Jagan and KCR : మ‌ళ్లీ సీఎం పీఠంకోసం..స్వ‌రూపానందకు జ‌నం సొమ్ము.!

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ల‌ను (Jagan and KCR)వేర్వేరుగా చూడ‌లేం.విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానంద,చిన్ని జియ్య‌ర్ స్వాముల‌ ప‌ర‌మ‌భ‌క్తులు

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 01:12 PM IST

ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ల‌ను (Jagan and KCR) రాజ‌కీయంగా వేర్వేరుగా చూడ‌లేం. వాళ్లిద్ద‌రూ విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానంద,(Swaroopananda) చిన్ని జియ్య‌ర్ స్వాముల‌ ప‌ర‌మ‌భ‌క్తులు. ఆశ్ర‌మాల‌ను ఏర్పాటు చేయ‌డానికి హైద‌రాబాద్ లో విలువైన భూముల‌ను రెండోసారి సీఎం అయిన వెంట‌నే కేసీఆర్ కేటాయించారు. అంతేకాదు, ప్ర‌త్యేకంగా స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. పూలాభిషేకం ఇద్ద‌రు స్వాముల‌కు ఒకే వేదిక మీద చేసి స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. ఇక సీఎం అయిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని స్వ‌రూపానందంద్రే స్వామి ముద్దాడారు. త‌న ఆత్మ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని పోల్చుకున్నారు. ప్ర‌తిఫ‌లంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా విలువైన భూముల‌ను విశాఖ‌ప‌ట్నంలో ఆశ్ర‌మానికి ఇచ్చేశారు. ఇద్ద‌రు సీఎం లు ఇచ్చిన భూములు ప్ర‌జా సంప‌ద‌. కానీ, కోట్ల విలువ‌లో ఉన్న భూముల‌ను కేవ‌లం ల‌క్ష‌ల‌కు ధార‌ళంగా దానం ఇచ్చేశారు.

మ‌ళ్లీ సీఎం పీఠంకోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ (Jagan and KCR)

తాజాగా రాజ‌శ్యామ‌ల ఆల‌య నిర్మాణానికి (Jagan and KCR) తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు ఎక‌రాల భూమిని కోకాపేట వ‌ద్ద కేటాయించారు. అక్క‌డ రాజ‌శ్యామ‌ల ఆల‌యం పూజ‌లు జ‌రిపితే మూడోసారి సీఎం పీఠం ఎక్కొచ్చ‌ని కేసీఆర్ న‌మ్మ‌కం. అందుకోసం కోట్ల విలువైన ప్ర‌జ‌ల సొమ్మును స్వ‌రూపానందస్వామికి. (Swaroopananda) రాసిచ్చారు. ఇక ఆ రెండు ఎక‌రాల భూమిలో దేవాల‌యాన్ని నిర్మించ‌డానికి అన్నీ కేసీఆర్ (KCR) స‌మ‌కూర్చుతారు. మిగిలిన కార్య‌క్ర‌మాల‌ను స్వ‌రూపానంద స్వామి చూసుకుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి రాజ‌శ్యామ‌ల ఆల‌యం రూపుదిద్దుకునేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. పెద్ద ఎత్తున రాజ‌శ్యామ‌ల యాగాల‌ను(Rajasyamala yagam) నిర్వ‌హించ‌డం ద్వారా రాబోవు రోజుల్లో ప్ర‌ధాని కావాల‌ని కేసీఆర్ ఆకాంక్ష‌. అందుకోసం ముందుగా మూడోసారి సీఎం కావాల‌ని రాజ‌శ్యామ‌ల యాగాల‌ను నమ్ముకున్నారు. గ‌తంలోనూ ఇలాంటి యాగాలు, రుద్ర హోమాలు చేసిన చ‌రిత్ర కేసీఆర్ కు బాగా ఉంది.

10కోట్ల‌తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోసం రాజ‌శ్యామ‌ల యాగాన్ని 

రెండోసారి సీఎం కావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan and KCR) కోసం రాజ‌శ్యామ‌ల యాగాన్ని ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. దానిపై విప‌క్ష‌లు ఎన్ని ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం ప‌ట్టించుకోవ‌డంలేదు. ప్ర‌జ‌ల సొమ్ము రూ. 10కోట్ల‌తో ఈ యాగాన్ని నిర్వ‌హించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి రాజ‌శ్యామ‌ల యాగం ప్రారంభం కానుంది. విజయవాడలో చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  యాగం (Jagan and KCR)

సాధార‌ణంగా వ్య‌క్తిగ‌త న‌మ్మ‌కాల‌కు సొంత సొమ్మును ఖ‌ర్చు చేస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (Jagan and KCR) కూడా యాగాలు, హోమాల‌కు సొంత ఖ‌ర్చుల‌తో చేయ‌డాన్ని గ‌మ‌నిస్తున్నారం. ఆయ‌న వ్య‌క్తిగ‌త న‌మ్మ‌కం కావును పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం వ్యక్తిగ‌త విశ్వాసాల‌కు కూడా ప్ర‌జా సొమ్మును ఖ‌ర్చు పెట్ట‌డం బ‌హుశా రాజ‌కీయ చ‌రిత్ర‌లో కొత్త పంథాగా నిలుస్తోంది. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న హేతువాద సంఘం నాయ‌కులు మీడియా ముందుకొచ్చారు. రెండోసారి సీఎం పీఠం కోసం ఈ యాగాల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. అధికారికంగా, ప్రభుత్వ స్థలాల్లో ప్ర‌జా సొమ్ముతో నిర్వహించడం సరికాదరని విమ‌ర్శించారు.

రెండు ఎక‌రాల భూమిలో రాజ‌శ్యామ‌ల  దేవాల‌యాన్ని

రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామ‌ని సీఎంలు(Jagan and KCR) ముఖ్యమంత్రి ప‌దవిని చేప‌ట్టే సంద‌ర్భంగా ప్ర‌మాణం చేస్తారు. అలాగే, ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రైనా రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌మాణం చేయ‌డాన్ని చూశాం, విన్నాం. కానీ, రాజ్యాంగాన్ని ప‌క్క‌న‌పెట్టేసి మతపరమైన క్రతువును ప్ర‌భుత్వ సొమ్ముతో నిర్వహించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడం అవుతోంది. పైగా ఈ యాగంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పాల్గొనేలా చేయ‌డం రాజ్యాంగ వ్య‌తిరేమ‌ని హేతువాద సంఘం వాదిస్తోంది. ఆ సంఘం స‌భ్యులు మోతుకూరి అరుణ్ కుమార్ మీడియా ముందు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) వాల‌కాన్ని దుయ్య‌బ‌ట్టారు.

Also Read : Jagan సర్కార్‌కి గడువు! చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు!

ఎన్నిక‌ల వేళ ఇద్ద‌రు తెలుగు సీఎంలు(Jagan and KCR)  పోటీప‌డి రాజ‌శ్యామ‌ల యాగాల‌ను న‌మ్ముకున్నారు. స‌హ‌జంగా పైన దేవుడు, ప్ర‌జల్ని న‌మ్ముకున్నాన‌ని ప‌దేప‌దే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతుంటారు. ఇప్పుడు ప్ర‌జ‌ల్ని వ‌దిలేసి, వాళ్ల సొమ్మును స్వ‌రూనంద‌స్వామికి ఇస్తూ భ‌క్తిని చాటుకుంటున్నారు. ఇదంతా బీజేపీ ఓటు బ్యాంకును సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి కేసీఆర్ (KCR) చేస్తుంటే, క్రిస్టియ‌న్ మ‌చ్చ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan)  అధికారికంగా యాగాల‌ను మొద‌లు పెట్టార‌ని విప‌క్షాల అభిప్రాయం.

Also Read : CM KCR: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్..!

ప‌లుమార్లు ఈ యాగాలు, హోమాల‌తో కేసీఆర్ (KCR) లాభ‌ప‌డ్డార‌ని తెలంగాణలోని ,చాలా మంది ప్ర‌జ‌ల్లో ఉంది. తొలిసారి సీఎం అయిన త‌రువాత విప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డానికి ఆయ‌న ఇలాంటి యాగాలు, హోమాల‌ను ప్ర‌యోగించార‌ని ప‌లువురు విమ‌ర్శిస్తుంటారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) కూడా 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి కేసీఆర్ సూచ‌న మేర‌కు రాజ‌శ్వామ‌ల‌(Rajasyamala), యాగాలు, హోమాలు చేశార‌ని వైసీపీ నాయ‌కుల‌కు తెలుసు. సీఎంగా అధికారం చేప‌ట్టిన త‌రువాత ఆహూతి కార్య‌క్ర‌మానికి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) హాజ‌ర‌య్యారు. ఈసారి కూడా ఇద్ద‌రు సీఎంలు(Jagan and KCR) మ‌ళ్లీ సీఎం పీఠం కోసం రాజ‌శ్వామ‌ల యాగాలు, హోమాల‌ను న‌మ్ముకుని విశాఖ పీఠం అధిప‌తి స్వ‌రూపానంద‌కు జనం సొమ్ము ధారాద‌త్తం చేయ‌డాన్ని విప‌క్షాల‌తో పాటు ప‌లువురి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.