Jagan : అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారు – జగన్

చిన్నాన వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసనీ... వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?.. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా?.. ఎవరు ఫోన్‌ చేస్తే అవినాష్‌ అక్కడికి వెళ్లారో తెలియదా అని జగన్ ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Jagan Avinashreddy

Jagan Avinashreddy

ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి (MP candidate Avinash Reddy) జీవితం నాశనం చేయాలని చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారంటూ పరోక్షంగా వైస్ షర్మిల (Ys Sharmila) , సునీతల (Sunitha) ఫై సీఎం జగన్ (CM Jagan) నిప్పులు చెరిగారు. ఈరోజు కడపలో నామినేషన్ సందర్బంగా సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఏర్పటు చేసిన సభలో మాట్లాడుతూ..చిన్నాన వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసనీ… వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?.. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా?.. ఎవరు ఫోన్‌ చేస్తే అవినాష్‌ అక్కడికి వెళ్లారో తెలియదా అని జగన్ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పు చేయలేదని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే అవినాష్ కు టికెట్‌ ఇచ్చానన్నారు. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని.. పసుపు మూకలతో చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారన్నారు. ఓ వైయస్‌ఆర్, ఓ జగన్‌ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చేస్తున్నారు. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైయస్‌ఆర్‌ వారసులం అని మీ ముందుకు వస్తున్నారు వారి కుట్రలో భాగంగా..ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు..? ప్రజలు కాదా.. ఆ వైయస్‌ఆర్‌ను ప్రేమించేవారు కదా అని ప్రశ్నించారు. వైస్ మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తరువాత ఆయనపై కేసులు పెట్టింది ఎవరు..? ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు..? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జ్‌షీట్‌లోనూ పెట్టింది ఎవరు..? వైయస్‌ఆర్‌ లెగసీని ఉండకుండా చేయాలని చూస్తుంది ఎవరు..? వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, లేకుండా చేయాలని కుట్రలు పన్నింది ఎవరు..? ఇవన్నీ పులివెందుల ప్రజలకు తెలుసు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సంగతులన్నీ తెలుసు అంటూ జగన్ చెప్పుకొచ్చారు.

బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన అనంత‌రం నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లారు జగన్. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

Read Also : Ranjith Reddy : బీజేపీకి ఓటేస్తే కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్టే.. చేవెళ్ల కాంగ్రెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి వ్యాఖ్యలు

  Last Updated: 25 Apr 2024, 03:39 PM IST