Jagan : వైసీపీలో గ‌వ‌ర్నింగ్‌ హైరానా! కొత్త గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ కు స్వాగ‌త స‌త్కారం!

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ అహ్మ‌ద్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి వ‌చ్చే రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) టీమ్ అప్ర‌మ‌త్తం అయింది.

  • Written By:
  • Updated On - February 22, 2023 / 02:35 PM IST

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ అహ్మ‌ద్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి వ‌చ్చే రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) టీమ్ అప్ర‌మ‌త్తం అయింది. ఎన్నికల వేళ కేంద్రం తీసుకున్న గ‌వ‌ర్న‌ర్ (Governor)మార్పు నిర్ణ‌యం వెనుక ఏదో ఉంటుంది? అనే సందేహం వెన్నాడుతోంది. దానికి త‌గిన విధంగా న‌జీర్ అపాయిట్మెంట్ లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న నియామ‌కం వెల్ల‌డి అయిన వెంట‌నే చాలా మంది అపాయిట్మెంట్ కోరారు. కానీ, ఢిల్లీ ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ కు మాత్ర‌మే తొలి అపాయిట్మెంట్ ఇచ్చారు. ఆ త‌రువాత వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణమ‌రాజు క‌లిసేందుకు అవ‌కాశం ల‌భించింది. ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌ఖ్య‌త‌లోపించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి కూడా గ‌వ‌ర్న‌ర్ అపాయిట్మెంట్ దొరికింది. మిగిలిన వాళ్ల‌కు ఆయ‌న అపాయిట్మెంట్ లు ఇవ్వ‌లేదు.

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ అహ్మ‌ద్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి వ‌చ్చే రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)

ఏపీ గ‌వ‌ర్న‌ర్ గా న‌జీర్ బుధ‌వారం ప్ర‌మాణం చేయ‌నున్నారు. అందుకు భారీ ఏర్పాట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం చేసింది. సీఎంగా. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత హ‌రిచంద‌న్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. ఆయ‌న తో క‌లివిడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. అందుకే, విడ్కోలు కార్యక్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. చ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ గా హ‌రిచంద‌న్ బ‌దిలీపై ఏపీ నుంచి రిలీవ్ అయ్యారు. ఆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు స‌భ‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను పొగ‌డ్త‌ల‌తో హ‌రిచంద‌న్ ముంచెత్తారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న ప‌ర‌మైన ఆలోచ‌న‌ల‌ను ఆకాశానికి ఎత్తేశారు. వీడ్కోలు స‌భ సాక్షిగా ఆయ‌న ఇచ్చిన స్పీచ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియచేసింది.

Also Read : Jagan Assets: సుప్రీంకు మళ్లీ శ్రీలక్ష్మి వ్యవహారం! జగన్ ఆస్తుల కేసు స్పీడ్

స్వ‌త‌హాగా రాజ‌కీయ‌నాయ‌కుడు హ‌రిచంద‌న్. రాజ‌కీయాల‌ను స్వ‌యంగా అనుభ‌వించిన సీనియ‌ర్ లీడ‌ర్. అందుకే, ప్ర‌భుత్వంతో క‌లివిడిగా న‌డుస్తూ బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల‌ను కూడా మెప్పించారు. అయిన‌ప్ప‌టికీ ఏపీలో ఏదో కావాల‌ని బీజేపీ కోరుకుంటోంది. దానికి హ‌రిచంద‌న్ స‌రిపోడ‌ని భావించింద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, ఆయ‌న స్థానంలో న‌జీర్ ను నియ‌మించిందని తెలుస్తోంది. స్వ‌త‌హాగా న్యాయ‌వాది, న్యాయ‌మూర్తి న‌జీర్. చ‌ట్టాలు, రాజ్యాంగం త‌దిత‌రాల మీద ప‌ట్టు ఉంది. అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌ను తీసుకునే అవ‌కాశంగానీ, రాజ్యాంగ ధిక్కార ఎపిసోడ్ ల‌నుగానీ వెనుకేసుకొచ్చే మ‌న‌స్త‌త్వం న‌జీర్ కు ఉండ‌ద‌ని ప‌లువురు భావిస్తున్నారు. తొలిసారిగా గ‌వ‌ర్న‌ర్(Governor) బాధ్య‌త‌ల‌ను న‌జీర్ స్వీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు ఆయ‌న సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్నారు. అయోధ్య‌, ఆర్టిక‌ల్ 370 వంటి కీల‌క అంశాల‌పై సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తి న‌జీర్. ఆ తీర్పుల‌ను బీజేపీ వ్య‌తిరేకులు విమ‌ర్శించారు. వాళ్లే ఇప్పుడు న‌జీర్ కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మూడు రాజ‌ధానులు అంశం ఇప్పుడు హాట్ టాపిక్

రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. అంతేకాదు, అమ‌రావ‌తి రాజ‌ధాని గా ఉండాల‌ని సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో న్యాయమూర్తిగా ప‌నిచేసిన న‌జీర్ ను ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా కేంద్రం నియ‌మించ‌డం వెనుక ఏదో ఊహించ‌ని వ్యూహం ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు ఉంద‌ని న‌మ్మేవాళ్లు అనేకులు. విద్యా వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా మార్పు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తూ కేంద్రం అనుస‌రిస్తోన్న నూత‌న విద్యావిధానాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ప‌క్క‌న పెట్టేశారు. యూనివ‌ర్సిటీ వీసీల‌ను ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వాళ్ల‌కు క‌ట్ట‌బెట్టారు. ఇవ‌న్నీ గ‌వ‌ర్న‌ర్ ప‌రిధిలోని అంశాలుగా ఉన్నాయి. వాటి మీద స‌మ‌గ్ర నివేదిక‌ను ఇప్ప‌టికే కేంద్రం కోరింది. గ‌వ‌ర్న‌ర్ గా న‌జీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆ నివేదిక‌ను పరిశీలిస్తార‌ని తెలుస్తోంది.

ప్ర‌భుత్వానికి, న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య గ్యాప్( Governor)

జాతీయ విద్యా విధానానికి భిన్నంగా తెలుగు భాష లేకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) చేశారు. దానిపై న‌జీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. ఆయ‌న ప్ర‌తి శుక్రవారం కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ సీఎం హోదాను, ప్రోటోకాల్ ఖ‌ర్చులు త‌దిత‌రాల‌ను చూపుతూ బెయిల్ పొందిన ఆయ‌న ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. ప్ర‌భుత్వానికి, న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య గ్యాప్ కూడా ఉంది. న్యాయ‌మూర్తుల‌పై వైసీపీ చేసిన సోష‌ల్ వార్ మీద సీబీఐ విచార‌ణ సాగుతోంది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేద‌ని గ‌తంలో హైకోర్టు న్యాయ‌మూర్తి రాకేష్ ఇచ్చిన నివేదిక సుప్రీం వ‌ద్ద ఉంది. అప్ర‌క‌టిత ఎమర్జెన్సీ వాతావ‌ర‌ణంలో ఉన్న ఏపీని కాపాడేందుకు న‌జీర్ కొత్త గ‌వ‌ర్న‌ర్ గా(Governor) వ‌స్తున్నార‌ని వైసీపీ వ్య‌తిరేకులు చేసే ప్ర‌చారం. మాజీ గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ మాదిరిగా న‌జీర్ కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌హ‌కారం అందిస్తార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. భ‌విష్య‌త్ లో న‌జీర్ రూపంలో ఏపి ఏమి కానుంది? అనేది చూడాలి.

Also Read : KCR and Jagan: ఎన్నికల వేళ మళ్లీ అన్నదమ్ముల నీళ్ళ పంచాయితీ