Jagan Bail anniversary : న్యాయ‌దేవ‌త‌కు గంత‌లు! జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ కు ప‌దేళ్లు..!!

Jagan Bail anniversary : ప్ర‌పంచంలోని ఏ దేశానికి లేని ప్ర‌జాస్వామ్యం, చ‌ట్టాలు ఉన్నాయ‌ని భార‌తీయులు గ‌ర్వంగా చెప్పుకుంటారు.

  • Written By:
  • Updated On - September 23, 2023 / 01:16 PM IST

Jagan Bail anniversary : ప్ర‌పంచంలోని ఏ దేశానికి లేని ప్ర‌జాస్వామ్యం, చ‌ట్టాలు ఉన్నాయ‌ని భార‌తీయులు గ‌ర్వంగా చెప్పుకుంటారు. వంద మంది దోషులు త‌ప్పించుకున్నా, ఏ ఒక్క నిర్దోషికి శిక్ష ప‌డ‌కూడ‌ద‌న్న భావ‌నతో త‌యారు చేసిన న్యాయ వ్య‌వ‌స్థ మ‌న‌ది. అదే స‌మ‌యంలో న్యాయ‌దేవ‌త క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టే చిహ్నం న్యాయ‌స్థానాల్లో ఉంటుంది. అది ఎందుకు పెట్టారోగానీ, ప‌దేళ్ల పాటు బెయిల్ మీద య‌ధేచ్చ‌గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసుల‌ను గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతోంది.

అమెరికా దేశంలోని కొన్ని యూనివ‌ర్సిటీల్లో పాఠ్యాంశంగా..(Jagan Bail anniversary)

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఉన్న కేసుల గురించి అమెరికా దేశంలోని కొన్ని యూనివ‌ర్సిటీల్లో పాఠ్యాంశంగా చేర్చారట‌. వాటి మీద అధ్య‌య‌నం చేసే స్థాయికి ఆయ‌న కేసుల వ్య‌వ‌హారం వెళ్లింది. బ‌హుశా దేశ చ‌రిత్ర‌లో 10ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్న నిందితుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న్యాయ వ్య‌వ‌స్థ‌కే ఒక రికార్ట్ గా చెప్పుకుంటారు. సుమారు 16 నెల‌లు జైలు అనుభవించిన ఆయ‌న బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చి శనివారం నాటికి నిండు ప‌దేళ్లు)Jagan Bail anniversary). సామాన్యులు ఇలా బెయిల్ పొంద‌డం సాధ్యమా? అనే సందేహానికి న్యాయ‌వ్య‌వ‌స్థ స‌మాధానం చెప్పాలి.

ఖైదీ నెంబ‌ర్ 6093 నెంబ‌ర్ తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

జైలు జీవితాన్ని ఖైదీ నెంబ‌ర్ 6093 నెంబ‌ర్ తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 16 నెల‌లు గ‌డిపారు. ఆ నెంబ‌ర్ ను గుగూల్ లో కొడితే, ఆయ‌న మీద ఉన్న కేసుల జాబితా వ‌చ్చేస్తుంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరును గుగూల్ లో కొట్టినా వ‌చ్చేది ఆయ‌న కేసుల వివ‌రాలు, ఆయ‌న ఆర్థిక అక్ర‌మాల నేప‌థ్యం. అలాంటి ఆయ‌న ప‌దేళ్ల పాటు బెయిల్ మీద ఉన్నారంటే న్యాయ‌వ్య‌వ‌స్థ‌లోని డొల్ల‌త‌నాన్ని చూపుతోంది. సుమారు 42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేశార‌ని ఆయ‌న మీద ఉన్న ఆరోప‌ణ‌. ప‌న్నెండేళ్లుగా ఆయ‌న మీద‌ సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ఉన్నారు. ఆ కేసుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేలా ప‌దేళ్లుగా బెయిలుపై (Jagan Bail anniversary)ఉన్న ఆర్థిక నిందితుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ప్ర‌స్తుతం ఏపీ సీఎం హోదాలో ఉండ‌డం కార‌ణంగా వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి కూడా కోర్టులు మిన‌హాయింపును ఇవ్వ‌డం న్యాయ‌వ్య‌వ‌స్థ‌లోని హైలెట్ పాయింట్ గా నిలుస్తోంది.

Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

ప‌దేళ్ల నుంచి బెయిల్ మీద ఉంటోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి టీడీపీ శుభాకాంక్ష‌లు చెబుతూ గాంధీయ‌మార్గంలో నిర‌స‌న తెలియ‌చేస్తోంది. ట్వీట్ట‌ర్ వేదిక‌గా లోకేష్ ట్వీట్ చేస్తూ ` జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని..` ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పై టీడీపీ యువ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇదంతా రాజ‌కీయంగా జ‌రుగుతోన్న త‌తంగం అనుకున్నా, ప‌దేళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న నిందితుడును భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ ఏమీ చేయ‌లేక‌పోతుందా? చ‌ట్టంలోని లొసుగులు ఆ విధంగా ఉన్నాయా? అనే ప్ర‌శ్న‌లు ఎన్నో ప్ర‌స్తుత త‌రానికి రావ‌డం స‌హ‌జం.

Also Read : One Nation One Election : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ కమిటీ తొలి భేటీ ఇవాళే.. సర్వత్రా ఉత్కంఠ