వైసీపీ అధినేత జగన్ (Jagan) ..వరుసగా సొంత నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టికెట్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి టికెట్స్ ఇస్తూ వస్తున్న జగన్..బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivasa Reddy)కి షాక్ ఇచ్చారు. ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ను.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే కేటాయించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ముందు నుండి మాగుంట విషయంలో ఏ మాత్రం ఆసక్తికరంగా లేరు. ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ టిక్కెట్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అలా కాకపోతే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి అయినా చాన్సివ్వాలని కోరినప్పటికీ జగన్ ఇవ్వలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఫైనల్ గా తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే చెవిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు బాలినేని సిద్ధంగా లేరు. ఈ అంశంపై మాట్లాడేందుకు సోమవారం బాలినేని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. కానీ కారు దిగకుండానే వెనక్కి వెళ్లిపోయారు. చెవిరెడ్డికే ఎంపీ టిక్కెట్ ఖరారు చేసినట్లగా తెలియడంతో.. మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
తాజాగా మరోసారి సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ వచ్చింది. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్‌గా.. చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి సమాచారం ఇచ్చారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీ పెద్దలపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం ఉన్నారని తెలుస్తోంది.
Read Also : Samajwadi Party: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ..!