Jagan Bus Yatra Schedule : జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు

ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 21 జిల్లాల గుండా యాత్ర నెలరోజులపాటు నిరవధికంగా కొనసాగనున్నది

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 02:14 PM IST

ఇప్పటివరకు సిద్ధం (Siddam) అంటూ భారీ సభల ద్వారా దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత జగన్ (Jagan)..ఇప్పుడు ‘మేమంతా సిద్ధం’(Mimantha Siddam) అంటూ బస్సు యాత్ర తో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 13 న పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఆ తరుణంలో అన్ని పార్టీల నేతలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం (Jagan Bus Yatra ) కానుంది. 21 జిల్లాల గుండా యాత్ర నెలరోజులపాటు నిరవధికంగా కొనసాగనున్నది. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా కొనసాగే తొలిరోజు యాత్రలో భాగంగా ప్రొద్దటూరులో తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆపై 28వ తేదీన కర్నూలు, 29వ తేదీన హిందూపురం లోక్ సభ నియోజకవర్గాల గుండా యాత్ర కొనసాగుతుంది. 29వ తేదీన హిందూపురం లోక్ సభ నియోజకవర్గాల గుండా యాత్ర కొనసాగనుంది. ఇప్పటివరకు చేసిన సంక్షేమం, ఇకపై ప్రజలకు అందించబోయే పాలనకు సంబంధించి నేరుగా వైఎస్ జగన్ ప్రజలకు వివరించనున్నారు.

ఈసారి ప్రచారం పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ఉంటుందని పార్టీ తెలిపింది. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఉంటుంది. నియోజకవర్గంలో బస్సు యాత్ర సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఒక బహిరంగ సభ ఉంటుంది. అలాగే ఒక ఇంటరాక్షన్ కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ బహిరంగ సభలో లోక్ సభ అభ్యర్థి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నేతలు పాల్గొంటారు.

ఈ బస్సుయాత్రలో ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమం గురించి వివరించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యచరణ, ఈసారి విజయం సాధించాక చేయబోయే కార్యక్రమాల గురించి స్వయంగా జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఈసారి వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.

Read Also : 550 Jobs : రైల్వేలో 550 జాబ్స్.. టెన్త్ పాసై, ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు