Site icon HashtagU Telugu

CBN : ఛ‌లో రాజ‌మండ్రి.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా రేపు హైద‌రాబాద్ టూ రాజ‌మండ్రికి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ

CBN

CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ను ఖండిస్తూ తెలుగువారంతా ఆందోళ‌న చేస్తున్నారు. ఏపీలోనేకాక‌, ఇత‌ర రాష్ట్రాలు, దేశ‌,విదేశాల్లో ఉన్న తెలుగు వారు చంద్ర‌బాబు అభిమానులంతా ఆందోళ‌న చేస్తున్నారు. ఇటు ప్రధానంగా ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. హైద‌రాబాద్‌, బెంగుళూరు, చెన్నైలో ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబు కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌లు చేశారు. ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి చంద్ర‌బాబుతోనే సాధ్య‌మైంద‌ని వారు తెలిపారు.ఇప్పుడు తాజాగా ఐటీ ఉద్యోగులు రాజ‌మండ్రి బాట ప‌ట్ట‌నున్నారు. చంద్ర‌బాబుకు సంఘీభావంగా హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి రేపు భారీ కార్ల ర్యాలీని చేప‌ట్ట‌నున్నారు. అయితే హైదరాబాదు నుంచి ఐటీ ఉద్యోగులు తలపెట్టిన చలో రాజమండ్రిని అడ్డుకోవటానికి పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏపీ సరిహద్దు అయిన గరికపాడు వద్ద నుంచి అనుముంచి పల్లి వరకు మూడు పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ నుంచి వచ్చే వాహనాలను క్షుణంగా పరిశీలించి వారు ఎక్కడికి వెళ్తున్నారు అని పరిశీలించిన అనంతరమే ఏపీలోకి అనుమ‌తించ‌నున్నారు. సుమారు 150 నుంచి 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.