Jagan Delhi sketch : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. గత వారం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయన షడన్ గా మానుకున్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా వేసుకున్నారా? ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఆపరేషన్ పూర్తిగా ముగించిన తరువాత వెళతారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పక్కా ప్రణాళికతో చంద్రబాబును జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ తరువాత టార్గెట్ లోకేష్. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. జాతీయ నేతలు, మీడియా , లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. తండ్రికి జరిగిన అన్యాయంపై హస్తిన కేంద్రంగా వాయిస్ వినిపిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా (Jagan Delhi sketch)
రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును పంపిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన మీద పలు కేసులను బయటకు తీసింది. అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్, ఫైబర్ నెట్ కేసులకు సంబంధించిన వారెంట్లు ఉన్నారు. వాటిలో ఫైబర్ నెట్ కు సంబంధించిన కేసులో లోకేష్ ప్రధానంగా ఉన్నారని ఏపీ సీఐడీ చెబుతోంది. ఆయన కోసం ఢిల్లీకి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. ఏపీ సీఐడీ విభాగంకు చెందిన ఒక డీజీ, ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎనిమిది మంది బృందం ఢిల్లీ వెళ్లిందని వినికిడి. సుప్రీం కోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు (Jagan Delhi sketch) జరపడానికి వెళ్లారని కొందరు అంటున్నారు. లోకేష్ ను అరెస్ట్ చేసి తీసుకురావడానికి వెళ్లారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
ఏపీ సీఐడీ దూకుడుగా ఢిల్లీ
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు, లోకేష్ లను ఒకే జైలులో పెడతానని పలు సందర్భాల్లో అన్నారు. ఆ దిశగా ఏపీ సీఐడీ ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లోనూ ఇదే టెంపోతో ముందుకు కదలాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశమట. అందుకే,ఏపీ సీఐడీ దూకుడుగా ఢిల్లీ వెళ్లింది. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ (Jagan Delhi sketch) వెళతారని తెలుస్తోంది.
Also Read : Jagan Cabinet Inside : మంత్రివర్గంలో `ముందస్తు`టాక్స్
ఢిల్లీ బీజేపీ పెద్దలను కాదని ఏమీ చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్లతో తొలి నుంచి కలివిడిగా రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చే ఆదేశాన్ని శాసనంగా భావిస్తూ దూకుడుగా వెళుతున్నారు. ఆ క్రమంలోనే అప్పట్లో హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ మరో రూపంలో అమలు అవుతోంది. ఒక వైపు కేంద్ర మంత్రి గడ్కరీలాంటి వాళ్లు చంద్రబాబు అరెస్ట్ ను అక్రమంగా భావిస్తున్నారు. మరో వైపు మోడీ, షా ద్వయం మాత్రం తమదైన రీతిలో ఏపీ రాజకీయాన్ని ఆడేసుకుంటున్నారు. అందుకు, జగన్మోహన్ రెడ్డి, పవన్ ను పావులుగా వాడుకుంటున్నారు. శత్రువు, శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారని టాక్. అయితే, పవన్ మాత్రం ఏమీచేయలేని పరిస్థితుల్లో బీజేపీ ఢిల్లీ పెద్దలకు తలాడిస్తూ అవకాశం కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది.
Also Read : CBN Vision Effect : చంద్రబాబు విలువ తెలుస్తోంది.! ప్రపంచ వ్యాప్తంగా నిరసన!!
ప్రతి శుక్రవారం ఎవరో ఒకర్ని అరెస్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుందని టీడీపీ ఆరోపిస్తోంది. బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం జైలుకు హాజరు కావాలి. ఆ విషయాన్ని టీడీపీ బాగా హైలెట్ చేసింది. అందుకే, శుక్రవారం అంటేనే భయపడేలా అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. టార్గెట్ లో ఉన్న వాళ్లందర్నీ అరెస్ట్ చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళతారని తెలుస్తోంది.