Jagan 2.0:AP ఓట‌రూ బ‌హుప‌రాక్ !`0`తో జిగేల్ రాజా!

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి అడ్డ‌గోలు వ్య‌వ‌హారానికి ఏపీ సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి (Jagan 2.0) తెర‌లేపార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 04:11 PM IST

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి అడ్డ‌గోలు వ్య‌వ‌హారానికి ఏపీ సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి (Jagan 2.0) తెర‌లేపార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. జీరో నెంబ‌ర్ ను క్రియేట్ చేసి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వేలాది మంది ఓట‌ర్ల‌ను చేర్చుతున్నారు. ఈ. ప్ర‌క్రియ వెనుక వ‌లంటీర్లు, గృహ‌సార‌థులు ఉన్నార‌ని టీడీపీ అనుమానిస్తోంది. బ‌హుశా ఏపీలో జ‌రిగిన ఓట‌ర్ల లిస్ట్ గోల్ మాల్ వ్య‌వ‌హారం భార‌త‌దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జ‌రిగి ఉండ‌దు. ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ చ‌ర్య‌లు అంతంత మాత్ర‌మే. ఒక బీజేపీ మ‌రో వైపు టీడీపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఓట‌ర్ల జాబితాలో గోల్ మాల్ జ‌రుగుతుంద‌ని తెలియ‌చేశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ చేస్తోన్న వ్య‌వ‌హారాల‌పై న్యాయ‌పోరాటానికి దిగారు.

అడ్డ‌గోలు వ్య‌వ‌హారానికి ఏపీ సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి (Jagan 2.0)

రాష్ట్ర వ్యాప్తంగా ఓట‌ర్ల జాబితా నుంచి పేర్ల తొల‌గింపుకు సింపుల్ ఫార్ములాను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan 2.0) బోధించార‌ట‌. కమ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను తొలుత తొల‌గించ‌డం ఆ ఫార్ములాలోని తొలి ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా క‌మ్మ ఓట‌ర్లు ఎక్కువ మంది వివిధ రాష్ట్రాల‌కు ఉద్యోగ నిమిత్తం వ‌ల‌స వెళ్లారు. వాళ్లంద‌రి పేర్ల‌ను తొల‌గించ‌డంతో పాటు భ‌విష్య‌త్ లోనూ ఓట్లుగా న‌మోదు చేసుకోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డుకోవ‌డం వ‌లంటీర్ల ప్ర‌ధాన విధిగా పెట్టార‌ని స‌మాచారం. ఇక టీడీపీ కోర్ ఓట‌ర్లను తొల‌గించ‌డం ఫార్ములాలోని రెండో ఆదేశం. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప‌ది నుంచి 15వేల‌కు త‌గ్గ‌కుండా తొల‌గింపులు ఉండాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన సంకేత‌మ‌ట‌. ఇక ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 10వేల దొంగ ఓట్ల‌కు త‌గ్గ‌కుండా క‌రుడుక‌ట్టిన వైసీపీ వాళ్ల పేర్ల‌ను జాబితాలో చేర్చ‌డం ఫార్ములాలోని మూడో ఆదేశామ‌ట‌.

