AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ అధినేత జగన్ (Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్.. ‘పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు’ అని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను గుర్తించకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా విషయంలో ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవని, గతంలో టీడీపీకి తాము ప్రతిపక్ష హోదాను ఇచ్చినట్టు గుర్తుచేశారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు రెండు పక్షాలుగా మాత్రమే ఉంటారని, జనసేన-బీజేపీ కూటమికి ఈ హోదా లభించకపోతే మరెవరికీ లభించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
MK Stalin : ప్రధానికి తమిళంపై ప్రేమ ఉంటే.. చేతల్లో చూపించాలి : సీఎం స్టాలిన్
అలాగే ప్రతిపక్ష సభ్యులకు సభలో తగినంత సమయం ఇవ్వకపోవడం తగదని జగన్ అభిప్రాయపడ్డారు. విపక్షాలను పట్టించుకోకుండా కేవలం అధికార పక్షం అనుకున్న విధంగానే సభను నడిపించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకునేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రక్రియలు, నియమాలు ఉంటాయనీ, అవన్నీ పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జగన్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో గతంలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపిస్తూ.. ఆప్ ప్రభుత్వం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ బీజేపీకి ప్రతిపక్ష హోదాను ఇచ్చిన విషయం జగన్ ప్రస్తావించారు. ఇదే విధంగా ఏపీ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా రావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన జగన్, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి, ప్రతిపక్షాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మరి జగన్ కామెంట్స్ పై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Vemula Veeresham : న్యూ** వీడియో కాల్ ఘటనపై MLA వేముల వీరేశం రియాక్షన్