Site icon HashtagU Telugu

IT Raids : విజ‌య‌వాడ‌లో ఐటీ సోదాల క‌ల‌క‌లం.. ప్ర‌ముఖ బంగారం షాపుల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు

It Raids

It Raids

విజయవాడలో ఐటీ సోదాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కేంద్ర భద్రతా బలగాల నడుమ బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. బాంబే జువెల్లర్స్‌, ఆంజనేయ జువెలర్స్ షోరూమ్‌లలో ఈ సోదాలు చేస్తున్నారు. నో సేల్స్ బోర్డ్ తగిలించి మరీ డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోంది. షోరూమ్‌లో పనిచేసే సిబ్బందిని బయటకు పంపించి, అకౌంటెంట్లు, మేనేజర్ల సమక్షంలో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో.. అధికారులు ఆరాతీస్తున్నారు. గోల్డ్ క్రయ విక్రయాలకు సంబంధించి సాఫ్ట్‌, హార్ట్ కాపీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సీజ్ చేసిన కీలక డాక్యుమెంట్లపై కూపీ లాగుతున్నారు. విచారణలో హైదరాబాద్‌కు చెందిన జువెల్లర్‌ సంస్థల పాత్ర కూడా బయటపడినట్టు తెలుస్తోంది. ఆ దిశలో కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

Also Read:  AP : సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే ఏపీలో పేద‌లంద‌రికి ఇళ్లు.. రెండో విడ‌త‌లో ఇళ్ల నిర్మాణం పంపిణీకి స‌న్నాహాలు