Pablo Escobar : డ్ర‌గ్ డాన్ తో పోల్చడం పై చంద్రబాబు పై జగన్ ఫైర్

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంట‌ని, టాటా, రిల‌య‌న్స్‌,అంబానీల క‌న్నా ఎక్కువ సంప‌న్నుడు కావాల‌ని అలా చేసిన‌ట్లు

Published By: HashtagU Telugu Desk
Jagan Drug Lord Pablo Emili

Jagan Drug Lord Pablo Emili

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) ను కొలంబియా డ్ర‌గ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌(Drug Lord Pablo Emilio Escobar)తో సీఎం చంద్రబాబు (Chandrababu) పోల్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పోల్చిన డ్ర‌గ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌ ఎవరో తనకు తెలియదని..ఆయన పేరును పదే పదే చంద్రబాబు పలుకుతున్నాడంటే..ఖచ్చితంగా చంద్రబాబు కు అతడు ఫ్రెండే కావొచ్చు అంటూ జగన్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ జగన్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో గురువారం కొలంబియా డ్ర‌గ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌తో జగన్ ను పోల్చారు. ఢిల్లీలో జ‌గ‌న్ చేపట్టిన నిర‌స‌న‌ను బాబు వ్య‌తిరేకించారు. అసెంబ్లీలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పాబ్లో ఎస్కోబార్ .. కొలంబియా డ్ర‌గ్ లార్డ్ అని, అత‌నో నార్కో ఉగ్ర‌వాది అని, రాజ‌కీయ‌వేత్త‌గా మారిన ఆ డ్ర‌గ్ వ్యాపారి.. ఆ త‌ర్వాత త‌న కార్టెల్‌తో డ్ర‌గ్స్‌ను అమ్ముకున్న‌ట్లు తెలిపారు. ఆ స‌మ‌యంలో అత‌ను 30 బిలియ‌న్ల డాల‌ర్లు ఆర్జించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పుడు ఆ డ్ర‌గ్ సేల్ విలువ సుమారు 90 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని బాబు త‌న ప్ర‌సంగంలో తెలిపారు.

1976లో మొద‌టిసారి పాబ్లో ఎస్కోబోర్‌ను అరెస్టు చేశార‌ని, కానీ 1980లో అత‌ను ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న‌మైన డ్ర‌గ్ కింగ్‌పిన్‌గా అవ‌త‌రించిన‌ట్లు చంద్ర‌బాబు తెలిపారు. డ్ర‌గ్స్ అమ్ముతూ ఎవ‌రైనా సంప‌న్నులు కావ‌చ్చు అని సీఎం త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంట‌ని, టాటా, రిల‌య‌న్స్‌,అంబానీల క‌న్నా ఎక్కువ సంప‌న్నుడు కావాల‌ని అలా చేసిన‌ట్లు చంద్ర‌బాబు ఆరోపించారు.

Read Also : IND vs SL: రేపే శ్రీలంక‌- టీమిండియా జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20.. ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే..?

  Last Updated: 26 Jul 2024, 09:48 PM IST