Jagan cinema : వెండితెర‌పై జగ‌న్‌ తాండ‌వం, `ఫైబ‌ర్ నెట్ ` లో కొత్త సినిమాల‌ రిలీజ్‌

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సినిమా ప‌రిశ్ర‌మను(Jagan cinema) నేల‌కేసి కొట్టారు. భ‌విష్య‌త్ లోనూ కోలుకోని విధంగా వివాద‌స్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - June 1, 2023 / 04:06 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సినిమా ప‌రిశ్ర‌మను(Jagan cinema) నేల‌కేసి కొట్టారు. భ‌విష్య‌త్ లోనూ కోలుకోని విధంగా వివాద‌స్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త సినిమా తొలి రోజే ఏపీ ఫైబ‌ర్ నెట్ లో (fibernet)విడుద‌ల చేయాల‌ని నిబంధ‌న పెట్టారు. ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నా ఆయ‌న శుక్ర‌వారం అధికారికంగా ఆ ప్రోగ్రామ్ ను ప్రారంభించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మించే సినిమాల మీద ఈ నిర్ణ‌యం న‌ష్టం చేకూర్చ‌నుంద‌ని సినిమా ప‌రిశ్ర‌మ ఆందోళ‌న చెందుతోంది.

కొత్త సినిమా తొలి రోజే ఏపీ ఫైబ‌ర్ నెట్ లో  విడుద‌ల (Jagan cinema)

తొలి నుంచి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan cinema) ప్ర‌త్యేక క‌న్నేశారు. ఇండ‌స్ట్రీ ఏపీకి త‌ర‌లి రావాల‌ని కోరారు. కానీ, సినీ పెద్ద‌లు ఎవ‌రూ ఏపీకి వెళ్ల‌లేదు. సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం హైద‌రాబాద్ లోనే ఉంది. నిర్మాణం 80శాతం పైగా తెలంగాణ ప్రాంతంలోనే జ‌రుగుతోంది. వ‌సూళ్లు మాత్రం ఏపీ నుంచి ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి వ్య‌త్యాసాన్ని చూపుతూ ఏపీకి సినిమా ప‌రిశ్ర‌మ త‌ర‌లిరావాల‌ని ప‌లుమార్లు ఏపీ ప్ర‌భుత్వం కోరింది. అంతేకాదు, ఆ రాష్ట్రంలో ఉండే సినిమా యూనియ‌న్లు కూడా డిమాండ్ చేశాయి. ఒక వేళ ఏపీలో సినిమాల‌ను నిర్మించ‌క‌పోతే, విడుద‌ల చేయ‌నివ్వ‌బోమ‌ని కొన్ని సంఘాలు హెచ్చ‌రిక‌లు కూడా చేయ‌డం జ‌రిగింది.

ఏపీకి సినిమా ప‌రిశ్ర‌మ త‌ర‌లిరావాల‌ని ప‌లుమార్లు

హైద‌రాబాద్ నుంచి ఏపీకి త‌ర‌లి రావ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌య‌త్నాలు చేసింది. అనేక రాయితీల‌ను కూడా ప్ర‌క‌టించింది. భారీ, చిన్న సినిమాల నిర్మాణానికి వేర్వేరుగా రాయితీల‌ను ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఏపీ వైపు సినిమా ప‌రిశ్ర‌మ చూడ‌లేదు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆన్ లైన్ టిక్కెట్ (Jagan cinema)ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ పెట్టారు. భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు బెనిఫిట్ షోల‌ను ఇవ్వ‌డం మానేశారు. ఇష్టానుసారం కొత్త సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డాన్ని నిషేధించారు. ఇప్పుడు ఫైబ‌ర్ నెట్ (Fibernet)లో కొత్త సినిమా విడుద‌ల ఉండాల్సిందేన‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

