. లండ‌న్ నుంచి వ‌చ్చిన రోజే రాజ‌మండ్రి జైలు సూప‌రింటెండెంట్ ను ఆక‌స్మ‌త్తుగా బ‌దిలీ చేశారు. కేవ‌లం చంద్ర‌బాబుకు జైలులో ఉన్న స్కిల్ డ‌వ‌లెప్మెంట్ సెంటర్ ను చూపించినందుకు ఆ బ‌దిలీ జ‌రిగింద‌ని తెలుస్తోంది. అలాగే, చంద్ర‌బాబు ఏ త‌ప్పు చేయ‌లేద‌ని మీడియాకు ఎక్కిన ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేష్ ను మేఘా కంపెనీ నుంచి రాజీనామా చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌డానికి జ‌గన్మోహ‌న్ రెడ్డి పావులు (Jagan Delhi Strategy )

జైలులో ఉన్న చంద్ర‌బాబుకు ప‌రోక్షంగానూ, ప్ర‌త్య‌క్షంగానూ స‌హ‌క‌రించే వాళ్ల మీద ప్ర‌త్యేక నిఘాను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పెట్టింది. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న జడ్ ప్లస్ భ‌ద్ర‌త‌ను కూడా తొల‌గించ‌డానికి కేంద్రంతో సంప్ర‌దింపులు జరుపుతున్నార‌ని స‌మాచారం. ఢిల్లీ వెళ్ల‌డానికి సిద్ధ‌మైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ కావ‌డానికి  (Jagan Delhi Strategy) ప్లాన్ చేస్తున్నారు. ఆ భేటీలో జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త తొల‌గింపు అంశంతో పాటు మిగిలిన కేసుల్లోనూ చంద్ర‌బాబును ఎలా ఇరికించాలి? అనే దానిపై చ‌ర్చిస్తార‌ని టీడీపీ భావిస్తోంది. ప్ర‌స్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691తో 73 ఏళ్ల వృద్ధుడిని సెంట్రల్ జైలులోని ‘స్నేహ’ బ్లాక్‌లోని ప్రత్యేక గదిలో పెట్టారు.

భ‌ద్ర‌త‌పై ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి  ఆందోళ‌న

కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అతనికి ప్రత్యేక గది, ఇంట్లో వండిన ఆహారం, మందులు ఇస్తున్నారు. భ‌ద్ర‌త దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్ర‌స్తుతం Z ప్లస్ కేటగిరీ భద్రతను పొందుతున్నారు. అయితే ఎన్‌ఎస్‌జీ కమాండోలను జైలు లోపలికి అనుమతించలేదు. జెడ్ ప్లస్ భద్రత దృష్ట్యా గృహనిర్బంధానికి అనుమతించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ నేత లాయర్లు పిటిషన్ వేయ‌గా జ‌డ్జి హిమ‌బిందు తిర‌స్క‌రించారు. క్వాష్ పిటిష‌న్ పై విచార‌ణ‌ను ఈనెల 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఫ‌లితంగా చంద్ర‌బాబు  (Jagan Delhi Strategy) మ‌రికొన్ని రోజులు జైలులోనే ఉండాలి. అయితే, భ‌ద్ర‌త‌పై ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కూడా ఆందోళ‌న చెందుతున్నారు.

చంద్రబాబుకు 12+12 ఎన్ఎస్జీ భద్రత

గ‌త ఏడాది ఆగ‌స్ట్ లో ఆయ‌న భ‌ద్ర‌త‌ను స‌మీక్షించిన కేంద్రం సెక్యూరిటీని పెంచుతూ 4+4 కమాండోల నుంచి 6+6 కమాండోలకు పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేర‌కు అప్ప‌ట్లో ఎన్‌ఎస్‌జీ డీజీ భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. వైసీపీ క్యాడ‌ర్ ఆయ‌న మీద రాళ్ల దాడి చేయ‌డంతో అప్ప‌ట్లో కుప్పంలో ఉన్న చంద్రబాబుకు 12+12 ఎన్ఎస్జీ భద్రత క‌ల్పించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అమరావతిలోని చంద్రబాబు నివాసం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ డీజీ క్షుణ్ణంగా అప్ప‌ట్లో ప‌రిశీలించింది. కానీ, ఇప్పుడు ఆ భద్ర‌త‌ను  (Jagan Delhi Strategy) తొల‌గించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.

Also Read : I am With CBN : చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్న ఐటీ ఉద్యోగులు

ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌ను బేస్ చేసుకుని ఏపీ సీఐడీ ఫాలో అవుతోంది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అప్ప‌ట్లో చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేసులుగా సీఐడీ మ‌లిచింది. ఆన్ పేప‌ర్ ఒక్క ఆధారం కూడా లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును జైలుకు పంపింది. అందుకే, ఏపీ సీఐడీ అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జేబు సంస్థ‌గా టీడీపీ అభివ‌ర్ణిస్తోంది. అమ‌రావ‌తి స్కామ్‌, రింగ్ రోడ్డు లైన్మెంట్‌, ఫైబ‌ర్ నెట్, అసైన్డ్ ల్యాండ్ కుంభ‌కోణం..ఇలా ప‌లు అంశాల‌ను తీసుకుని , వాటి మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను బేస్ చేసుకుని సీఐడీ కేసుల‌ను త‌యారు చేసింది. వాటి మీద విచార‌ణ‌కు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని సీఐడీ పిటిష‌న్ వేసింది. అందుకే, విచార‌ణ ఆపాల‌ని హైకోర్టులో చంద్ర‌బాబునాయుడు లాయ‌ర్లు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈనెల 19వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీకి ఇవ్వద్ద‌ని హైకోర్టు చెప్పింది.

Also Read : AP : చంద్రబాబు ఫై ఏపీ సర్కార్ మరో కుట్ర..? ఏకంగా ఫోన్ కాల్స్ చేసి..

ప‌ర్మినెంట్ గా జైలులోనే చంద్ర‌బాబును ఉంచ‌డానికి ప్ర‌త్యేక టీమ్ కు ఆ బాధ్య‌త‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ప‌గించారు. అలాగే, ముంబాయ్, ల‌క్నోలోని ఆయ‌న నెట్ వ‌ర్క్ ద్వారా జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీని తొల‌గించ‌డానికి లాబీయింగ్ చేస్తున్నార‌ని ఎంపీ రఘురామ‌క్రిష్ణంరాజు అనుమానిస్తున్నారు. ఒక‌టి, రెండు రోజుల్లో ఎన్ ఎస్ జీ భ‌ద్ర‌త‌ను తొల‌గిస్తార‌ని చెబుతున్నారు. ఆ త‌రువాత అస‌లు గేమ్ ను రాష్ట్ర పోలీస్ ద్వారా అస‌లు గేమ్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభిస్తార‌ని త్రిబుల్ ఆర్ భావిస్తున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న‌కు ఉన్న వై కేట‌గిరీని తొల‌గించ‌డం ద్వారా ఎలా థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారో గుర్తు చేస్తూ చంద్ర‌బాబుకు క‌మాండోల‌ను తొల‌గించ‌డానికి సీఎం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.