Site icon HashtagU Telugu

Jagan : ఆహా జ‌గ‌న్ ఓహో జ‌గ‌న‌న్న‌..చెబుదాం రండి!

Jagan

Jagan

కొత్త సీసాలో పాత సారా అన్న‌ట్టు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) పరిపాల‌న ఉంది. శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు గ‌తంలో చేసిన వాటికి మ‌ళ్లీమ‌ళ్లీ చేస్తున్నారు. అంతేకాదు, అమ‌లులో ఉన్న వాటిని కొత్త వాటిగా చూపుతూ ప్ర‌చారానికి(Publicity) అర్రులు చాస్తున్నారు. గ‌తంలో డ‌య‌ల్ యువ‌ర్ సీఎం అంటూ టోల్ ఫ్రీ నెంబ‌ర్ చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఉండేది. అంతేకాదు, ప్ర‌భుత్వం ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌తో ఆటోమాటిక్ వాయిస్ ద్వారా చంద్ర‌బాబు మాటలు ప్ర‌తి ఫోన్లోనూ వినిపించేవి. ఇప్పుడు దాని నెంబ‌ర్ మార్పు చేస్తూ అవినీతి ర‌హిత పాల‌న కోసం `జ‌గ‌న‌న‌న్న‌కు చెబుదాం` అంటూ కొత్త టైటిల్ పెట్టారు. దాన్నే కొత్త త‌ర‌హాగా ప్ర‌చారం చేస్తూ మంగ‌ళ‌వారం ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న‌న్న‌కు చెబుదాం…1092 టోల్ ఫ్రీం ప్రారంభం (Jagan)

సీఎంగా (Jagan)బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొత్త‌ల్లో మంచి సీఎంగా 100 రోజుల్లో మీ అంద‌రితో అనిపించుకుంటాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వీయ గ‌డువు పెట్టుకున్నారు. ఏడాదిలోగా అవినీతి ర‌హిత పాల‌న అందిస్తాన‌ని రెండు టోల్ ఫ్రీం నెంబ‌ర్ల‌ను కూడా అప్ప‌ట్లో ప‌రిచ‌యం చేశారు. ఒక‌టేమో 14400, రెండోది 14500. ఈ రెండు నెంబ‌ర్ల‌ను మూడేళ్ల క్రితం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్భాటంగా(Publicity) ప్రారంభించారు. కానీ, వాటికి వ‌చ్చిన ఫిర్యాదుల దెబ్బ‌కు మూగ‌బోవ‌డం అవినీతి పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా మారింది.

ఒక‌టేమో 14400, రెండోది 14500 మూగ‌బోవ‌డం 

ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ముందేఎన్నో ఏళ్లుగా ఏసీబీ 1064 అనే టోల్‌ఫ్రీ నంబరుతోపాటు 8333995858 అనే నంబరు మొబైల్ నెంబ‌ర్ ద్వారా ఫిర్యాదుల‌ను స్వీక‌రిస్తోంది. వాట్సప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1100 కాల్‌సెంటర్‌కూ అవినీతిపై భారీగా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. వాటిని కాద‌ని, మూడేళ్ల క్రితం 14400, 14500 నెంబ‌ర్ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం(Publicity) చేశారు. అవినీతి ర‌హిత పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌తాన‌ని హామీ ఇచ్చారు. సీన్ క‌ట్ చేస్తే, ఎమ్మెల్యేల అవినీతి పెరిగింది. భూ దందాలు, డ్ర‌గ్స్, గంజాయి త‌దిత‌ర మ‌త్తు ప‌దార్థాల స‌ర‌ఫ‌రా ఎక్కువ అయింది. వాట‌న్నింటి మీద ప‌లు ఫిర్యాదు వెల్లువెత్త‌డంతో ఆ నెంబ‌ర్ల‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌కు ప‌రిష్కారం ల‌భించ‌లేదు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భారీ ప్ర‌క‌ట‌న‌ల‌తో (Publicity) ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసిన నెంబ‌ర్లు స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం విచిత్రం.

`స్పందన` దానికి మెరుగైన వెర్షన్ గా

తాజాగా మంగ‌ళ‌వారం నాడు `జ‌గ‌న‌న్న‌కు చెబుదాం` అంటూ సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్‌ను (Jagan) ప్ర‌క‌టించారు. పౌరులు నేరుగా వైఎస్ఆర్ ఐడీతో సిఎం కార్యాలయానికి కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగనన్నకు చెబుదాంను ప్రోగ్రామ్ ను సీఎం (Publicity)ప్రారంభించారు. `జగనన్నకు చెబుదాం` ప్ర‌స్తుతం ఉన్న `స్పందన` దానికి మెరుగైన వెర్షన్ గా చెబుతున్నారు. పౌరులను చేరుకోవడం, వారి మనోవేదనలను కేంద్రీకృత పద్ధతిలో సేకరించడం త‌ద్వారా వాటిని మిషన్ మోడ్‌లో పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అప్‌డేటెడ్ గ్రీవెన్స్ సిస్టమ్ కింద, ఫిర్యాదులను నమోదు చేసిన తర్వాత YSR (మీ సేవ అభ్యర్థన) ID ఇవ్వబడుతుంది. దరఖాస్తుల స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు SMS ద్వారా సకాలంలో ఇవ్వ‌డానికి ఏర్పాట్టు చేశామ‌ని చెబుతున్నారు. సిస్టమ్‌లో వచ్చిన దరఖాస్తులను ట్రాక్ చేసి పర్యవేక్షిస్తామని సీఎం జగన్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

