ఏపీ జగన్ (Jagan)..హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బేగం పేట్ కు చేరుకున్న జగన్..నేరుగా నందినగర్ లో ఉన్న కేసీఆర్ (KCR) నివాసానికి చేరుకొని కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీశారు. దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ తో జగన్ సమావేశమయ్యారు. అలాగే అక్కడే భోజనం చేసిన జగన్..ఇప్పుడు బంజాహిల్స్ లోని లోటస్ పాండ్ (Lotus Pond) ఇంటికి చేరుకున్నారు. కాసేపు లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఉన్న అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తాడేపల్లిలోని తన నివాసంలోనే ఎక్కువ ఉంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ (Hyderabad) కు వచ్చినా లోటస్ పాండ్ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ఈరోజు జగన్ లోటస్ పాండ్‌కు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఢిల్లీకి వెళ్లిన సమయంలో వైఎస్ జగన్ లోటస్ పాండ్ కు చేరుకోవడం విశేషం. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మ ను జగన్ ను కలసి షర్మిల రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ తరుపున నాయకత్వ బాధ్యతలను స్వీకరించనున్న నేపథ్యంలో తన తల్లి విజయమ్మతో ఆ విషయం చర్చించనున్నారని తెలుస్తుంది.
Read Also : Peddireddy : షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్