Jagan Case : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని టీడీపీ బాంబ్ పేల్చింది. ఆయన ఆస్తుల కేసులకు సంబంధించిన ట్రయల్స్ ను బయటకు తీసింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆర్థిక నేరపూరిత కేసులు ఏడాది లోపు విచారణ ముగించాలి. ఆ ప్రకారం మంగళవారం నుంచి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ సంపాదన కేసులు విచారణ ప్రారంభ కానుందని మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని టీడీపీ (Jagan Case)
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో (Jagan Case) నడిచింది. పలు సూట్ కేసు కంపెనీలకు డబ్బు వెళ్లిందని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించిన విచారణ సీబీఐ చేయాల్సి ఉంది. ఓబులాపురం మైన్స్, వాన్ పిక్ ఇష్యూల్లోనూ ఆయన మీద కేసులు ఉన్నాయి. సుమారు లక్ష కోట్ల అక్రమ సంపాదన క్విడ్ ప్రో కో కింద జగన్మోహన్ రెడ్డి పోగేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ లోని ఇళ్లు కూడా కబ్జా చేసి కట్టారని యనమల గుర్తు చేస్తున్నారు. ఆ కేసుల విచారణ గురించి ప్రజలు మాట్లాడుకోకుండా లండన్లోని జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిప్ట్ మాదిరిగా ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందని ఆయన చెబుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో కేసులో
పలువురు ఐఏఎస్ లు కూడా జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో కేసులో (Jagan Case)అరెస్ట్ అయ్యారు. జైలు జీవితం కూడా గడిపారు. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీ ఒబులాపురం కేసులో నిందితురాలిగా జైలు జీవితాన్ని అనుభవించారు. అంతేకాదు, డజను మంది అధికారులు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈడీ 5వేల కోట్లను అటాచ్ చేసింది. ఇప్పటి వరకు 33 చార్జీషీట్లు జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు సిద్దంగా ఉన్నాయి. వాటి విచారణ మంగళవారం నుంచి ప్రారంభం కానుందని టీడీపీ చెబుతోంది.
16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైలు
సుమారు 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైలు జీవితాన్ని గడిపారు. అక్రమ సంపాదనకు సంబంధించిన కేసుల్లో నిందితునిగా ఆయన మీద ముద్రపడింది. అందుకు సంబంధించిన కేసుల విచారణ చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ప్రత్యేక అనుమతితో విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చిన వెంటనే కేసుల విచారణ ప్రారంభం కానుందని టీడీపీ చెబుతోంది. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒకటి రెండు వారాలు మాత్రమే హాజరయ్యారు. ఆ తరువాత కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు. కానీ, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏడాది లోపు ఆ కేసుల విచారణ (Jagan Case)ముగించాలి.
Also Read: Jagan Political Depression: పొలిటికల్ డిప్రెషన్ లో జగన్..!
ఇటీవల సుప్రీం కో్ర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల విచారణను ముగించాలి. అందుకు ట్రయల్స్ వేగంగా నడవాలి. ఆయన మీద ఉన్న కేసుల విచారణ పూర్తయితే, జైలుకు వెళతారని టీడీపీ విశ్వసిస్తోంది. కానీ, వైసీపీ మాత్రం కడిగిన ముత్యంలా జగన్మోహన్ రెడ్డి బయటపడతారని చెబుతోంది. ఇప్పటికే పలు కేసుల నుంచి ఉపశమనం పొందిన ఆయన మిగిలిన కేసుల్లోనూ స్వచ్ఛంగా బయటపడతారని నమ్ముతోంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కుట్రచేసి పెట్టిన కేసులుగా వైసీపీ తొలి నుంచి చెబుతోంది. అందుకే, వాటిని నుంచి జగన్మోహన్ రెడ్డి
సేఫ్ గా బయటపడతారని చెబుతోంది. కానీ, టీడీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖాయమంటూ చెబుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీల వ్యవహారం అంతా తన వద్ద ఉందని మాజీ మంత్రి యనమల తాజా ప్రకటించారు. అవసరమైనప్పుడు అన్నింటినీ బయటపెడతానంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు.
Also Read : Chandrababu Arrest – YCP Happy : చంద్రబాబు అరెస్ట్ ..సంబరాల్లో వైసీపీ