ఆటోమాటిక్ మోడ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాయిస్ (Jagan)

అవినీతిని పారద్రోలి పక్షపాత రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ఈ ప‌ద్ధ‌తి ఉప‌క‌రిస్తుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) అంటున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను అందించినట్లు అధికారులు (Publicity)వెల్ల‌డించారు . ప్రభుత్వ పథకాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు లేదా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందడంలో ఏదైనా సమస్య, రేషన్ కార్డు పొందడంలో ఇబ్బంది లేదా రైతులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు లేదా ఇతరులకు సంబంధించిన ప్రభుత్వ సేవలను పొందడంలో ఏదైనా అవరోధాలు ఎదురైనప్పుడు `జగనన్నకు చెబుదాం` ద్వారా 1092కు ఫిర్యాదులు చేయవచ్చు. అప్పుడు ఆటోమాటిక్ మోడ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) వాయిస్ వ‌చ్చేలా కొత్త వ‌ర్ష‌న్ తీసుకొచ్చారు.

Also Read : Sikh Leaders Meet CM Jagan: సిక్కు మత పెద్దలతో సమావేశమైన సీఎం జగన్.. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

YSR ఆరోగ్యశ్రీ సేవలను అందుకోవడంలో ఏదైనా అవాంతరాలు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ సేవలు, ఇతర వ్యక్తిగత స్థాయి ఫిర్యాదులు ఉంటే, ప్రజలు “జగనన్నకు చెబుతాం” @ 1902కి కాల్ చేసి వాటిని సకాలంలో పరిష్కరించవచ్చు. సమస్యలను నమోదు చేసుకోవడానికి 1902కి కాల్ చేయాలి, ఫిర్యాదులు నమోదు చేయ‌గానే YSR (మీ సేవ అభ్యర్థన) ID ఇవ్వబడుతుంది. IVRS & SMS ఆధారిత కమ్యూనికేషన్ ద్వారా పౌరులు తమ ఫిర్యాదు పరిష్కారానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. `జగనన్నకు చెబుదాం` కింద, ప్రజలు తమ ఫిర్యాదులను అత్యున్నత స్థాయిలో పరిష్కరించేందుకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి (Jagan) కార్యాలయాన్ని సంప్రదించగలరని అధికారులు చెబుతున్నారు.

Also Read : Balineni : జ‌గ‌న్ పై `బాలినేని`ప‌వ‌రిజం, YCPకి బై?

మొత్తం మీద ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 14400, 14500 ,1064 టోల్ ఫ్రీ, మొబైల్8333995858 నెంబ‌ర్ల‌కు తోడుగా మంగ‌ళ‌వారం 1902 కూడా అవినీతి ర‌హితానికి టోల్ ఫ్రీగా నెంబ‌ర్ గా చేరింది. అందుకోసం భారీ ప్ర‌క‌ట‌న‌ల (publicity) జారీకి కోట్ల రూపాయాల్లో వ్య‌యం చేశారు. కానీ, మూడేళ్ల క్రితం ప‌రిచయం చేసిన టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌కు మాత్రం ప‌రిష్కారం ల‌భించ‌లేదు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప‌రిచ‌యం చేసిన 1100 కాల్‌సెంటర్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ అడ్ర‌స్ కూడా లేకుండా పోయింది. ఇక `జ‌గ‌న‌న్న‌కు చెబుదాం` అంటూ మ‌రో ప్ర‌చారానికి తెర‌లేపారు. వంద రోజుల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటాన‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ప్ర‌తిష్ట ఇప్పుడు ఎలా ఉందో అంద‌రికీ తెలుసు. ఇక ఏడాదిలో అవినీతి ర‌హిత పాల‌న అంటూ నాలుగేళ్ల క్రితం చెప్పారు. ఆయ‌న రూ. 2ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని ప్ర‌తిప‌క్షం పుస్త‌కాలు వేసింది. ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని నియోక‌వ‌ర్గాల వారీగా టీడీపీ బుక్ లెట్ల రూపంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. తెర వెనుక మ‌ద్ధ‌తు ఇస్తోన్న బీజేపీ కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద చార్జిషీట్ వేయాల‌ని ప్ర‌క‌టించింది. ఇంకేం చెబుదాం జ‌గ‌న‌న్న‌కు.!