Janasena : జనసేన లో ఏంజరుగుతుంది..అధినేత సూచనలు బేఖాతర్..!!

అప్పటి వరకు పవన్ వెంటే మా అడుగులంటూ అన్నవారంతా..ఆ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ మారిపోయాడని , పార్టీ కోసం పనిచేసిన వారికే ద్రోహం చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 05:15 PM IST

జనసేన (Janasena) పార్టీ లో ఏంజరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. రెండు నెలల కిందటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై పార్టీ శ్రేణుల్లో , నేతల్లో ఓ నమ్మకం ఉండేది..పవన్ కళ్యాణ్ అందరికి న్యాయం చేస్తారని..పార్టీ కోసం పనిచేసిన నేతలకు ద్రోహం చేయడని అంత నమ్ముతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకొని సీట్లను కుదించారో అప్పటి నుండి జనసేన నేతల్లో , శ్రేణుల్లో ఓ అపనమ్మకం మొదలైంది. అప్పటి వరకు పవన్ వెంటే మా అడుగులంటూ అన్నవారంతా..ఆ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ మారిపోయాడని , పార్టీ కోసం పనిచేసిన వారికే ద్రోహం చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంతసేపు జగన్ ను ఓడించాలనే తపనే కానీ..పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికీ గుర్తింపు ఇద్దామని , కానీ వారి ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కానీ ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎంతసేపు టీడీపీ, బిజెపి భజన చేయడమే తప్ప..పార్టీ నేతల గురించి ఆలోచించడం మానేశారని వారంతా వాపోతున్నారు. ఇంతకాలం ఇలాంటి అతడి కోసమా పోరాటం చేసింది..కేసులు మీద వేసుకుందని మండిపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్స్ లేకపోయేసరికి అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పవన్ టికెట్ ఇచ్చిన , ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి చూపించాలని కసరత్తులు మొదలుపెట్టారు. పోతన మహేష్ , రాయల్ కిరణ్ తదితరులు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనీ పార్టీ శ్రేణులు , అభిమానులు కోరుతున్నారు. మీరెందుకు బరిలో నుండి తప్పుకోవడం మీరు పోటీ చెయ్యండి మీము దగ్గర ఉండి గెలిపిస్తాం అంటున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పలువురు నేతలపై కూడా కూటమి శ్రేణులే విమర్శలు చేస్తున్నారు. తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆ స్థానం నుంచి పోటీకి సరైన వ్యక్తి కాదన్న వాదన వినిపిస్తున్నారు. మొదటి రోజు శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తిరుపతిలో టీడీపీ నుంచి సుగుణమ్మ టికెట్ ఆశించారు. అయితే కూటమి లెక్కల్లో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. అధినాయకత్వం బుజ్జిగించడంతో కాస్త శాంతించినట్టు కనిపిస్తున్నా… తమకు సీటు కేటాయించి ఉంటే చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇచ్చే వాళ్లమంటూ చెప్పుకోస్తున్నారు.

జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు ఆఖరి నిమిషంలో జనసేనలో చేరి పార్టీ టికెట్ తీసుకున్నారు. ఆయనపై ఆనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికంగా కూడా ఆయనకు మంచి పేరు లేదని జనసేన శ్రేణులు అంటున్నారు. ఇలా అన్ని పార్టీల నేతలు ఆరణి శ్రీనివాసులుపై వ్యతిరేకంగా ఉండడం చూస్తే ఈయన గెలుపు కష్టమే అని అంటున్నారు. ఇక్కడ కిరణ్ రాయల్ కు ఛాన్స్ ఇచ్చిన బాగుండేదని అన్ని పార్టీల శ్రేణులు అంటున్నారు. మొత్తం మీద వ్యూహాలు నాకు వదిలెయ్యండి అని పదే పదే పవన్ చెపుతుంటే..ఏంచేస్తారో అనుకున్నామని..చివరకు చంద్రబాబు చెప్పినట్లే చేస్తుండడం తట్టుకోలేకపోతున్నామని జనసేన శ్రేణులు అంటున్నారు. మరి ముందు ముందు ఏంజరుగుతుందో చూడాలి.

 

Read Also : Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి