Site icon HashtagU Telugu

Chandrababu Naidu: పరువు గురించి ప్రభుత్వం మాట్లాడటం పెద్ద జోక్: చంద్రబాబు నాయుడు

CBN target

Chandra Babu To The Assembly For Anuradha, Tension To Ycp

తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు Pawan Kalyan పై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు…రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందని, ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి… ఈ అణచివేత ధోరణి మానుకోవాలి చంద్రబాబు హితవు పలికారు.

‘‘నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు…కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు…పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలి’’ అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.

‘‘ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయి. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి… రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి….మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి’’ అని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Also Read: AP Politics: టీడీపీకి జగన్ షాక్.. ఏపీలో ఆహా క్యాంటీన్లు!