Site icon HashtagU Telugu

Pawan Kalyan : మాపై రాజకీయ విమర్శలు చేసినా.. ఆమెకు అండగా మేముంటాం: డిప్యూటీ సీఎం

It is our responsibility to protect YS Sharmila: Pawan Kalyan

It Is Our RespoIt is our responsibility to protect YS Sharmila: Pawan Kalyannsibility To

Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో దీపం పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదని ఆగ్రహించారు. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని తెలిపారు.

దీపం పథకం కింద ఏడాదికి 2,684 కోట్లు, ఐదేళ్లకు 13,425 కోట్లు ఖర్చు చేస్తుందని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు రోడ్లెక్కి పోరాటం చేయడంతో ప్రజల్లో ధైర్యం వచ్చిందన్నారు. 14ఏళ్ల క్రితం ఐ ఎస్ జగన్నాధపురం ఆలయానికి వచ్చాను..ఇక్కడ స్వయంబుగా వెలసిన లక్ష్మి నరసింహ స్వామినీ ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని తెలిపారు. అయితే ఆ నాయకుడి సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలంటోందని… ఆమెకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిదని తెలిపారు. షర్మిల..రేపు మాపై రాజకీయ విమర్శలు చేసినా ఆమెకు అండగా మేముంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

తమ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడానికి దీపం పథకానికి శ్రీకారం చుట్టిందని తెలియ జేశారు. ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారని అన్నారు. ప్రజలకు అన్యాయం చేసిన వైస్‌ఆర్‌సీపీ పార్టీ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగితే ఎవ్వరినీ వదిలేది లేదని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు.

Read Also: BJP : త్వరలోనే రాష్ట్రానికి కొత్త సీఎం రావోచ్చు: బీజేపీ ఎమ్మెల్యే