Jagan Delhi : ప్ర‌త్యేక విమానంలో జ‌గ‌న్ ఢిల్లీకి..ఇక అవినాష్ సేఫ్‌ ?

హ్యాష్ ట్యాగ్` రాసిందే నిజ‌మైంది. (Jagan Delhi)వివేకా హ‌త్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ 26వ తేదీ వ‌ర‌కు ఉండ‌ద‌ని వారం క్రితమే చెప్పింది.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 03:43 PM IST

`హ్యాష్ ట్యాగ్` రాసిందే నిజ‌మైంది. (Jagan Delhi) మాజీ మంత్రి వివేకానందరెడ్డి హ‌త్య కేసులోని సూత్ర‌ధారి అవినాష్ రెడ్డి అరెస్ట్ ఈనెల 26వ తేదీ వ‌ర‌కు ఉండ‌ద‌ని వారం క్రితమే చెప్పింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వ‌చ్చే వ‌ర‌కు అదిగో పులి సామెత‌లా ఇదిగో అరెస్ట్ అంటూ వింటాం మిన‌హా అరెస్ట్ ఉండ‌ద‌ని ముందే ఊహించింది. అదే జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ బ‌య‌లుదేరారు. మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ కు అవినాష్ రెడ్డి త‌ల్లి శ్రీల‌క్ష్మిని త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వ‌చ్చే సంకేతాల ఆధారంగా శ్రీల‌క్ష్మి డిశ్చార్ట్ ఉంటుంద‌న్న‌మాట‌.

ప్ర‌త్యేక వియ‌మానంలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ (Jagan Delhi)

ప్ర‌త్యేక వియ‌మానంలో ఢిల్లీ బ‌య‌లుదేరిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Delhi) మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఈనెల 27న జ‌రిగే నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌వుతారు. అలాగే, పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్సంలో ఈనెల 28న పాల్గొంటారు. కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రం ఆయన తిరిగి ఏపీకి చేరుకుంటారు. క్లుప్తంగా ఇదీ ఆయ‌న అధికారిక షెడ్యూల్. కానీ, అన‌ధికార భేటీలు, లాజ‌నింగ్ లు ఏమి ఉంటాయి? అనేది అంద‌రికీ తెలిసిందే. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)అరెస్ట్ ను ఆప‌డానికి ఎవ‌రెవ‌ర్ని కలుస్తారు? ఎవ‌రితో లైజ‌నింగ్ చేస్తారు? అనేది హాట్ టాపిక్.

రెండు వారాలుగా న్యాయ‌స్థానాల్లో న‌లిగిన ముంద‌స్తు బెయిల్ వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాలేదు. నో బెయిల్ అంటూ సుప్రీం కోర్టు చెప్పిన‌ప్ప‌టికీ సీబీఐ అధికారులు సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. ఆ లోపు అవినాష్ రెడ్డికి మ‌ద్ధ‌తుగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రి విమలారెడ్డి మీడియాకు ఎక్కారు. డాక్ట‌ర్ సునితారెడ్డి దుష్ట‌శ‌క్తులు చెప్పిన‌ట్టు వింటున్నార‌ని చెప్పారు. అంతేకాదు, ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కూడా అవినాష్ రెడ్డికి న్యాయం జ‌ర‌గాల‌ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక తొలి నుంచి ప‌లు ర‌కాల కోణాల నుంచి వివేకా మ‌ర్డ‌ర్ ను తిప్పుతోన్న వైసీపీ ఇప్పుడు `నిజం` అంటూ రోజుకో క‌థ‌ను అల్లేస్తోంది.

అవినాష్ రెడ్డికి మ‌ద్ధ‌తుగా వైఎస్ విమలారెడ్డి

ఇప్ప‌టికే మూడుసార్లు విచార‌ణ‌కు హాజ‌రైన అవినాష్ రెడ్డి స‌రైన స‌మాధానాలు చెప్ప‌డంలేద‌ని సీబీఐ భావిస్తోంది. గుండెపోటుగా ఎందుకు చిత్రీక‌రించారు? హ‌త్యా స్థ‌లంలో ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఎందుకు తుడిచారు? క‌ట్టులు ఎవ‌రు క‌ట్టించారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డంలేదు. గుగూల్ టేకౌట్ రూపంలో దొరికిపోయిన అవినాష్ రెడ్డి ఇచ్చే స‌మాచారం కీల‌కంగా సీబీఐ భావిస్తోంది. కానీ, ఆయ‌న రెండు వారాలుగా విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా త‌ప్పించుకుంటున్నారు. ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేస్తూ తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయ‌న వేసిన పిటిష‌న్ మీద వెకేష‌న్ బెంచ్ విచార‌ణ ఈనెల 25న చేయాల‌ని సుప్రీం ఆదేశించింది. ఆ మేర‌కు గురువారం విచార‌ణ‌కు తీసుకున్న హైకోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీ కేంద్రంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూత‌లు 

ఇదిగో అరెస్ట్ అనేలా సీబీఐ అధికారులు హ‌డావుడి చేశారు. క‌ర్నూలు వేదిక‌గా గ‌త నాలుగు రోజులు హైడ్రామా న‌డుస్తోంది. ఆ జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ త‌ప్పుతుంద‌ని అవినాష్ అరెస్ట్ కు స‌హ‌కారం అందించ‌డంలేదు. ప్ర‌తి రోజూ వైసీపీ శ్రేణులు అక్క‌డే ఉంటూ సీబీఐ క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలిస్తూ ఆందోళ‌న‌కు దిగుతున్నాయి. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Delhi) ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. దీంతో అవినాష్(Avinash Reddy) అరెస్ట్ ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరుగుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే లైజ‌నింగ్ వ్య‌వ‌హారాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూత‌లు ఢిల్లీ కేంద్రంగా న‌డిపార‌ని తెలుస్తోంది. అందుకే, సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : AP CM Jagan : మేం వెళ్తున్నాం.. మీరుకూడా రండి.. ఆ 19 పార్టీల‌ను కోరిన సీఎం జ‌గ‌న్

సీఎం హోదాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ (Jagan Delhi) వెళ్లిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే స్వ‌ప్ర‌యోజ‌నాల వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆయ‌నపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకోవ‌డానికి వెళుతున్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. తొలి రోజుల్లో ఆయ‌న మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసుల‌ను క్లియ‌ర్ చేసుకోవ‌డానికి ప‌లుమార్లు వెళ్లార‌ని విమ‌ర్శించింది. అందుకు త‌గిన విధంగా శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మిన‌హాయింపును పొందారు. అంతేకాదు, అక్ర‌మాస్తుల కేసుల్లోని కొన్ని చార్జిషీట్ల కు క్లియ‌రెన్స్ వ‌చ్చింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్య‌వ‌హారం గొంతుమీద‌కు వ‌చ్చింది. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య తాడేప‌ల్లి కోట‌కు తాకుతుంద‌ని భావిస్తోన్న స‌మ‌యంలో ఢిల్లీ వెళ్ల‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీబీఐని కాద‌ని త‌మ్ముడు అవినాష్ అరెస్ట్ ను త‌ప్పించ‌గ‌ల‌రా? అనేది ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో తేలనుంది.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!