Jagan Cabinet 3.0 : `ముంద‌స్తు` లేదు! మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న‌ మూడోసారి షురూ?

Jagan Cabinet 3.0 : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని ఏపీ వ్యాప్తంగా వినిపించింది.జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా కూడా టాక్ న‌డిచింది.

  • Written By:
  • Updated On - June 7, 2023 / 05:08 PM IST

Jagan Cabinet 3.0 : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని ఏపీ వ్యాప్తంగా వినిపించింది. తాజాగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా బీజేపీ పెద్ద‌ల స‌హ‌కారం కూడా పొంద‌ర‌ని టాక్ న‌డిచింది. కానీ, బుధ‌వారం క్యాబినెట్ స‌మావేశం సంద‌ర్భంగా ముంద‌స్తుకు వెళ్ల‌డంలేద‌ని (No early elections) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చేశారు. అంటే, మూడోసారి క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌న్న ఊహాగానం బ‌య‌లు దేరింది. క‌నీసం ఐదు మందికి త‌గ్గ‌కుండా ఇప్పుడున్న మంత్రులు ఔట్ అంటూ ప్ర‌చారం తాడేప‌ల్లి వ‌ర్గాల్లో అప్పుడే బ‌య‌లు దేరింది.

క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న దిశ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి( Jagan Cabinet 3.0)

తెలంగాణ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది. ప‌లు ర‌కాల ఈక్వేష‌న్ల‌ను లెక్కించుకున్న జ‌గ‌న్, కేసీఆర్ ఒక‌సారి ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని ఇటీవ‌లి టాక్‌. అందుకు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప్ర‌ధాని మోడీ, అమిత్ షా వ‌ద్ద అనుమ‌తి తీసుకున్నార‌ని తెలిసింది. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా ముంద‌స్తు ఖ‌య‌మ‌ని భావించాయి. అందుకే, `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి` అంటూ చంద్ర‌బాబు(Chandrababu) స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి వారం మూడు రోజుల పాటు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో ఉన్నారు. యువ‌గ‌ళం పేరుతో నారా లోకేష్(Nara Lokesh) పాద‌యాత్ర చేస్తున్నారు. త్వ‌ర‌లోనే వారాహి వాహ‌నం మీద ప‌వ‌న్ కల్యాణ్ (Pawan Kalyan) ప్ర‌చారానికి దిగ‌బోతున్నారు. ప్ర‌త్యర్థులు ప్ర‌చారంలో ఉండ‌గానే ముంద‌స్తు రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల‌ను ముగిస్తార‌ని భావించారు. ఆ విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కూడా ప‌లుమార్లు వెల్ల‌డించారు. కానీ, క్యాబినెట్ స‌మావేశంలో మ‌రో 9 నెల‌ల త‌రువాత మాత్ర‌మే ఎన్నిక‌లు ఉంటాయ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) తేల్చేశారు. అంటే, గడువు ప్ర‌కారం మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు వ‌స్తాయ‌న్న‌మాట‌.

మ‌రో 9 నెల‌ల త‌రువాత మాత్ర‌మే ఎన్నిక‌లు

ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jaganmohan Reddy) సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఇటీవ‌ల రెవెన్యూ లోటు రూపంలో సుమారు 11వేల కోట్ల‌ను కేంద్రం విడుదల చేసింది. మ‌రో 16వేల కోట్ల‌ను మంజూరు చేయ‌డానికి కేంద్రం సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నిధుల‌తో న‌వ‌ర‌త్నాల‌తో పాటు ఏపీ అభివృద్దికి కొంత మేర‌కు బాట వేయ‌డానికి అవ‌కాశం ఉంది. సంక్షేమం విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పాజిటివ్ ఉంది. అయితే, అభివృద్ధి విష‌యంలో ఫుల్ నెగిటివ్ ప్ర‌చారం సాగింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఇటీవ‌ల వేగంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, ఉద్యోగుల రూపంలవ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. యువ‌త‌, ఉద్యోగుల ఓట్లు పూర్తిగా వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తేలింది. ఐ ప్యాక్ స‌ర్వేల్లోనూ అదే తేలింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Jagan cinema : వెండితెర‌పై జగ‌న్‌ తాండ‌వం, `ఫైబ‌ర్ నెట్ ` లో కొత్త సినిమాల‌ రిలీజ్‌

ఉద్యోగుల‌ను సానుకూలంగా మ‌లుచుకునేందుకు బుధ‌వారం జ‌రిగిన క్యాబినెట్ ప‌లు వ‌రాల‌ను కురిపించింది. జిల్లాల్లోని ఉద్యోగుల‌కు 16శాతం హెచ్ ఆర్ ఏ ఇస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 12వ పీఆర్సీ, పెన్ష‌న్ ప‌థం అమ‌లు త‌దిత‌ర నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంతో ఉద్యోగుల మ‌నసు దోచుకున్నారు. ఇక ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డంతో పాటు, విద్య‌-వైద్య రంగాల్లోని ఖాళీను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. గ‌తంలో ఎప్పుడూలేని విధంగా 68 కీల‌క. నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ప‌రిపాల‌న వేగంగా ఉండేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందుకెళుతున్నారు. సెప్టెంబ‌ర్లో విశాఖ నుంచి పరిపాల‌న సాగించ‌డానికి అనువుగా ఉద్యోగుల‌ను సానుకూలంగా మ‌ల‌చుకుంటూ క్యాబినెట్ కీల‌క తీర్మానం చేసింది.

క‌నీసం ఐదుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతార‌ని (Jagan Cabinet 3.0)

మ‌రో 9 నెల‌ల త‌రువాత మాత్ర‌మే ఎన్నిక‌లు ఉండ‌డంతో క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న దిశ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి( Jagan Cabinet 3.0) ఆలోచిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. ఇప్ప‌టికి రెండుసార్లు మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేసిన జ‌గ‌న్ ముచ్చ‌ట‌గా మూడోసారి క్యాబినెట్ మార్పులు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల టీమ్ ను సిద్ధం చేసుకోవ‌డానికి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్యాబినెట్లోని క‌నీసం ఐదుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతార‌ని తెలుస్తోంది. రాయ‌ల‌సీమ‌లోని ఇద్దరు మ‌హిళా మంత్రులు, అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత స‌మీపంలోని జిల్లాల్లో ఒక‌రు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఒక‌రు, ఉత్తరాంధ్ర‌కు చెందిన ఒక మంత్రికి ఉద్వాస‌న ఖ‌యమ‌ని చాలా కాలంగా వినిపిస్తోంది. సెప్టెంబ‌ర్లో విశాఖ నుంచి ప‌రిపాల‌న కొత్త మంత్రివ‌ర్గంతోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గం మార్పులు ఉంటాయ‌ని ప్ర‌చారం బ‌య‌లుదేరింది. ఒక వేళ ముంద‌స్తు ఉంటే ఆ ప్ర‌స్తావ‌న ఉండేది కాద‌ని, ఇప్పుడు ముందుస్తు లేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేయ‌డంతో ఇక క్యాబినెట్ మార్పు మీద ఊహాగానాల‌కు తెర‌లేచింది.

Also Read : Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు