Jagan Delhi :`ముంద‌స్తు` షెడ్యూల్‌,జ‌గ‌న్ ఢిల్లీ సీక్రెట్స్ ఇవేనా?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ (Jagan Delhi) ప‌యనం అవుతున్నారు. ఆయ‌న టూర్ అన‌గానే

  • Written By:
  • Updated On - March 29, 2023 / 12:15 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ (Jagan Delhi) ప‌యనం అవుతున్నారు. స‌హ‌జంగా ఆయ‌న ఢిల్లీ టూర్ అన‌గానే కేసులు, ముంద‌స్తు ఎన్నిక‌ల(Before election) ప్ర‌స్తావ‌న వ‌స్తోంది. సీఎం అయిన తొలి రోజుల్లో హ‌స్తిన‌కు వెళ్లిన ప్ర‌తిసారీ ఆస్తులకు సంబంధించిన కేసుల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చేది. తాజాగా ఎప్పుడు ఢిల్లీ ప‌య‌నం అయిన‌ప్ప‌టికీ అవినాస్ అరెస్ట్ అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. వాటితో పాటు మార్గ‌ద‌ర్శి ఇష్యూ లేటెస్ట్ గా వినిపిస్తోంది. ఈ మూడు అంశాల మీద ఆయ‌న ఢిల్లీ వెళుతున్నార‌ని న‌మ్మేవాళ్లే ఎక్కువ‌.

 జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ ప‌యనం(Jagan Delhi) 

రెండు వారాల క్రితం(మార్చి 17న‌) ఆక‌స్మాత్తుగా ఢిల్లీ (Jagan Delhi) వెళ్లారు. ఆ స‌మ‌యంలో అవినాష్ అరెస్ట్ క్లైమాక్స్ కు వ‌చ్చింది. రెండోసారి ఆయ‌న సీబీఐ ఎదుట హాజ‌రైన సంద‌ర్భం అది. అంతేకాదు, అప్పుడే మార్గ‌ద‌ర్శి ఇష్యూ కూడా న‌డిచింది. ఆ సంస్థ చైర్మ‌న్ రామోజీరావు, ఎండీ శైల‌జ‌కు ఏపీ సీఐడీ స‌మన్లు ఇచ్చింది. దానిపై తెలంగాణ హైకోర్టు రియాక్ట్ అవుతూ ఎలాంటి విచార‌ణ అవ‌స‌రంలేద‌ని చెప్పింది. అయితే, ఇప్పుడు మ‌రోసారి ఏపీ సీఐడీ మంగ‌ళ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. అదే స‌మ‌యంలో అవినాష్ ముంద‌స్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ రెండు కేసులు స‌మాంతరంగా న‌డుస్తున్నాయి. ఇక మూడో కేసు క‌విత లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం. మ‌రోసారి ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మొత్తం మీద రెండు వారాల క్రితం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉందో, ఇప్పుడు కూడా అలాంటిదే ఉంది. అంటే, కేసుల గురించి ఆయ‌న మ‌రోసారి ఢిల్లీ వెళుతున్నార‌ని భావించే వాళ్లు లేక‌పోలేదు.

ముంద‌స్తుకు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌

రాజ‌కీయ కోణం నుంచి చూస్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముంద‌స్తుకు(Before election) వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. తెలంగాణ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ హ‌వా క‌నిపించింది. ప‌ట్ట‌భ‌ద్రులు మూడు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవ‌సం చేసుకుంది. ఈ ఫ‌లితాలు అటు ప్ర‌జాక్షేత్రం, పార్టీలోని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారానికి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి. పార్టీ అంత‌ర్గ‌తంగా అసంతృప్తి బ‌య‌ట ప‌డుతోంది. కొంద‌రు బ‌య‌టప‌డి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద తిర‌గ‌బ‌డ్డారు. ఇంకొంద‌రు లోలోప‌ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక్కసారిగా అంతా బ‌ట‌య‌ప‌డితే పార్టీకి భారీ న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌జాక్షేత్రంలోనూ సానుకూల ప‌రిస్థితులు లేవ‌ని ఫ‌లితాలు చెబుతున్నాయి. అందుకే, మ‌రింత వ్య‌తిరేక‌త వ‌చ్చేలోగా ఎన్నిక‌ల‌ను వ్యూహాత్మ‌కంగా ముగించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నార‌ట‌.

Also Read : YCP-Jagan : పెద్ద `రెడ్ల`తో పెట్టుకుంటే అంతే.! జ‌గ‌న్ రీ థింక్!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే డైర‌క్ష‌న్ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌డుచుకుంటారు. ఎందుకంటే, ఆస్తుల నుంచి కేసుల వ‌ర‌కు తెలంగాణ ప‌రిధిలోనే ఉన్నాయి. ఆయ‌న్ను కాద‌ని ఒక్క అడుగు కూడా ముందుకేసే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీకి దూరంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోన్న కేసీఆర్ నేరుగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌తో మాట్లాడ‌డంలేదు. ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Delhi ) ద్వారా క‌థ‌ను న‌డిపిస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, తెలంగాణ ఎన్నిక‌ల‌తో ఏపీ ఎన్నిక‌ల‌కు వెళ్లేలా ఢిల్లీ వేదిక‌గా లైన్ క్లియ‌ర్ చేసే వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఇద్ద‌రూ క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ద్వారా వ‌చ్చే లాభాల‌ను బేరీజు వేసుకున్నారు. సుమారు 15 ల‌క్ష‌ల మంది పైగా ఉన్న సెటిల‌ర్ ఓట‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ముంద‌స్తు క‌థ‌ను న‌డిపిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు కేంద్రం వ‌ద్ద ముంద‌స్తు అంశాన్ని ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సూచాయ‌గా ప్ర‌స్తావించిన‌ట్టు రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. ముంద‌స్తు షెడ్యూల్ (Before eletion) ప్ర‌కారం బుధ‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఢిల్లీకి ప‌య‌నం అవుతున్నారు. ఈసారి ముంద‌స్తు మీద ఒక క్లారిటీ రానుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

 Also Read : CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే