Site icon HashtagU Telugu

Jagan 3.0: ఉగాదికి జగన్ 3.0, ఎన్నికల మంత్రివర్గం ఇదే?

Jagan 3.0 For Ugadi, This Is The Election Cabinet..

Jagan 3.0 For Ugadi, This Is The Election Cabinet..

ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి 3.0 ఉగాదికి అవతరించనుంది. ఆ మేరకు తాడేపల్లి వర్గాల్లో సీరియస్ చర్చ జరుగుతుంది. అంతే కాదు, మంగళవారం జరిగిన మంత్రివర్గం భేటీలోను జగన్మోహన్ రెడ్డి 3.0 కూర్పు సంకేతం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఔట్? ఎవరు ఇన్? అనే చర్చ జోరుగా సాగుతోంది. మంత్రుల పనితీరు గమనిస్తున్న అంటూ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు జగన్. ప్రస్తుతం గవర్నర్ , ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మూడో సారి మంత్రివర్గం ప్రక్షాళన ఉంటుందని తెలుస్తుంది. ఇద్దరు మహిళా మంత్రులు, ముగ్గురు పురుషులు మంత్రి వర్గం నుంచి ఔట్ కానున్నారని వినికిడి. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి ఒవరాక్షన్ ఇటీవల పార్టీకి నష్టం చేకూరేలా నోరు పారేసుకోవటం పై తాడేపల్లి కోటరీ సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. ఇక అనంతపురం, గుంటూరు, గోదావరి , శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మంత్రులు కూడా ఔట్ లిస్టులో ఉన్నారని చర్చ జరుగుతుంది. ఈ సారి ఎన్నిక టీంను జగన్ సిద్ధం చేసుకుంటారని టాక్. కాపుల కంటే బలిజ, శెట్టి బలిజ, బీసీ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా జగన్ 3.0 ఉంటుందని పార్టీ వర్గాల్లో ని వినికిడి.

మూడో దఫా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని గమనిస్తే ఎవరిని కేబినెట్ నుంచి తప్పించాలి, ఎవర్నీ కొనసాగించాలో తేల్చడం సీఎం జగన్ కు చిక్కుముడిగా మారింది. ఈ చిక్కుముడిని ఎలా పరిష్కరిస్తారు, నేతలను ఎలా బుజ్జగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ అంశంపై సీనియర్ల అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త కేబినెట్ అంశంపై చర్చించుకున్నారట. మంత్రి వర్గ విస్తరణ నిజమేనని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఉగాదికి కొంత మంది నేతలు గుడ్ న్యూస్ వినబోతున్నారు.

ఎమ్మెల్సీ కానున్న కౌరు శ్రీనివాస్, పొన్నాడ సతీష్ లలో ఒకరికి ఏపీ కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్ అని వినిపిస్తోంది. ఇద్దరికి సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు. మరికొందరు పార్టీ లీడర్లు చర్చించుకుంటున్న ప్రకారం సీదిరి అప్పలరాజుపై వేటు వేసే అవకాశం ఉంది. ఇదివరకే ఏపీ కేబినెట్ లో రెండు దఫాలలో అవకాశం దక్కించుకున్న అప్పలరాజును ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేబినెట్ నుంచి తొలగించి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ను కొత్త కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణపై వేటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థి కౌరు శ్రీనివాస్ ను మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.

గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులును కేబినెట్ లోకి తీసుకుంటున్నారని పార్టీలో వినిపిస్తోంది. పొన్నాడ సతీష్, కౌరు శ్రీనివాస్ లలో ఒకరిని లేక ఇద్దర్నీ సైతం తన మూడో దఫా కేబినెట్ లోకి జగన్ తీసుకుంటారని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అయితే ప్రస్తుత కేబినెట్ లో ఎవరిపై వేటు పడునుందోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.దాడిశెట్టి రాజా స్థానంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును జగన్ మూడో దఫా కేబినెట్ లోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు గత ఏడాది గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులు కాగా, అదే ఎఫాది జులై 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చిలకలూరిపేటకు చెందిన మంత్రి విడదల రజిని బీసీ ఎమ్మెల్యే కాగా, ఆమెను కేబినెట్ నుంచి తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ మంత్రులను అలర్ట్ చేశారు. అంటే ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా కేబినెట్ లో ముగ్గురు లేదా నలుగురికి అవకాశం కల్పించనుండగా, అదే సమయంలో కొందరు నేతలపై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలను సైతం జగన్ కచ్చితంగా పాటిస్తారని తెలిసిందే. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న మర్రి రాజశేఖర్ తో పాటు గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులును కేబినెట్ లోకి తీసుకుంటున్నారని పార్టీలో వినిపిస్తోంది. అయితే ప్రస్తుత కేబినెట్ లో ఎవరిపై వేటు పడునుందోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read:  Gun Culture Ban: గన్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? భారత ఆయుధ చట్టం ఏం చెబుతోంది?

Exit mobile version