Site icon HashtagU Telugu

Veerasimha Reddy: జగన్ కు ‘వీరసింహారెడ్డి’ సెగ.. బాలయ్య డైలాగ్స్ వైరల్!

Veerasimha Reddy

Veerasimha Reddy

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veerasimha Reddy) చిత్రంపై జగన్‌ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.  అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. బిట్లు బిట్లుగా ఉన్న వీడియోలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. వాటిని Veerasimha Reddy చిత్రంలో  ఏ సందర్భంలో అన్నారు.. ఎవరినుద్దేశించి అన్నారో స్వయంగా తెలుసుకోవడానికి కొందరు కీలక అధికారులు గురువారం అర్ధరాత్రి ఆ సినిమా చూసినట్లు తెలిసింది. సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నాయని గుర్తించారు. ప్రభుత్వ పెద్దలకు నివేదించారు. దీంతో ఈ సినిమా సంగతేంటో చూడాలని ప్రభుత్వం (AP Govt) నిర్ణయించినట్లు సమాచారం.

‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేదు’’ అనే డైలాగ్ వినగానే అందరికీ బాలయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడని స్పష్టంగా అర్థమైపోయింది. సినిమాలో ఇలాంటి పంచులు మరిన్ని ఉంటాయనే సంకేతాలు కనిపించాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ‘వీరసింహారెడ్డి’ (Veerasimha Reddy) లో జగన్ సర్కారు టార్గెట్ చేశాడని, ఎక్కడా పేర్లు ప్రస్తావించకపోయినా.. జగన్ అండ్ కోకు తగిలే డైలాగులు సినిమాలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఒక సీన్లో హోం మినిస్టర్.. మేం చేస్తున్న అభివృద్ధి కనిపించలేదా అంటాడు. దానికి బదులుగా బాలయ్య గట్టిగా నవ్వి.. ‘‘ఏది అభివృద్ధి? ప్రజలకు మంచి చేస్తే అభివృద్ధి వాళ్లను వేధించడం ఏం అభివృద్ధి? కొత్త పరిశ్రమలు స్థాపించడం అభివృద్ధి.. మూసేయడం అభివృద్ధా? కొత్త భవనాలు నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం అభివృద్ధా? జీతాలు టైంకి ఇవ్వడం అభివృద్ధి.. బిక్షం వేసినట్లు వేయడం అభివృద్ధా..’’ అంటూ జగన్ సర్కారుకు (AP Govt) సూటిగా తాకేలా పంచులు పేల్చాడు బాలయ్య. ప్రస్తుతం వీరసింహారెడ్డి డైలాగ్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: Hyderabad Highway: సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా నిలిచినపోయిన వాహనాలు!