Jagan BC Card : YCP సంస్థాగ‌త ప్ర‌క్షాళన‌! TTD చైర్మ‌న్ గా `జంగా`?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీలో  (Jagan BC Card)భారీ మార్పులు చేయ‌బోతున్నారు.జంగాకృష్ణమూర్తికి కీల‌క ప‌ద‌విని అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - July 19, 2023 / 05:08 PM IST

ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీలో  (Jagan BC Card)భారీ మార్పులు చేయ‌బోతున్నారు. ఆ క్ర‌మంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన జంగాకృష్ణమూర్తికి కీల‌క ప‌ద‌విని అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు స‌మాయాత్తం కావ‌డానికి మిథున్ రెడ్డిని ఉభ‌య గోదావ‌రి జిల్లాల పూర్తి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల‌ను వైవీ సుబ్బారెడ్డి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం టీడీపీబోర్డు స‌భ్యునిగా ఉంటూ రాజ‌కీయాల‌పై పూర్తి స్థాయిలో టైమ్ కేటాయించ‌లేక‌పోతున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీలో  భారీ మార్పులు(Jagan BC Card)

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో వైసీపీ వెనుక‌బ‌డి ఉంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, ఇక నుంచి పూర్తి స్థాయిలో అక్క‌డే ఉంటూ వైవీ సుబ్బారెడ్డి వ్యూహాల‌ను ర‌చించ‌నున్నారు. వ‌చ్చే నెల 21వ తేదీ నాటికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికాలం ముగిస్తుంది. ఆయ‌న స్థానంలో గుర‌జాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణ‌మూర్తిని  (Jagan BC Card) నియ‌మిస్తార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నార‌ని సమాచారం. ఇక ప్రస్తుతం తాడేప‌ల్లి కేంద్రంగా పార్టీ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల‌ను విజ‌య‌సాయిరెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా అప్ప‌గించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

నెల్లూరు, ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీ గ్రూపుల బెడ‌ద

నెల్లూరు, ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీ గ్రూపుల బెడ‌ద ఎక్కువ‌గా ఉంది. పైగా ఇటీవ‌ల నెల్లూరు జిల్లా నుంచి ఆనం, కోటంరెడ్డి, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పార్టీని వీడారు. వాళ్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఫ‌లితంగా జ‌రిగిన న‌ష్టాన్ని పూరించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఆ జిల్లా నుంచి వైసీపీలో ప్ర‌స్తుతం కీల‌కంగా ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్ కూడా పార్టీని వీడ‌బోతున్నార‌ని టాక్‌. ఇక ప్ర‌కాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అధిష్టానంపై రివ‌ర్స్ అయ్యారు. ఆయ‌న తిరుగుబాటు చేయ‌డంతో ప్ర‌కాశం జిల్లా వైసీపీలో ఒక్క‌సారి అల‌జ‌డి మొద‌ల‌యింది. అందుకే, ఆ రెండు జిల్లాల‌ను సెట్ చేసే బాధ్య‌త‌ను ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి అప్ప‌గించారు.

బీసీ వ‌ర్గానికి చెందిన జంగాకు కీల‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్

కీల‌క ప‌ద‌వులు, స‌ల‌హాదారులుగా `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్లు వంద‌లాది మంది ఉన్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌మానాలో బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు కనిపిస్తున్న‌ప్ప‌టికీ చిన్నాచిత‌క ప‌ద‌వుల‌ను ఇచ్చారు. కార్పొరేష‌న్ల‌ను క్రియేట్ చేసి ఉత్స‌వ విగ్ర‌హాల మాదిరిగా బీసీ లీడ‌ర్ల‌ను ఉంచారు. ఇలాంటి ఆరోప‌ణ‌లను ప్ర‌త్య‌ర్థులు త‌ర‌చూ చేస్తూ కీల‌క ప‌ద‌వుల్లోని `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం నాయ‌కుల జాబితాను సోషల్ మీడియా వేదిక‌గా వైరల్ చేశారు. అంతేకాదు, సీఎం, డీజీపీ, చీఫ్ సెక్ర‌ట‌రీలు ఒకే జిల్లాకు చెందిన వాళ్లు. ఇవ‌న్నీ వైసీపీకి మైన‌స్ పాయింట్లుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అందుకే, వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సంస్థాగ‌త ప్ర‌క్షాళ‌న చేస్తూ బీసీ వ‌ర్గానికి చెందిన  (Jagan BC Card) జంగాకు కీల‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

Also Read : Reverse Politics : యువ‌గ‌ళంపై YCP కోవ‌ర్ట్ యాంగిల్

గ‌త టీడీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌డ‌ప జిల్లాకు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు ఇచ్చారు. ఇప్పుడు అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన జంగాకు వైసీపీ అదే ప‌ద‌విని ఇవ్వ‌బోతుంది. తిరుమ‌ల తిరుపతి బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి కోసం చెవిరెడ్డి, కరుణాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు పోటీ ప‌డుతున్నారు. తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చెవిరెడ్డి కొనసాగుతున్నారు. చెవిరెడ్డికి అన్నమయ్య, తిరుపతి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతో చెవిరెడ్డికి ఎన్నికల వేళ టీటీడీ ఇవ్వడం కుద‌ర‌ద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. ఆ క్ర‌మంలో జంగాకు దాదాపుగా టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖాయ‌మ‌ని వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న క్ర‌మంలో ఈ మార్పులు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.

Also Read : AP North : అమ్మో YCP, ఉత్త‌రాంధ్ర ఉలికిపాటు!