బెనిఫిట్ షోల కోసం అగ్ర‌హీరోలు

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత సినిమా పెద్ద‌లు ఎవ‌రూ అభినంద‌న‌లు తెల‌ప‌డానికి వెళ్ల‌లేదు. కొన్ని నెల‌లు త‌రువాత తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీస్ కు సినిమా పెద్ద‌లు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అప్ప‌టి నుంచి సినిమా పరిశ్ర‌మ‌, ఏపీ ప్ర‌భుత్వానికి ఉన్న గ్యాప్ కొన‌సాగుతోంది. ఆ త‌రువాత ఆన్ లైన్ టిక్కెట్ అంశం వ‌చ్చిన త‌రువాత కొన్ని నెల‌ల పాటు ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఆర్జీవీ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తో స‌యోధ్య కుదుర్చే ప్ర‌య‌త్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి రెండుసార్లు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆహ్వానం మేర‌కు ప్ర‌త్యేక విమానంలో తాడేప‌ల్లి వెళ్లారు. అప్ప‌టి నుంచి వాళ్లిద్ద‌రి మ‌ధ్యా స్నేహ‌భావం పెరిగింది. ఆ త‌రువాత ఆన్ లైన్ టిక్కెట్‌, బెనిఫిట్ షోల కోసం అగ్ర‌హీరోలు ప్ర‌భాస్, మ‌హేష్‌, నాగార్జున‌, చిరంజీవి త‌దితరులు క‌లిసి వెళ్లారు.

ఏపీ చ‌ల‌న చిత్ర అభివృద్ధి మండ‌లి చైర్మ‌న్ పోసాని మురళీకృష్ణ‌

సినిమా పెద్ద‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు ప‌ట్టువిడుపును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan cinema) ప్ర‌ద‌ర్శించారు. ఏపీ చ‌ల‌న చిత్ర అభివృద్ధి మండ‌లి చైర్మ‌న్ బాధ్య‌త‌ల‌ను పోసాని మురళీకృష్ణ‌కు అప్ప‌గించారు. ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింది. ఆ క్ర‌మంలో ఫైబ‌ర్ నెట్ (fibernet)ద్వారా కొత్త సినిమాల విడుద‌ల ఉండాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ స‌ర్కార్ అధికారికంగా విశాఖ కేంద్రంగా ప్రారంభించ‌నుంది. దీనిపై సినిమా పెద్ద‌లు మండిప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం మాత్రం ఆ నిర్ణ‌యాన్ని వెనుక్కు తీసుకునే ఆలోచ‌న లేదు. ఎందుకంటే, సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం తెలంగాణ ప్ర‌భుత్వం ఆధీనంలోనే ప‌నిచేస్తోంది. పైగా సినిమా ప‌రిశ్ర‌మ వల‌న ఏపీ రాష్ట్రానికి ఏ మాత్రం లాభంలేదు. వ‌సూళ్ల రూపంలో వేల కోట్ల రూపాయ‌లు తెలంగాణ ప్ర‌భుత్వానికి జ‌మ అవుతోంది.

Also Read : IPL Final: డిజిటల్ స్ట్రీమింగ్ లో JioCinema రికార్డ్, 3.2 కోట్ల వ్యూయర్ షిప్ తో ఐపీఎల్ ఫైనల్!

తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan cinema) తీసుకున్న నిర్ణ‌యం ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌లను న‌ష్ట‌ప‌ర‌చ‌నుందని ప్రోడ్యూస‌ర్స్ కౌన్సిల్ కార్య‌ద‌ర్శి న‌ట్టికుమార్ అంటున్నారు. ఇదే వాయిస్ ను సినిమా పెద్ద‌లు వినిపిస్తున్నారు. అయితే, ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు సినిమా ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ నుంచి త‌ర‌లి రావాల‌ని కోరుకుంటున్నారు. వాళ్ల అభీష్టం మేర‌కు సినిమా ప‌రిశ్ర‌మ న‌డుచుకోవ‌డంలేదు. పైగా సినిమాల రూపంలో కోట్లాది రూపాయ‌లు ఏపీ నుంచి ప‌రిశ్ర‌మ దోచుకుంటోంది. అందుకే, త‌క్కువ ఖ‌ర్చుతో వినోదం అందించే క్ర‌మంలో ఫైబ‌ర్ నెట్ ద్వారా కొత్త సినిమా విడుద‌ల రోజే ప్ర‌ద‌ర్శించాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక తెలుగు ప‌రిశ్ర‌మ ఏపీకి త‌ర‌లి వెళ్ల‌డ‌మా? లేదా అనేది తేల్చుకోవాల్సిందే.

Also Read : Telugu Film :టాలీవుడ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిచ్చు! చిరు, బాల‌య్య సినిమాల‌ వార్‌!