Site icon HashtagU Telugu

ISRO SSLV- D2 : SSLV-D2 రాకెట్ ప్రయోగం విజయవంతం..!

SSLV-D2

Resizeimagesize (1280 X 720) (1) 11zon

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చేపట్టిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (SSLV–D2) ప్రయోగం విజయవంతం అయ్యింది. శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై.. 6.30 గంటలపాటు కొనసాగింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, జానుస్‌-1, ఆజాదీ శాట్‌-2 అనే మూడు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 13నిమిషాల 2 సెక్టన్లలో ప్రయోగం పూర్తి అయ్యింది. ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్‌ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: Womens T20 World Cup 2023: నేటి నుండి మహిళల టీ20 వరల్డ్ కప్

ఈ SSLV–D2ఈవోఎస్‌-07 ఉపగ్రహంతోపాటు, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇది SSLV-D2 రెండవ అభివృద్ధి విమానం. 2022 ఆగస్టు 7న తొలి విమానం పాక్షికంగా విఫలమైంది. కక్ష్య క్రమరాహిత్యం, రాకెట్ విమాన మార్గంలో కొంత వ్యత్యాసం కారణంగా తొలి విమానం విఫలమైంది.