Site icon HashtagU Telugu

Amravati: అమ‌రావ‌తిపై జగన్ మంత్రివర్గం, 13న కీలక నిర్ణయం

Jagan Cabinet

Jagan Cabinet

అమరావతి (Amravati) రాజధాని మీద కీలక నిర్ణయం తీసుకోవడానికి సీఎం జగన్మోహనరెడ్డి (Jagan Mohan Reddy) సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.ఈ నెల ఈ నెల 13వ తేదీన మంత్రివర్గం సమావేశంలో సంచలన తీర్మానం చేయబోతున్నారని టాక్. సచివాలయంలో 13న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో- విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ముహూర్తాన్ని ఇదే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయానికి రావొచ్చని చెబుతున్నారు. ఉగాది నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలోనూ రాజదానిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. పరిపాలన ఎక్కడ నుంచి కొనసాగించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమనీ ఆనాడు వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్ట్ తాజాగా చేసిన కామెంట్స్ , కేంద్రం ఇచ్చే సంకేతాల
నడుమ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు రూపకల్పనకు తుదిరూపాన్ని ఇవ్వడానికి సిద్ధం అయింది. అదే సందర్భం లో అమరావతి రైతులకు మేలు చేసే ప్రకటన జగన్ చేస్తారని తెలుస్తుంది. సాంకేతికంగా అడ్డంకులు లేకుండా సమగ్ర వికేంద్రీకరణ బిల్లును తయారు చేస్తుందని తాడేపల్లి వర్గాల వినికిడి. వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారని, ఈ దిశగా కీలక అడుగు పడబోతోందని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.
రాజధానుల ఏర్పాటుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడు పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తోంది. ఇదివరకు వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న సందర్భంగా దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయాత్తమౌతోంది. మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ వైఎస్ జగన్ అప్పట్లో సభలో ప్రకటించిన విషయం విదితమే. కొత్త బిల్లుకు తుది రూపాన్ని ఇస్తోన్నట్టే సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. న్యాయ చిక్కులు లేకుండా ఈసారి సమగ్ర బిల్లుకు ఆమోదం తెలపడానికి మంత్రివర్గం ఏజండా గా పెట్టుకుందని తెలుస్తుంది.

Read More: TRS To BRS: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. డిసెంబర్ 8 తర్వాత క్లారిటీ..?