Site icon HashtagU Telugu

Bhimavaram : భీమవరం వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్..

Grandhi Real Hero

Grandhi Real Hero

భీమవరం వైసీపీ అభ్యర్థిగా (Bhimavaram YCP Candidate) మరోసారి గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) కే ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్ (CM Jagan). గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించిన..గ్రంధి శ్రీనివాస్..ఈసారి కూడా భీమవరం నుండే బరిలోకి దిగబోతున్నట్లు ఈరోజు భీమవరంలో జరిగిన కార్యక్రమంలో జగన్ ప్రకటించారు. ఈ సందర్భాంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జగన్ ప్రశంసలు కురిపించారు. సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో శీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గ్రంధి శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. భీమవరం అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై సంచలన కామెంట్స్ చేసారు జగన్. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని.. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని, నాలుగేళ్లకొకసారి భార్యలను మార్చాడని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడడు కానీ, చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలి దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని అన్నారు. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుందా? నలుగురు వంచకులు కలిస్తే జనానికి మంచిస్తారా అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. ఇలాంటి వారిని ఇన్పిపిరేషన్ గా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ..దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని.. ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎక్కడా చూడలేదని.. ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.

అలాగే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ..భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కెసిఆర్ జిల్లాలు విడతీసి పరిపాలన చేశారని కొనియాడారు. కానీ చంద్రబాబుకు కనీసం ఎలాంటి ఆలోచనా లేకుండా అమరావతి పేరుతో గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. జగనన్న కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడు ఋణపడి ఉంటుందన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడి పై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తి పై గెలిచినట్టు ఉంది..పార్టీ పెట్టినప్పుడు చేగువేరా, తో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్ర బాబు ఫోటో పెట్టుకున్నారని చురకలు అంటించారు.

Read Also : #OG : పవన్ ఫాన్స్ కు ఇంతకన్నా బ్యాడ్ న్యూస్ మరోటి ఉండదు