Telangana Politics: తెలంగాణ వేటలో జగనన్న బాణం

మరో పది రోజుల్లో  పాదయాత్రను ముగిస్తున్న వైయస్సార్ తెలంగాణ (Telangana) చీఫ్ షర్మిల ఎవరు వదిలిన బాణం? అనే టాక్ ఊపందుకుంది. (YSR)

  • Written By:
  • Updated On - December 4, 2022 / 06:51 PM IST

మరో పది రోజుల్లో  పాదయాత్రను ముగిస్తున్న వైయస్సార్ తెలంగాణ (Telangana) చీఫ్ షర్మిల ఎవరు వదిలిన బాణం? అనే టాక్ ఊపందుకుంది. తొలి రోజుల్లో కేసీఆర్ వదిలిన బాణంగా కొందరు బీజేపీ బాణంగా మరికొందరు చర్చించు కున్నారు. తెలంగాణలోని రెడ్డి, క్రిస్టియన్ వర్గాల ఓటును చీల్చడానికి గులాబీ చీఫ్ కేసీఆర్, జగన్ వ్యూహాత్మకంగా దింపారని బలంగా వినిపించింది. దానికి బలం ఇచ్చేలా ఆమె యాత్రపై టీఆర్ ఎస్ తొలిరోజుల్లో చప్పుడు చేయలేదు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాత్రం ఆమెను విమర్శించారు. తెలంగాణ (Telangana)కోడలిగా గౌరవిస్తూ చీర సారె వరకే పరిమితం , రాజ్యాధికారం అంటే కుదరదని రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆమె కేసీఆర్ వదిలిన బాణంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా చెబుతున్నారు.
బీజేపీ వదిలిన బాణం అంటూ తాజాగా టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఆ వాదన మీడియాలో మొదలుపెట్టారు. కానీ వైసీపీకి టీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ , బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో షర్మిల ఎవరు వదిలిన బాణం అనేది సందిగ్ధంగా ఉంది.
టీఆర్ఎస్ నేతలు షర్మిలపై మాత్రం అరకొర విమర్శలు చేస్తూ మౌనం దాలుస్తున్నారు. సరైన సమయం రాగానే షర్మిలను టార్గెట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు షర్మిలపై విమర్శలు వద్దని కేసీఆర్ ఆదేశించారని,అందుకే టీఆర్ఎస్ నేతలు షర్మిలపై పల్లెత్తు మాటలు మాట్లాడలేదని కాంగ్రెస్ నమ్ముతుంది. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలను షర్మిల తిట్టడం, ఆ తరువాత ఆమె కాన్వాయ్ లోని క్యార్ వాన్ కు గులాబీ టీం నిప్పుపెట్టడం, కారు అద్దాలు ధ్వంసం చేయడం సెంటిమెంట్ కోసం ఆంధ్ర ముద్రను మొదలుపెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం, ఇతర కేసుల వ్యవహారాలు పక్కదారి పట్టేలాగానే షర్మిలను టీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. షర్మిలను రెచ్చగొట్టి బీజేపీకి క్రేజ్ రాకుండా చేయడం ఇందులో చతురత అంటూ కొందరు భావిస్తున్నారు. షర్మిలను ఆంధ్రా అని మళ్లీ లోకల్-నాన్ లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా అంచనా వేస్తున్నారు.

విచిత్రంగా ప్రతిపక్షం ఏ పార్టీ ఉండాలో గులాబీ చీఫ్ నిర్ణయించటంలో తొలి నుంచి కేసీఆర్ విజయం సాధిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి బీజేపీ ని వ్యూహాత్మకంగా పైకి లేపారు. తెలంగాణలో టీఆర్ ఎస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉందని ప్రచారం తీసుకు రావటంలో విజయం సాధించారు. అసెంబ్లీ వేదికగా
ప్రతిపక్షం కాంగ్రెస్ ఉంది. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రతిపక్ష లాగా ఫోకస్ అయింది. ఇప్పుడు బీజేపీ బలపడినట్టు కనిపిస్తున్న టైంలో షర్మిలను ఫోకస్ చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ లాజిక్ గేమ్ గా కాంగ్రెస్ లీడర్లు గ్రహించారు. అందుకే కేసీఆర్ బాణంగా షర్మిలను భావిస్తున్నారు. ఇక బీజేపీ తాజా ఎపిసోడ్లో షర్మిలకు మద్దతుగా నిలిచింది. అందుకే, బీజేపీ వదిలిన బాణంగా గులాబీ పార్టీ చెబుతోంది. ఇదంతా ఆ మూడు పార్టీలు కలిసి ఆడుతున్న గేమ్ గా కాంగ్రెస్ విశ్వసిస్తుంది. మొత్తం మీద షర్మిల అందరి బాణంగా తెలంగాణలో కనిపిస్తున్నారు. ఎవరిని ఆ బాణం గాయ పరుస్తుందో చూడాలి.

Also Read: TRS To BRS: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. డిసెంబర్ 8 తర్వాత క్లారిటీ..?

Hashtagu Hindi Website