Site icon HashtagU Telugu

AP News: కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరం : చంద్రబాబు నాయుడు

Check your Vote

Chandrababu Naidu meeting with Telangana TDP Leaders in Hyderabad NTR Trust Bhavan

AP News: విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది పై రకరకాల ఒత్తిళ్ళు ఉన్న మాట వాస్తవం అని, పగలు, రాత్రి తేడా అన్నది లేకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కానిస్టేబుళ్ల విషయంలో వారికి సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ లీవ్ బకాయిలు ఎన్నో నెలలుగా బకాయి పడింది ప్రభుత్వం. TA, DA బకాయిలు కూడా చెల్లించడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు

PRC ప్రకటన కూడా ఉద్యోగులను మోసం చేసిందని, చిత్తశుద్ధి ఉంటే పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను మొదట భర్తీ చేయాలని, అటు భర్తీ లేదు… ఇటు వీక్లీ ఆఫ్ లేదు అని మండిపడ్డారు. పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా అని, నిబంధనలకు విరుద్ధంగా పోలీసులను తమ అవినీతికి, అరాచకాలకు సహకరించమని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.