వ‌లంటీర్ల వ‌ద్ద ఉన్న డేటా ఆధారంగా ఓట్ల తొల‌గింపులు

సాధార‌ణంగా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి మూడు ద‌శ‌ల‌ను దాటాలి. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా మేనిఫెస్టోను రూప‌క‌ల్ప‌న చేయ‌డం మొద‌టి ద‌శ‌. గెలిచే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డం రెండో ద‌శ‌గా చెబుతారు. ఇక మూడో ద‌శ ఓట‌ర్ల‌ను పోలింగ్ వ‌ద్ద‌కు తీసుకొచ్చి ఓటింగ్ సానుకూలంగా చేయించుకోవ‌డం. ఈ మూడు ద‌శ‌ల్లో ఎక్క‌డ విఫ‌లం చెందిన‌ప్ప‌టికీ ఓట‌మి త‌ప్ప‌దు. అందుకే, కీల‌క‌మైన ఓట్ల చేరిక‌లు, తొల‌గింపులపై వైసీపీ దృష్టి పెట్టింది. ప్ర‌తిగా విప‌క్షాలు ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్న‌ప్ప‌టికీ వ‌లంటీర్ల వ‌ద్ద ఉన్న డేటా ఆధారంగా ఓట్ల తొల‌గింపులు భారీగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, చంద్ర‌బాబు క్యాడ‌ర్ ను ఆదేశిస్తూ బూత్ ల వారీగా ఓట‌ర్ల జాబితాల‌ను ప‌రిశీలించాల‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. కానీ, వ‌లంటీర్ల వ‌ద్ద ఉన్న డేటా ఆధారంగా భారీగా ఓట‌ర్ల‌ను తొల‌గించిన‌ట్టు (Jagan 2.0)  తెలుస్తోంది. ఆ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద ఫిర్యాదు కూడా ఉంది.

Also Read : 94.50 Crore Voters: దేశంలో ఓటర్ల సంఖ్య 94.50కోట్లు: ఈసీ

ఈనెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే ను ఎన్నిక‌ల క‌మిష‌న్ చేస్తోంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఆగ‌స్ట్ 21వ తేదీ వ‌ర‌కు స‌ర్వే నిర్వహిస్తారు. సర్వేలో 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ ఓటుహక్కు క‌ల్పించ‌డం బూత్ స్థాయి అధికారుల ల‌క్ష్యం. ఎన్నిక‌లు జ‌రిగే 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వాళ్ల‌కు ఓటు హ‌క్కును క‌ల్పిస్తారు. దీనితో పాటు ఓటర్ల డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు ఉంటుంది. వందేళ్లు వయస్సు పై బడిన వారిని ప్రత్యేకంగా గుర్తిస్తారు.

జీరో డోర్ నంబర్‌తో  పెద్ద గోల్‌మాల్  (Jagan 2.0)

డోర్‌ నంబర్లు లేని, ఒకే డోర్‌ నంబరు పై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన, సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం త‌దిత‌రాల‌ను ఈ సర్వే ద్వారా చేస్తారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఆయా ప్రాంతాల జాబితాలో చేరుస్తారు. అలాగే, ఒక పోలింగ్ బూత్ లో 1500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ కు సిఫార్సు చేయడం, పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడం, తప్పొప్పులను సరిచేయ‌డం ఈ స‌ర్వేలోని ప్ర‌ధాన అంశాలు. అయితే, ఇక్క‌డే పెద్ద గోల్‌మాల్  (Jagan 2.0) చోటుచేసుకుంది.

Also Read : CBN P4 Vision : చంద్ర‌బాబు మాట‌వింటే.!అంద‌రూ కోటీశ్వ‌రులే.!!

విచిత్రంగా ఏపీలో జీరో డోర్ నంబర్‌తో నాలుగు లక్షల 16 వేల 64 ఇళ్లున్నాయ‌ని తెలుస్తోంది. జీరో నెంబ‌ర్ ఇళ్లల్లో ఓటర్లు భారీగా న‌మోదు కావ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన ట్రిక్ లోని ప్ర‌ధాన అంశం. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ జీరో డోర్ నంబర్‌తో ఇళ్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. అత్యధికంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో 34,664 ఇళ్లు జీరో నంబర్‌తో ఉండ‌డం అక్క‌డి వైసీపీ నేత‌ల చాతుర్యానికి నిద‌ర్శ‌నం. ఇక‌ ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 25వేల 562 ఇళ్లు ఉన్నాయి. జీరో నంబర్‌తో ఓట‌ర్ల‌ను ఎలా చేర్చుతార‌ని విప‌క్షాల వేస్తోన్న ప్ర‌శ్న‌. గోల్ మాల్ వ్య‌వ‌హారంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విప‌క్షాలు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ అండ్ టీమ్ దెబ్బ‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో పోయింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.