Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేప‌ల్లి వైపు సీబీఐ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈనెల 26న ఢిల్లీ (Jagan Delhi) వెళ్ల‌నున్నారు. ఈనెల 27న అక్క‌డ జ‌రిగే నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌వుతారు.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 02:38 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈనెల 26న ఢిల్లీ (Jagan Delhi) వెళ్ల‌నున్నారు. ఈనెల 27న అక్క‌డ జ‌రిగే నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌వుతారు. ఇంత వ‌ర‌కు అధికారికంగా సీఎంవో కార్యాల‌యం ఇచ్చే అధికారిక స‌మాచారం. అయితే, ఆయ‌న ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని(Narendra modi)  క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అపాయిట్మెంట్ ఇవ్వ‌డానికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అపాయిట్మెంట్ లు పీఎంవో, హోంశాఖ మంత్రి కార్యాల‌యం ధ్రువీక‌రించ‌లేదు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈనెల 26న ఢిల్లీ (Jagan Delhi)

సాధార‌ణంగా కేంద్ర మంత్రుల‌ను క‌లిసేందుకు ముందుగా ఆయా రాష్ట్రాల సీఎంలు అపాయిట్మెంట్ ల‌ను(Jagan Delhi) కోర‌తారు. షెడ్యూల్, ఎజెండా ఏమిటి అనేది తెలుసుకుని ఫిక్స్ చేస్తారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎందుకు వ‌స్తున్నారు? ఏమి మాట్లాడ‌తారు? అనేది ముందుగానే కేంద్ర మంత్రుల‌కు, ప్ర‌ధానికి తెలుసు. అందుకే, ఆయ‌న అపాయిట్మెంట్ ఇవ్వ‌డానికి ఈసారి నిరాక‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీ ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కేంద్రం స‌హ‌జంగా ఆశిస్తోంది. కానీ, ఎప్పుడూ నిధుల కోసం లేదా కేసుల నుంచి త‌ప్పించే అంశాన్ని ప్ర‌స్తావించ‌డం ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు(Narendra modi) కూడా విసుగుపుట్టిస్తుంద‌ని స‌మాచారం. అందుకే, ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరుకున్న విధంగా అపాయిట్మెంట్ లు రాలేదు.

ఎన్డీయేతో క‌లిస్తే వైసీపీకి ఉన్న క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు

స‌హజంగా రాష్ట్రంలో బ‌లంగా ఉన్న పార్టీల‌కు కేంద్రంలోని జాతీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బ‌ల‌హీన‌ప‌డ్డారు అనే సంగ‌తి చెవిన ప‌డితే, ఇక టైం వేస్ట్ అనుకుని దూరం జ‌రుగుతుంటారు. తాజా స‌ర్వేల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాగా వ్య‌తిరేక‌త‌ను మూట‌గట్టుకున్నార‌ని ఢిల్లీకి(Jagan Delhi) తెలియ‌ని అంశం కాదు. పైగా క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత మారుతోన్న ఈక్వేష‌న్స్ తో టీడీపీ వైపు బీజేపీ చూస్తోంది. ఎన్డీయే ప‌క్షాన్ని బ‌లంగా ఉంచుకోవాల‌ని భావిస్తోంది. ఎన్డీయేలో చేర‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా లేరు. ఎందుకంటే, ఆయ‌న తొలి నుంచి కాంగ్రెస్ భావ‌జాలంతో ఉంటారు. ఎన్డీయే (NDA) భావ‌జాలానికి పూర్తి భిన్నంగా ఉంటారు. అందుకే, ఎన్డీయేతో క‌లిస్తే వైసీపీకి ఉన్న క్రిస్టియ‌న్, ముస్లిం ఓటు బ్యాంకు క‌రిగిపోతోంది.

సీబీఐ తాడేప‌ల్లి కోట వైపు అడుగులు

తొలి నుంచి బీజేపీ, టీడీపీ భావ‌జాలం ఇంచుమించుగా ఒక‌టే. అందుకే ఆ రెండు పార్టీల కెమిస్ట్రీ కుదిరింది. ప్ర‌జ‌లు కూడా ఆ కూట‌మిని ఆద‌రించారు. జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో కూడా ఎన్డీయేలో కీల‌క భాగ‌స్వామిగా టీడీపీ చాలా కాలం ఉంది. కాంగ్రెస్ భావ‌జాలానికి వ్య‌తిరేకంగా. పుట్టిన పార్టీ టీడీపీ. అదే ఈక్వేష‌న్తో ఆవిర్భ‌వించిన పార్టీ బీజేపీ. అందుకే, కామ‌న్ గా ఆ రెండు పార్టీల కెమిస్ట్రీని ప్ర‌జ‌లు కూడా విశ్వాసంలోకి తీసుకుంటారు. పైగా ఇప్పుడు ఏపీలో వైసీపీ బ‌ల‌హీన‌ప‌డిందని, పూర్వ‌పు మిత్రుడు చంద్ర‌బాబుతో(chandrababu) జ‌త‌క‌ట్టే దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan Delhi) అపాయిట్మెంట్ దొర‌క‌డం క‌ష్ట‌మే.

Also Read : Y Not Jagan : అమ్మో..YS ఫ్యామిలీ! DK వెనుక‌ `వై నాట్ క‌ర్ణాట‌క `!!

ఈనెల 19వ తేదీ క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మ‌రోసారి విచారించనుంది. ఆ రోజున అరెస్ట్ చేస్తార‌న్న టాక్ కూడా బ‌లంగా ఉంది. కానీ, బీజేపీ పెద్ద‌లు కాపాడుతున్నార‌ని కూడా ప్ర‌చారం ఉంది. ఒక వేళ 19 న కూడా అరెస్ట్ చేయ‌కుండా టైం ఇస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న (Jagan Delhi) అంతా అవినాష్ రెడ్డి అరెస్ట్ చుట్టూ తిరిగే అవ‌కాశం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తే ఈనెల 19న అవినాష్ ను అరెస్ట్ చేయ‌డానికి అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అదే జ‌రిగితే, సీబీఐ తాడేప‌ల్లి కోట వైపు అడుగులు వేస్తోంది. అప్పుడు వైఎస్ భార‌తిని కూడా విచారించ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే ఆమె పీఏ న‌వీన్ ను విచారించారు. ఆ కోణం నుంచి ఆలోచిస్తే, తాడేప‌ల్లి కోట వైపు సీబీఐ రాకుండా లైజ‌నింగ్ కోసం ఈనెల 26న ఢిల్లీ వెళ్ల‌నున్న జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిణామాలన్నీ బీజేపీకి మ‌చ్చ తెచ్చిపెడుతున్నాయి. అందుకే, ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అపాయిట్మెంట్ ఇవ్వ‌కుండా దూరంగా ఉండాల‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : Jagan Speech: జగన్ స్పీచ్ లో ‘ముందస్తు’ స్వరం